News
News
వీడియోలు ఆటలు
X

Tirumala Darshan News: ఏడుకొండలపై కొనసాగుతున్న భక్తుల రద్దీ, దర్శన సమయం ఎంతంటే

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు.

FOLLOW US: 
Share:

తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టిటిడి రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో‌ భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టిటిడి నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున 81,700 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 27,982 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 4.20 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 07 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండగా, టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు మూడు గంటల సమయం పడుతుంది.  

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.  

సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టిటిడి. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతిర "సోమవారం" రోజు నిర్వహించే "చతుర్ధశ కలశ విశేష పూజ" ను టిటిడి రద్దు చేసింది. ఉత్సవమూర్తుల విగ్రహాలు పరిరక్షణలో‌ భాగంగా టిటిడి‌ రద్దు చేసింది. అనంతరం  సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

Published at : 20 Mar 2023 09:01 AM (IST) Tags: Tirumala Tirupati Tirumala Darshan news Srivari Hundi Income Sri venkateshwara swamy Darshan time

సంబంధిత కథనాలు

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్‌ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!

AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్‌ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్‌ టూర్‌లో కేటీఆర్

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్‌ టూర్‌లో కేటీఆర్

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

AP KGBV: కేజీబీవీల్లో 1,358 పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!

AP KGBV: కేజీబీవీల్లో 1,358  పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!

టాప్ స్టోరీస్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?

Janasena News : జనసేనలోకి ఆమంచి  కృష్ణమోహన్ సోదరుడు -  చీరాలపై గురి పెట్టారా ?

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి  ప్రత్యేక పార్కింగ్ స్థలాలు