అన్వేషించండి

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి అన్ని గంటలు వేచి చూడాలి: టీటీడీ

Tirumala: సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లల్లో భక్తులతో నిండి పోయి అన్నదానం సత్రంకు సమీపంలోని శ్రీవారి సేవాసదన్ వరకూ భక్తిలు క్యూలైన్స్ లో వేచి‌ ఉన్నారు.

Devotees Heavy rush at Tirumala: తిరుపతి : ఏడు కొండల్లో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు, వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు‌ పోటెత్తారు. సప్తగిరీషుడు, శేషాద్రి నిలయుడైన శ్రీనివాసుడి దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల గోవింద నామ స్మరణలతో‌ మారుమ్రోగుతుంది. శనివారం 13-08-2022 రోజున 83,422 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 50,100 మంది తలనీలాలు సమర్పించగా, 4.27 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లల్లో భక్తులతో నిండి పోయి అన్నదానం సత్రానికి సమీపంలోని శ్రీవారి సేవాసదన్ వరకూ భక్తులు క్యూలైన్లలో వేచి‌ ఉన్నారు. ఇక స్వామి వారి సర్వదర్శనానికి 40 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. 

ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలుకొలిపారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు అర్చకులు. ముందు రోజు రాత్రి పవళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుపుతారు అర్చకులు. దీనినే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు.

గొల్ల హారతి సమర్పణ, కర్పూర నీరాజనం 
శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దిన తరువాత గొల్ల హారతి సమర్పణ జరుగుతుంది. తర్వాత వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మ తీర్థాన్ని తాము స్వీకరించిన తరువాత జియ్యంగార్లలకు, సన్నిధి గొల్లకు బ్రహ్మతీర్థంను అందిస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి, తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు. ఈ సమయంలో జరిగే దర్శనానికి విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు. అనంతరం భోగ శ్రీనివాసమూర్తి వారికి స్నాన పీఠంపై వేయించేపు చేసిన అర్చకులు. తోమాల సేవ ప్రారంభిస్తారు. ముందుగా ఆకాశగంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత శ్రీవారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు యధాక్రమం తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం పరదా వేసి ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు.

శ్రీవారి మూలవిరాట్ కు ఆసనం, పాద్యం, అర్ఘ్యం,అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది. అటుతరువాత వక్షఃస్ధల లక్ష్మీ, పద్మావతి తాయార్లకు, శ్రీ భోగ శ్రీనివాస మూర్తి వారికి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారికి సీతా, లక్ష్మణ, రాములవారికి, రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి వారికి సాలగ్రామ, శఠారిలకు శ్రీ సుదర్శనల వారికి విమాన వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు.ఈ తంతుతో తోమాల సేవ పూర్తి అవుతుంది. అటు తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు. 

శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేసి, సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలోని 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన నిర్వహిస్తారు. అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు. అటు తరువాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది. స్వామి వారి ప్రాతఃకాల నైవేధ్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు. అటు తర్వాత సన్నిధిలో శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహించిన తరువాత సర్కారు వారి హారతి జరిపి విఐపి బ్రేక్‌ దర్శనంకు భక్తులను అనుమతిస్తారు. అటు తర్వాత శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు.

స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విమాన ప్రకారం ప్రదక్షిణ దిశగా చేస్తూ కళ్యాణోత్సవ మండపంకు వేంచేపు చేసి, స్వామి అమ్మవార్ల కు కళ్యాణోత్సవం కార్యక్రమంను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అర్చకులు. శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అర్చకులు. అటుతరువాత సహ్రదీపాలంకరణ సేవ నిర్వహించిన‌ అర్చకులు, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.అనంతరం ఆలయంకు చేరుకున్న అనంతరం సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు అర్చకులు. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలో అలంకరించిన పుష్పమాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల,రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహించి సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Perni Nani Wife Jayasudha : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
AP In WEF 2025: దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియోఅమెరికాలో తెలుగు యూత్ పాడు పని! కేటీఆర్, బండి సంజయ్‌ అనుచరులేనా?Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Perni Nani Wife Jayasudha : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
AP In WEF 2025: దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మరింత విస్తరణ- మేడ్చల్ వరకూ పొడిగింపు - డీపీఆర్‌కు రేవంత్ ఆదేశం
హైదరాబాద్ మెట్రో మరింత విస్తరణ- మేడ్చల్ వరకూ పొడిగింపు - డీపీఆర్‌కు రేవంత్ ఆదేశం
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
Lucknow Crime News : అక్కాచెల్లెళ్లను హైదరాాబాద్‌లో అమ్మేస్తారని చంపేశా - సంచలనం రేపుతున్న లక్నో హత్య కేసు నిందితుడి వీడియో
అక్కాచెల్లెళ్లను హైదరాాబాద్‌లో అమ్మేస్తారని చంపేశా - సంచలనం రేపుతున్న లక్నో హత్య కేసు నిందితుడి వీడియో
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Embed widget