SC On Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీంకోర్టు
Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదంలో స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇలా అయితే ఎలాంటి రాజకీయ జోక్యానికి ఛాన్స్ ఉండదని స్పష్టం చేసింది.
Tirumala Laddu Row:తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టులో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని సూచించింది. ఇద్దరు ప్రస్తుతం వేసిన సిట్ నుంచి సభ్యులుగా ఉంటారు. ఇంకో ఇద్దరు సిబీఐ నుంచి తీసుకొస్తారు. మరొ వ్యక్తి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐఏ నుంచి ఉండే అవకాశం ఉంది. ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్ నాయకత్వం వహించబోతున్నారు. మొత్తం దర్యాప్తును సిబీఐ డెరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షించబోతున్నారు.
తిరుమల వివాదంపై పదిన్నరకు సుప్రీంకోర్టులో ప్రారంభమైన విచారణలో కేంద్రం తరఫున తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రస్తుతం లడ్డూ వివాదంలో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని అది కొనసాగితే మంచిదన్నారు. ఆ సిట్ సభ్యులపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారిపై నమ్మకం ఉందని పేర్కొన్నారు.
దీనిపై పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన కపిల్ సిబాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం కూడా ప్రభుత్వంలో ఉన్న మరో కీలకమైన వ్యక్తి తిరుమల లడ్డూ వివాదంపై మాట్లాడారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు ఇలా మాట్లాడుతుంటే సిట్ దర్యాప్తుపై ప్రభావం పడుతుందని అందుకే సిట్‌పై తమకు పూర్తిగా నమ్మకం లేదని అన్నారు.
అన్ని వర్గాల చి వాదనలు విన్న సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు జరిపితే మంచిదని జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ అభిప్రాయపడింది. ఇలా అయితే రాజకీయ జోక్యం అనే అనుమానం లేకుండా ఉంటుందని తెలిపారు. ఈ స్వతంత్ర దర్యాప్తులో కేంద్ర రాష్ట్ర అధికారులతోపాటు ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి అధికారులు ఉంటే మంచిదన్నారు.
అసలేం జరిగింది
పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో జంతువు కొవ్వు కలిపారనే నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయని చంద్రబాబు చెప్పడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశంలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన నివేదికలను కూడా ప్రభుత్వం బహిర్గతం చేసింది. టీటీడీ ఈవో కూడా ఆ విషయాన్ని ద్రువీకరించారు. ఇలా అధికారికంగానే సమాచారం బయటకు రావడంతో భక్తుల్లో ఆగ్రహం మిన్నంటింది.
వైసీపీ హయాంలో తిరుమలను ఓ టూరిస్ట్ స్పాట్‌గా చేసుకొని దోచుకున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి వైసీపీ నుంచి కూడా గట్టి కొంటర్ వచ్చింది. అలాంటివి తమ హయాంలో జరగలేదని జరిగే అవకాశం లేదని అన్నారు. తిరుమలలో చాలా పటిష్టమైన ఫిల్టరింగ్ వ్యవస్థలు ఉన్నాయని అన్నారు. తిరుమలకు కల్తీ నెయ్యి రావడం తిప్పి పంపడం చాలాసార్లు జరిగిందని గుర్తు చేశారు జగన్. ఈసారి కూడా అదే జరిగిందని అలా కల్తీ నెయ్యి వాహనాలు తిప్పి పంపేశారని చెప్పుకొచ్చారు. అలా పంపినప్పుడు కల్తీ జరిగిందని ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించింది.
కోర్టుకు ఎవరు వెళ్లారు
ఈ విషయంలో నిజానిజాలు నిగ్గుతేల్చాలని వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి, బీజేపీ లీడర్ సుబ్రమణ్యంతోపాటు మరో ఇద్దరు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ విచారణ జరుగుతున్న టైంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వివాదంపై సిట్ వేసి విచారణ చేపట్టింది.
ఆ దర్యాప్తు సాగుతున్న టైంలోనే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఓ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న సీఎం ఎలాంటి ఆధారాలు లేకుండా కల్తీ నెయ్యితో లడ్డూలు తయారైనట్టు ఎలా చెబుతారని ప్రశ్నించింది. సిట్ దర్యాప్తు వేసే ఉద్దేశం ఉంటే మీడియా ముందుకు ప్రకటనలు ఎందుకు చేశారని నిలదీసింది. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని రిక్వస్ట్చేసింది. అనంతరం విచారణ మూడో తేదీకి వాయిదా వేసింది.
మూడో తేదీనాడు విచారణ చేపట్టిన వెంటనే తమకు స్పందించేందుకు మరింత సమయం కావాలని కేంద్రం తరఫున తుషార్ మెహతా కోరడంతో ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవాళ పూర్తి స్థాయివిచారణ జరిపి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది.
Also Read: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం