Parakamani Complainant Satish Kumar : సతీష్ కుమార్ మృతి కేసులో కీలక మలుపు- పరకామణి చోరీతో లింక్ ఉందన్న కుటుంబ సభ్యులు !
Parakamani Complainant Satish Kumar : పరకాణి చోరీ కేసు అనేక మలుపు తిరుగుతోంది. ఇప్పుడు ఇందులో కీలక వ్యక్తిగా ఉన్న సతీష్ మృతితో ఆ కేసు మరో టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.

Parakamani Complainant Satish Kumar : తిరుమల పరకామణిలో విదేశీ డాలర్లు చోరీకి గురయ్యాయని గతంలో ఫిర్యాదు చేసి సతీష్ మృతి కేసు సంచలనంగా మారుతోంది. విచారణకు బయల్దేరిన ఆయన రైలు పట్టాలై విగతజీవుడిగా పడి ఉండట అనేక అనుమానాలకు తావిస్తోంది. మొదట్లో ఇది ఆత్మహత్య అంటూ ప్రచారం జరిగింది. తర్వాత కుటుంబ సభ్యుల దీనిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య కేసులో నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
టీటీడీలో ఏవీఎస్వోగా పని చేసిన సతీష్ కుమార్ పరకామణిలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. తర్వాత ఈ కేసులో ఆయన్ని కీలక వ్యక్తిగా దర్యాప్తు అధికారులు భావించి విచారణ చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే సిట్ ముందు ఒకసారి హాజరయ్యారు. శుక్రవారం విచారణకు వస్తున్న క్రమంలో హఠాత్తుగా రైలు పట్టాలపై చనిపోయి పడి ఉన్నారు. ఇది రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రభుత్వం కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకొని కేసును దర్యాప్తు చేస్తోంది.
ప్రస్తుతం గుంతకల్లు డివిజన్లో పని చేస్తున్నారు. పరకామణి చోరీ కేసులో ఇప్పటికే ఈనెల ఆరో తేదీన విచారణ ఎదుర్కొన్నారు. శుక్రవారం విచారణ కోసం ఆయన గుంతకల్లు నుంచి ట్రైన్లో బయల్దేరారు. ఉదయానికి విజయవాడ చేసుకొని ఉంటారని ఫ్యామిలీ భావించింది. కానీ ఆయన తాడిపత్రి మండలం కోమలి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాల పక్కన శవమై కనిపించాడు. ఇది అందర్నీ షాక్కి గురి చేసింది.
మొదట్లో ఇది ఆత్మహత్య అంటూ ప్రచారం జరిగింది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం సతీష్ మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. గుత్తి జీఆర్పీపీఎస్లో బంధువులు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఎఆర్ నం.75/2025గా కేసు నమోదు చేసిన పోలీసులు హత్యగా నిర్దారిస్తూ దర్యాప్తు ప్రారంభించారు.





















