అన్వేషించండి

ఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశంపై లోకేష్ కీలక వ్యాఖ్యలు- చిరంజీవి అభిమానినంటూ కామెంట్‌

విద్యార్థులు, యువత అడిగిన చాలా ప్రశ్నలకు లోకేష్‌ సమాధానం చెప్పారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, తన వెయిట్ లాస్‌, పింక్ డైమండ్‌ లాంటి చాలా అనుమానాలపై మాట్లాడి నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతిలో జరుగుతున్న పాదయాత్ర లో కీలక వ్యాఖ్యలు చేశారు. హలో లోకేష్‌ పేరుతో విద్యార్థులతో ముఖా ముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై మాట్లాడారు. 

పాదయాత్ర లో భాగంగా నారా లోకేష్ విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను చెప్పాల్సింది చెప్పిన లోకేష్‌ తర్వాత విద్యార్థులు, యువత అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, తన వెయిట్ లాస్‌, పింక్ డైమండ్‌ లాంటి చాలా అనుమానాలపై మాట్లాడి నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. 

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా వందకు వంద శాతం ఆహ్వానిస్తామన్నారు. ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆహ్వానిస్తున్నారో... రాష్ట్రం అగ్రస్థానానికి ఆంధ్రులు అగ్రస్థానానికి వెళ్లాలని కోరుకునే వాళ్లంతా రాజకీయాల్లోకి రావాలన్నారు. రాజకీయాల్లో కావాల్సింది మంచి మనసు అన్నారు. అది ఉంటే ఏదైనా అదిగమించవచ్చన్నారు. తాను 2014లో పవన్‌ కలిసినప్పుడు మంచి మనసు చూశా అన్నారు. ఏపీలో మంచి ప్రభుత్వం రావాలి... ఏపీని ముందుకు తీసుకెళ్లాలనే తాపత్రయం చూశాను అన్నారు. అలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలన్నారు. అలాంటి వాళ్లు సమాజాన్ని ముందుకు నడిపించాలని సూచించారు. సినిమా స్టార్స్, పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది. సమాజంలో మార్పు తీసుకురావాలాన్నా, రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్నా వీళ్లతోనే సాధ్యమన్నారు. అలాంటి వారంతా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. 

ఇప్పటికే తొమ్మిది శాతం పాదయాత్రే చేశారని ఇంకా నాలుగు వేల కిలోమీటర్లు నడవాల్సి ఉందని దీన్ని చేస్తారని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు తగ్గేదేలే అని సమాధానం చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్ర కొనసాగుతుందన్నారు లోకేష్. ప్రభుత్వం సహకరిస్తే పాదయాత్ర జరుగుతుందని... లేకుంటే దండయాత్ర చేస్తామన్నారు. వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామన్నారు. ఎన్ని సమస్యలు సృష్టించినా ఏపీ భవిష్యత్ కోసం చేస్తున్న పాదయాత్రలో తగ్గేదే లేదన్నారు. 

ఇప్పటికి 350 కిలోమీటర్ల పాదయాత్రలో సంతోషకరమైన ఘటన ఏదైనా ఉందా అంటే... తాను మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన పరిశ్రమల ముందు సెల్ఫీలు దిగుతుంటే.. అక్కడ పని చేసే సిబ్బందితో మాట్లాడుతున్నప్పుడు ఆనందంగా ఉందన్నారు. అక్కడి వారంతా మాట్లాడుతూ... మీ వల్లే ఈ పరిశ్రమ వచ్చిందని... తాము పని చేస్తున్నామని చెబుతుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. 
మీకు  ఉన్న విజ్ఞన్ ఏంటని అడిగిన ప్రశ్నకు సమాధానంగా... అన్నిరంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలబడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇంకా ఎన్ని రోజులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పని చేస్తామని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఒక్కో జిల్లాకు ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిందన్నారు. ఒక్కో జిల్లాను హైదరాబాద్‌లా తీర్చిదిద్దేలా చేయడమే తమ అజెండా అన్నారు.  

ఏపీలోని ప్రతి యువకుడికి ఉద్యోగాన్ని కల్పించి అదే రిటర్న్‌ గిఫ్ట్‌గా జగన్‌కు ఇస్తానన్నారు లోకేష్‌. యువతకు అనేక హామీలు ఇచ్చి మాట తప్పిన వ్యక్తికి అదే సరైన గుణపాఠంగా భావిస్తునట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు బ్రాండ్లు ఉన్నాయని.. ఒకటి చంద్రబాబు అయితే ఇంకొకటి జగన్ అని చెప్పారు. చంద్రబాబు పేరు వింటే బిల్‌గేట్స్ లాంటి వాళ్లంతా ఆంధ్రప్రదేశ్‌వైపు చూస్తున్నారన్నారు. అదే రెండో బ్రాండ్‌ జగన్‌ మాత్రం ఎప్పుడూ జైలు వైపే చూస్తారన్నారు. అందుకే జైలు బ్రాండ్ కావాలా... లేకుంటే మన భవిష్యత్‌ను ఆయన బాధ్యతగా భావించే బాబు కావాలా అని ప్రశ్నించారు లోకేష్. 

బాలయ్యేనే మీ ఫేవరేట్ నటుడు అంటే... తాను మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్‌ను అన్నారు లోకేష్‌. ఏంతైనా బాలయ్య తన ముద్దులు మామయ్యని అన్నారు. బాలయ్య అన్‌స్టాపబుల్ అన్నారు. బాలయ్య సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఫస్ట్‌డే ఫస్ట్ షోలో లోకేష్ ఉంటారన్నారు. 

స్లిమ్‌గా ఫిట్‌గా ఉండటానికి కారణమేంటీ అంటే బ్రహ్మణీ అని సమాధానం చెప్పారు లోకేష్. కరోనా టైంలో తన డైట్‌ మొత్తాన్ని బ్రహ్మణీ మార్చేశారన్నారు. అంతకు ముందు ఇష్టం వచ్చినట్టు తినేసేవాడినని చెప్పారు. ఇప్పుడు పాదయాత్రలో కూడా అప్పుడప్పుడు ఇష్టం వచ్చినట్టు తింటున్నానంటూ వెల్లడించారు. ఏం తిన్నా వెంటనే తనకు మెసేజ్ వస్తుందన్నారు. 

పింక్‌డైమండ్‌ లొల్లి ఏంటని మరో విద్యార్థి ప్రశ్నించాడు. తన స్నేహితురాలికి గిఫ్ట్‌గా ఇవ్వాలంటూ చెప్పుకొచ్చాడా విద్యార్థి. ఈ లొల్లి ఏంటో తనకు అర్థం కాలేదన్నారు లోకేష్. ఇంకా వెతుకుతున్నాను అన్నారు. దీనికి విజయసాయిరెడ్డి మాత్రమే సమాధానం చెప్పాలన్నారు. వెంకటేశ్వర స్వామికి ఎలాంటి నష్టం చేయాలని చూసినా వాళ్లకు భవిష్యత్‌ లేదన్నారు. గతంలో ఈ పింక్‌డైమండ్‌పై విమర్శలు చేసిన వాళ్లు నాలుగేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. ఆరోపణలు చేయడం చాలా తేలికని అన్నారు. తాను తప్పు చేయలేదని... అందుకే దర్జాగా నడిరోడ్డుపై పాదయాత్ర చేస్తున్నానని.. గెలిచిన వ్యక్తి మాత్రం పరదాల మాటున తిరుగుతున్నారని ఆరోపించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Child In Borewell: 68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
Deed Body Parcel Case Update: ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Embed widget