(Source: ECI/ABP News/ABP Majha)
RK Roja: ఎంపీ న్యూడ్ వీడియోపై మంత్రి రోజా స్పందన, వాళ్లిద్దర్నీ అంత మాట అనేశారే!
ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా కనిపిస్తున్న ఆ వీడియో బయటికి రావడం విపక్షాల విమర్శలకు బాగా అవకాశం ఇచ్చినట్లయింది. ఆ వీడియో మార్ఫింగ్ చేయలేదని, అత్యంత సహజంగానే ఉందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. ఎంపీకి సంబంధించి వైరల్ అయిన ఆ వీడియో నిజమో కాదో తెలియదని మంత్రి రోజా అన్నారు. వీడియోకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాకే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని స్పందించారు. ఈ సందర్భంగా ఆమె తెలుగుదేశం పార్టీపైన విమర్శలు చేశారు. టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళలపై ఎన్నో అకృత్యాలు జరిగాయని, అయినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. నారాయణ విద్యా సంస్థల్లో కూడా గతంలో విద్యార్థినులు వేధింపులకు గురయ్యారని, వారిపై ఒక్క కేసు కూడా అప్పుడు పెట్టలేదని రోజా ఆరోపించారు. అలాంటప్పుడు చంద్రబాబు, లోకేశ్ వంద సార్ల రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీకి సంబంధించిన వీడియో నిజమో, కాదో తెలుసుకోకుండా టీడీపీపై విమర్శలు చేయడం సరికాదని రోజా అన్నారు. మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా కనిపిస్తున్న ఆ వీడియో బయటికి రావడం విపక్షాల విమర్శలకు బాగా అవకాశం ఇచ్చినట్లయింది. ఆ వీడియో మార్ఫింగ్ చేయలేదని, అత్యంత సహజంగానే ఉందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. టీడీపీ నేతలు తమదైన శైలిలో విమర్శలను ఎక్కుపెడుతున్నారు. కొంత మంది మీమ్స్ చేసి కామెడీ తరహాలో క్లిప్స్ రూపొందించి సోషల్ మీడియాలో వదులుతున్నారు. అవి మరీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
నగ్న వీడియో బహిర్గతం అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ మౌన పాత్రపై కూడా విపరీతమైన విమర్శలు టీడీపీ నేతలు చేశారు. టీడీపీ నేతలు చిన్న విషయాల్లో పట్టుబడినా స్పందించే మహిళా కమిషన్, వైఎస్ఆర్ సీపీ ఎంపీ అడ్డంగా దొరికిపోతే మిన్నకుండిపోయిందని మాటల దాడి చేశారు. దీంతో రెండు రోజుల క్రితం మహిళా కమిషన్ డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. వీడియోని నిజనిర్ధారణ చేసి నిజమేనని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇక ఈ నగ్న వీడియో వ్యవహారంలో సీఎం జగన్ సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, ఆ వీడియో రిలీజ్ అయిన రోజే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆ వీడియో కనుక నిజమని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
గోరంట్ల వివరణ
ఈ వీడియోను సోషల్ మీడియాలో టీడీపీ నేతలే మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. నగ్న వీడియో విడుదలైన కాసేపటికే ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ విషయంలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. ఈ విషయంపై ఎస్పీకి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఎంపీ మాధవ్ వివరించారు. ఈ కుట్ర వెనుక టీడీపీకి చెందిన ముగ్గురు నాయకులు ఉన్నారని ఆయన ఆరోపించారు. తనపై కుట్ర పన్నిన ముగ్గురిపై పరువు నష్టం దావా వేస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. తాను జిమ్ చేస్తుండగా రికార్డు చేసిన వీడియోను మార్ఫింగ్ చేసి వీడియో వైరల్ చేస్తున్నారని గోరంట్ల మాధవ్ అన్నారు.