IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT
IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK

Tirupati News: అక్క జోలికి రావద్దని జిమ్‌ ట్రైనర్‌కు ఓ యువకుడి వార్నింగ్- తెల్లారే సరికి డెడ్‌ బాడిగా మారిన కుర్రాడు

ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడు. మాట వినక పోవడంతో ప్రియురాలి తమ్ముడిని కిరాతకంగా హత్య చేశాడు ఓ జిమ్ ట్రైనర్.. అసలు ఏమైందో తెలుసా..

FOLLOW US: 

ప్రేమ‌ పేరుతో యువతికి దగ్గర అయ్యే ప్రయత్నం చేశాడు ఓ జిమ్ ట్రైనర్. ఏదో రకంగా ఆమెతో మాట్లాడాలని ట్రై చేసేవాడు. కానీ 
అవేమీ పట్టించుకో లేదా యువతి. మాటలతో వేధించడం స్టార్ట్ చేశాడు. ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. బలవంతంగా చేయడమే కాదు బెదిరింపులకు కూడా దిగాడు. ప్రేమించక పోతే కుటుంబాన్ని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు జిమ్ ట్రైనర్. విషయం తెలుసుకున్న యువతి సోదరుడు జిమ్‌ట్రైనర్‌కు వార్నింగ్ ఇచ్చాడు. కొన్నిరోజులకే అతను హత్యకు గురికావడం సంచలనంగా మారింది. 

తిరుపతిలోని స్లిమ్ వరల్డ్‌లో గత సెప్టెంబరులో దాసరిమఠం ప్రాంతానికి చెందిన యువతి జిమ్‌ అక్కకోసం జాయిన్ అయింది. అక్కడే ట్రైనర్‌గా ఉన్న చంచయ్య ఆ అమ్మాయికి దగ్గరయ్యాడు. ఫోన్ నెంబర్ తీసుకుని రోజూ మెసేజ్‌లు, ఫోన్లు చేసేవాడు. కొన్నిరోజులు ఫ్రెండ్‌షిప్‌ పేరుతో సాగిన ఛాటింగ్ క్రమంగా వేరే దారి తీసుకుంది. అనుమానం వచ్చిన ఆ అమ్మాయి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చింది. తనకు ఫోన్ చేయొద్దని చెప్పింది. 
 
అమ్మాయి వార్నింగ్‌ ఇవ్వడంతో చంచయ్య డైరెక్ట్‌గా ప్రేమ సంగతి చెప్పేశాడు. ఆ యువతి నిరాకరించింది. అప్పటి నుంచి చంచయ్య వేధింపులు మితిమీరాయి. అమె జిమ్‌ మానేయడంతో చంచయ్య ఇంటికి వెళ్లి ఇబ్బందులకు గురి చేసేవాడు. ఇంతలో ఆమెకు వేరే వ్యక్తితో నిశ్చితార్థమైంది. విషయం తెలుసుకున్న చంచయ్య.. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరించాడు. కుటుంబాన్నే లేకుండా చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. 

చంచయ్య ప్రవర్తనతో కంగారు పడిన యువతి తన తమ్ముడికి విషయాన్ని చెప్పింది. చంచయ్య దగ్గరకు వెళ్ళిన యువతి తమ్ముడు తన అక్క వెంట పడొద్దని చెప్పాడు. దీంతో పగ పెంచుకున్న చంచయ్య.. యువతిని, ఆమె తమ్ముడిని చంపేందుకు ప్లాన్ వేశాడు. 

మాట్లాడుకుందామని చెప్పి చంద్రన్‌ను తను ఉండే ప్రాంతానికి రమ్మని చెప్పాడు. వచ్చిన వెంటనే ఒక్కసారిగా దాడి చేసి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ హత్య విషయం తెలుసుకున్న యువతి ఫ్యామిలీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు చంచయ్య కోసం గాలిస్తున్నారు. 

నాయకుల అండదండలతో ఏమైనా చేస్తారా...???

చంచయ్య స్లిమ్ వరల్డ్ జిమ్‌లో ట్రైనర్‌గా ఉన్న చంచయ్య.. రాజకీయ ప్రముఖులకు జిమ్ ట్రైనింగ్ ఇస్తున్నాడని లోకల్‌గా టాక్ వినిపిస్తుంది. వాళ్ల పేరు చెప్పి రెచ్చిపోతున్నాడని స్థానికులు చెబుతున్నారు. తనకు ఫోన్ చేసిన ప్రతిసారీ రాజకీయ అండతో ఏం చేసినా అడిగే వారు లేరని వార్నింగ్‌ ఇచ్చేవాడని.. అందుకే తన తమ్ముడ్ని చంపేశాడని బాధిత యువతి ఆరోపిస్తుంది. హత్య చేసినా జైలుకు వెళ్లి ఒక్క రోజులో తిరిగి బయటకు వస్తానని చెప్పేవాడట. నిందుతుడు చంచయ్య నుంచి తన కుటుంబానికి ప్రమాదం ఉందని వాపోతుంది బాధిత యువతి. 

Published at : 27 Apr 2022 03:18 PM (IST) Tags: Tirupati News Crime News Murder case Gym Trainer

సంబంధిత కథనాలు

Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత

Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత

Tirupati News: గుమస్తా భార్యపై బంగారం దొంగతనం కేసు- విచారించిన పోలీసులు యజమానిపైనే రేప్‌ కేస్‌ పెట్టారు

Tirupati News: గుమస్తా భార్యపై బంగారం దొంగతనం కేసు- విచారించిన పోలీసులు యజమానిపైనే రేప్‌ కేస్‌ పెట్టారు

Tirumala Garuda Seva: శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ, వర్షాన్ని లెక్కచేయని భక్తులు

Tirumala Garuda Seva: శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ, వర్షాన్ని లెక్కచేయని భక్తులు

Tirupati Mokkulu: వాట్ ఎన్ ఐడియా సర్ జీ! ఇట్లా కూడా దేవుడి మొక్కులు తీర్చుకోవచ్చా? వైరల్ అవుతున్న వీడియో

Tirupati Mokkulu: వాట్ ఎన్ ఐడియా సర్ జీ! ఇట్లా కూడా దేవుడి మొక్కులు తీర్చుకోవచ్చా? వైరల్ అవుతున్న వీడియో

Annamayya District: 23 మంది వలంటీర్లు, ఉద్యోగుల సస్పెండ్, మళ్లీ 3 రోజుల్లోనే తిరిగి డ్యూటీకి - అసలు ఏమైందో తెలుసా?

Annamayya District: 23 మంది వలంటీర్లు, ఉద్యోగుల సస్పెండ్, మళ్లీ 3 రోజుల్లోనే తిరిగి డ్యూటీకి - అసలు ఏమైందో తెలుసా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Gyanvapi Mosque Survey Report: జ్ఞానవాపి మసీదులో ఆలయ అవశేషాల గుర్తింపు- వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేకులు!

Gyanvapi Mosque Survey Report: జ్ఞానవాపి మసీదులో ఆలయ అవశేషాల గుర్తింపు- వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేకులు!

Mahesh Babu vs Bollywood: మహేష్ బాబును నేషనల్ మీడియా టార్గెట్ చేసుకుందా? ఆ యాడ్‌పై ట్రోలింగ్!

Mahesh Babu vs Bollywood: మహేష్ బాబును నేషనల్ మీడియా టార్గెట్ చేసుకుందా? ఆ యాడ్‌పై ట్రోలింగ్!

Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Aadhi-Nikki Marriage: ఆది పినిశెట్టి-నిక్కీ పెళ్లి ఫొటోలు చూశారా?

Aadhi-Nikki Marriage: ఆది పినిశెట్టి-నిక్కీ పెళ్లి ఫొటోలు చూశారా?