అన్వేషించండి

Tirumala Rush: ఉత్తర ద్వార దర్శనం ఎఫెక్ట్‌- తిరుమలకు పెరిగిన ఆదాయం

Tirumala News: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. టీటీడీ ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే రూ.5కోట్లు దాటింది హుండీ ఆదాయం.

Tirumala Vaikunta Darshanam Rush: తిరుమల(Tirumala)లో కొలువైన వేంకటేశ్వరుడి(Venkateswara Swamy) దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఏడుకొండల వాడిని దర్శించుకుని  తరలించిపోతుంటారు. సాధారణ రోజుల్లోనే రద్దీ ఎక్కువగా ఉండే తిరుమలలో... ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు ఇంకా పెద్దసంఖ్యలో తరలివస్తారు భక్తులు. తిరుమల  శ్రీవారిని దర్శించుకునేందుకు పోటీపడతారు. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి. దీంతో... ఉత్తర ద్వార దర్శనం నుంచి తిరుమల  వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు భక్తులు. 

23న దర్శనాలు ప్రాంభం  

ఈనెల 23 నుంచి ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.... జనవరి 1 వరకు కొనసాగుతాయి. వైకుంఠ ఏకాదశి రోజు (శనివారం) 67వేల 909 మంది భక్తులు శ్రీవారిని  దర్శించుకోగా... వైకుంఠ ద్వాదశి నాడు(ఆదివారం) 63,519 మంది దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు టీటీటీ హుండీ ఆదాయం 2.5 కోట్లు రాగా... వైకుంఠ ద్వాదశి  నాడు(ఆదివారం) నాడు రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం 5.05 కోట్లు వచ్చింది. అంటే... వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తిరుమల హుండీ ఆదాయం 7.55 కోట్లు  వచ్చింది.

జనవరి 2, 2023న తిరుమల తిరుపతి దేవస్థానంలో రికార్డు స్థాయిలో 7.68 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఆ తర్వాత...  వైకుంఠ ద్వాదశి నాడు(ఆదివారం) మాత్రమే  శ్రీవారి హుండీ ఆదాయం భారీగా వచ్చింది. ఒక్క రోజే రూ.5.05 కోట్లు వసూలు అయ్యింది. చాలారోజుల తర్వాత రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం  సమకూరింది. భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయ కూడా భారీగా పెరిగింది. ఇక... ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరుతాయని భక్తుల  విశ్వాసం. అందుకే... వైకుంఠ ద్వార దర్శనాల వేళ తిరుమలలో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. దీంతో... జనవరి 1వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. 

మరోవైపు... తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడసేవ నిర్వహిస్తారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో అధ్యాయనోత్సవం నిర్వహిస్తున్నందున పౌర్ణమి గరుడసేవ ఉండదని టీటీడీ తెలిపింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On Avinash Reddy: వేరే వ్యక్తి భార్యను కాపురానికి పోనివ్వని అవినాష్ రెడ్డి - పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
వేరే వ్యక్తి భార్యను కాపురానికి పోనివ్వని అవినాష్ రెడ్డి - పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
TG Group 1 Results: తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్టు లింక్
తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్టు లింక్
KTR Chit Chat: మళ్లీ నోటీసులిస్తారు - అరెస్ట్ అని ప్రచారం చేస్తారు - కేటీఆర్ జోస్యం
మళ్లీ నోటీసులిస్తారు - అరెస్ట్ అని ప్రచారం చేస్తారు - కేటీఆర్ జోస్యం
Twitter outage: ఎక్స్ యూజర్లకు షాక్ - ప్రపంచవ్యాప్తంగా అంతరాయం - ఇంకా స్పందించని మస్క్
ఎక్స్ యూజర్లకు షాక్ - ప్రపంచవ్యాప్తంగా అంతరాయం - ఇంకా స్పందించని మస్క్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడాRohit Sharma Champions Trophy 2025 | 9నెలల్లో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మInd vs Nz Champions Trophy 2025 Final | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On Avinash Reddy: వేరే వ్యక్తి భార్యను కాపురానికి పోనివ్వని అవినాష్ రెడ్డి - పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
వేరే వ్యక్తి భార్యను కాపురానికి పోనివ్వని అవినాష్ రెడ్డి - పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
TG Group 1 Results: తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్టు లింక్
తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్టు లింక్
KTR Chit Chat: మళ్లీ నోటీసులిస్తారు - అరెస్ట్ అని ప్రచారం చేస్తారు - కేటీఆర్ జోస్యం
మళ్లీ నోటీసులిస్తారు - అరెస్ట్ అని ప్రచారం చేస్తారు - కేటీఆర్ జోస్యం
Twitter outage: ఎక్స్ యూజర్లకు షాక్ - ప్రపంచవ్యాప్తంగా అంతరాయం - ఇంకా స్పందించని మస్క్
ఎక్స్ యూజర్లకు షాక్ - ప్రపంచవ్యాప్తంగా అంతరాయం - ఇంకా స్పందించని మస్క్
Yanamala Rama Krishnudu: టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
Honor Killing Case: పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
Mahesh Babu: మహేష్ బాబు సినిమాకు రెండు వేర్వేరు క్లైమాక్స్‌లు.. షాక్‌లో సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్, ఎందుకో తెలుసా?
మహేష్ బాబు సినిమాకు రెండు వేర్వేరు క్లైమాక్స్‌లు.. షాక్‌లో సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్, ఎందుకో తెలుసా?
Jagga Reddy movie: టాలీవుడ్‌లోకి జగ్గారెడ్డి ఎంట్రీ - లవ్ స్టోరీలో ప్రధాన పాత్ర - ఇంత తీవ్ర నిర్ణయం ఎందుకంటే ?
టాలీవుడ్‌లోకి జగ్గారెడ్డి ఎంట్రీ - లవ్ స్టోరీలో ప్రధాన పాత్ర - ఇంత తీవ్ర నిర్ణయం ఎందుకంటే ?
Embed widget