అన్వేషించండి

Chittoor: రామచంద్ర యాదవ్‌కు Y+ కేటగిరి భద్రత, ఢిల్లీ నుంచి పుంగనూరుకు చేరుకున్న బలగాలు

చిత్తూరు జిల్లా, పుంగనూరుకు చెందిన జనసేన నేత రామచంద్ర యాదవ్ కు కేంద్ర ప్రభుత్వం అరుదైన Y+ కేటగిరి భద్రత కల్పించింది.

ఏపీ యువ నాయకుడు B. రామచంద్ర యాదవ్ కు కేంద్ర ప్రభుత్వం అరుదైన Y+ కేటగిరి భద్రత కల్పించింది. చిత్తూరు జిల్లా, పుంగనూరుకు చెందిన జనసేన నేత రామచంద్ర యాదవ్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తూ, సేవా కార్యక్రమాలు చేపట్టడాన్ని ఓర్వలేక అధికార పార్టీ నాయకులు పోలీసులు, రెవెన్యూ అధికారుల ద్వారా అడ్డుకోవడం జరుగుతోందని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. తన పోరాటాన్ని అడ్డుకోవడంతో పాటు అక్రమ కేసులను మంత్రి పెద్దిరెడ్డి పెట్టిస్తున్నారని చెప్పారు. ఆర్డీవో అధికారులు, పోలీసుల సాయంతో మంత్రి పెద్దిరెడ్డి తనపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కుటుంబానికి ప్రాణహాని ఉందని పదే పదే ఆరోపించిన రామచంద్ర యాదవ్ కేంద్రానికి ఈ విషయం తెలపగా తనకు Y+ కేటగిరి భద్రత కల్పించారని స్పష్టం చేశారు. 

హత్యా ప్రయత్నం ఆరోపణలు చేసిన రామచంద్ర యాదవ్ 
2022 డిసెంబర్ 4వ తేదీ వివిధ రంగాల రైతులకు జరుగుతున్న అన్యాయాలు, దోపిడీలు, సమస్యలపై సదుంలో రైతుభేరి బహిరంగసభ నిర్వహించకుండా పోలీసులు వివిధ కారణాలు చూపుతూ అడ్డుకున్నారు. పుంగనూరులో  ఆర్సీవై మెగా జాబ్ మేళా ద్వారా 10 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా పోలీసులు అడ్డుకోవడం, రైతు భేరిని అడ్డుకోవడం అలాంటి అనేక సంఘటనలు జరిగాయని ఓ వీడియో విడుదల చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయకుండా ఆయన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ప్రజలు, రైతుల సమస్యలపై నిలదీస్తే పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై మాట్లాడినందుకు తన ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు, వైసిపి కార్యకర్తలు 300 మంది దాడికి పాల్పడి తన కుటుంబంపై హత్యాయత్నానికి పాల్పడినట్లు ఈ నెల 11వ తేదీన  న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి వివరించానని చెప్పారు.

 పుంగనూరులో దౌర్జన్యాలు, ఇంటిపై దాడి, తమ కుటుంబంపై హత్యాయత్నంపై అమిత్ షా తన వద్ద సమాచారం ఉందని త్వరలోనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పిస్తానని భరోసా ఇచ్చిన 10 రోజుల్లోనే హోంశాఖ ద్వారా Y+ కేటగిరి భద్రత  మంజూరు చేసి పంపించారని తెలిపారు. తనకు భద్రత కల్పించిన కేంద్ర మంత్రి అమిత్ షాకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రామచంద్ర యాదవ్. రాబోయే రోజుల్లో వైసీపీ నేతలు, మంత్రి పెద్దిరెడ్డి రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలు, అవినీతిని అడ్డుకునేందుకు తన వంతు ప్రయత్నం కొనసాగిస్తానని రామచంద్ర యాదవ్ తెలిపారు.

దేశంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు Y+ భద్రత కల్పిస్తుంది. కేంద్ర సాయుధ పోలీసులు, కమాండోలతో ఇంటి వద్ద స్కానింగ్ భద్రత, దేశంలో ఎక్కడ పర్యటించినా రామచంద్ర యాదవ్ కు  రక్షణలో 24 గంటలు భద్రతా విధులు నిర్వహిస్తారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం y వై కేటగిరి భద్రత కల్పించగా యువ నాయకుడు రామచంద్ర యాదవ్ కు మాత్రం కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అరుదైన Y+ భద్రత కల్పించడం గమనార్హం. న్యూఢిల్లీ నుంచి  Y+ కేటగిరీకి చెందిన భద్రత సాయుధ పోలీసులు పుంగనూరుకు చేరుకున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget