అన్వేషించండి

Viral News: కుమారులనే కాడెద్దులుగా మార్చి వ్యవసాయం, కంటతడి పెట్టిస్తున్న రైతు కష్టమిది

AP Farmer Problems: వర్షాలు కురుస్తున్నాయని సంతోషించాలా, లేక ఆర్థిక స్థోమత లేని కారణంగా కుమారులనే కాడెద్దులుగా చేసి వ్యవసాయం చేస్తున్నానని బాధ పడాలో తెలియని పరిస్థితి ఈ చిత్తూరు జిల్లా రైతుది.

Rains In Chittoor: తిరుపతి : వ్యవసాయం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కాడెద్దులే. ఆధునిక కాలంలో వస్తున్న మార్పులతో వ్యవసాయం చేసేందుకు ట్రాక్టర్లు అధికంగా ఉపయోగిస్తున్నారు రైతులు. కానీ నేటికి కొందరు పేద రైతులు దుక్కి దున్నడంలో ఎక్కువగా ఉపయోగించేది కాడెద్దులే. ఈ కాడెద్దులను రైతుల నేస్తాలు అని కూడా పిలుస్తుంటారు.‌ ఎంత అభివృద్ధి చేందినా మనిషి కడుపు నిండుపు నింపే మెతులు భూమి నుండి‌ పడాల్సిందే.‌ ఒక్క మెతుకు వెనుక రైతన్న కష్టం ఎంతో ఉంటుంది. రేయింబవళ్ళు కష్ట పడి మరి రైతు వ్యవసాయం చేస్తుంటారు. ఆ పని తప్ప‌ మరోక పనిపై రైతు దృష్టి సారించడు. ఎంత కష్టం, నష్టం వచ్చినా రైతు అనే వాడు తాను నమ్ముకున్న వ్యవసాయంపైనే జీవనం సాగిస్తుంటారు. తాజాగా ఓ నిరుపేద రైతు తన కుమారులనే కాడెద్దులుగా మార్చి వ్యవసాయం చేసిన హృదయ విదారకరమైన సంఘటన చిత్తూరు జిల్లాలో కనిపించింది.

నిరుపేద రైతుకు ఎన్నో కష్టాలు..
చిత్తూరు జిల్లా, వి.కోట మండలం,‌ కుంబార్లపల్లె గ్రామంలో రైతు సమీవుల్లా తమ కుటుంబంతో కలిసి‌ నివాసం ఉంటున్నాడు. గ్రామంలో తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని‌ పోషించేవాడు. సమీవుల్లాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే వీరిని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలో చదివిస్తున్నాడు. సమీవుల్లా పేద రైతు కావడంతో అంతంత మాత్రమే ఆదాయం వచ్చేది.‌‌ వచ్చిన ఆదాయంతోనే కుటుంబ పోషణ చేస్తూనే తన ముగ్గురు పిల్లల చదువులకు అవసరం అయ్యే వస్తువులను సమకూర్చేవాడు. 

కోవిడ్19 కారణంగా గత రెండేళ్ళు సమీవుల్లా తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. తనకున్న వ్యవసాయ పొలంలో వివిధ రకాల ఆకు‌కూర పంటలు వేసి దాని ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబంను నెట్టుకు వచ్చేవాడు.‌ కరోనా వ్యాప్తి సమయంలో కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు కొంచెం కొంచెం తీర్చే ప్రయత్నం చేశాడు. కనీసం పంటకు చీడపీడలు, తెగులు పట్టిన సమయంలో మందులు సైతం కొనేందుకు సమీవుల్లా తీవ్రంగా ఇబ్బందులు‌ పడేవాడు. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులే తీర్చలేని స్ధితిలో ఉన్న సమీవుల్లా పొలం దున్నేందుకు ట్రాక్టరుకు సొమ్ము కేటాయించలేక పోయాడు. కాడెద్దులతో దున్నేందుకు కూడా సొమ్ము కేటాయించలేని సమీవుల్లా, తన ఇద్దరు కుమారులు, కుమార్తెల సహాయంతో పొలం దున్ని వ్యవసాయం చేయాలని భావించి, కాడెద్దుల స్ధానంలో కుమారులతో వ్యవసాయ పొలంను దుక్కి దున్నుతున్నాడు. ఈ హృదయ విదారక గటన చూసిన కొందరు స్ధానికులు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. 

వ్యవసాయంపై మమకారంతో తనకు స్ధొమత లేకున్నా పిల్లల సాయంతో కాడిపట్టి నాగలితో దుక్కి దున్ని, పాదులు చేయించాడు సమీవుల్లా, అంతే కాకుండా బురదమట్టిలో సైతం పిల్లల‌సాయంతో నాగలితో దున్నడం దుక్కించడంను చూసిన స్ధానికులు కన్నీళ్ళు పెట్టించింది.. తమ తండ్రి‌ నిస్సహాతను‌ గమనించిన కుమారులు, కునార్తే మేము ఉన్నాం అంటు తండ్రి సమీవుల్లాకు అండగా నిలబడి సహాయ సహకారాలు అందిస్తున్నారు.

గతంలో ఓ రైతుకు సోనూ సూద్ ట్రాక్టర్..
కరోనా టైమ్‌లో సొంత జిల్లా చిత్తూరు వచ్చిన రైతు నాగేశ్వరరావు మహల్‌ రాజపల్లిలో తన కుమార్తెలతో పొలం దున్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటుడు సోనూ సూద్ పెద్ద మనసుతో వారికి ట్రాక్టర్ కొనిచ్చారు. గంటల వ్యవధిలో రైతు కుటుంబానికి ట్రాక్టర్ అందజేశారు.

 Also Read: Rains in AP Telangana: దంచికొడుతున్న వర్షాలు - తెలంగాణలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఏపీలోనూ ఆ జిల్లాల్లో కుండపోత: IMD

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Israel-Iran Tension: పేజర్ పేలుడు నుంచి క్షిపణుల దాడి వరకు - ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 14 రోజుల్లో ఏం జరిగింది?
పేజర్ పేలుడు నుంచి క్షిపణుల దాడి వరకు - ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 14 రోజుల్లో ఏం జరిగింది?
Revanth Reddy : హైకమాండ్ వద్ద తగ్గిన రేవంత్ పలుకుబడి - మంత్రి పదవులు తాను అనుకున్న వారికి ఇప్పించుకోగలరా ?
హైకమాండ్ వద్ద తగ్గిన రేవంత్ పలుకుబడి - మంత్రి పదవులు తాను అనుకున్న వారికి ఇప్పించుకోగలరా ?
Israel-Iran Tension:భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు- ఇరాన్‌కు నెతన్యాహు హెచ్చరిక
భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు- ఇరాన్‌కు నెతన్యాహు హెచ్చరిక
Devara: బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ తాండవం - ఐదు రోజుల కలెక్షన్లు ఇవే!
బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ తాండవం - ఐదు రోజుల కలెక్షన్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IND vs BAN 2nd Test Day 5 Highlights: రెండో టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియాSircilla Weavers: 18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీSrikakulam Fisherman Boats Fire: నడిసంద్రంలో అగ్ని ప్రమాదాలు, వణికిపోతున్న మత్స్యకారులుTiger in Konaseema: చిరుత కోసం డ్రోన్లతో వేట - కోనసీమ DFOతో ఫేస్ టూ ఫేస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel-Iran Tension: పేజర్ పేలుడు నుంచి క్షిపణుల దాడి వరకు - ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 14 రోజుల్లో ఏం జరిగింది?
పేజర్ పేలుడు నుంచి క్షిపణుల దాడి వరకు - ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 14 రోజుల్లో ఏం జరిగింది?
Revanth Reddy : హైకమాండ్ వద్ద తగ్గిన రేవంత్ పలుకుబడి - మంత్రి పదవులు తాను అనుకున్న వారికి ఇప్పించుకోగలరా ?
హైకమాండ్ వద్ద తగ్గిన రేవంత్ పలుకుబడి - మంత్రి పదవులు తాను అనుకున్న వారికి ఇప్పించుకోగలరా ?
Israel-Iran Tension:భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు- ఇరాన్‌కు నెతన్యాహు హెచ్చరిక
భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు- ఇరాన్‌కు నెతన్యాహు హెచ్చరిక
Devara: బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ తాండవం - ఐదు రోజుల కలెక్షన్లు ఇవే!
బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ తాండవం - ఐదు రోజుల కలెక్షన్లు ఇవే!
Pune Chopper Crashed: పూణేలో కుప్పకూలిన హెలికాప్టర్‌- ముగ్గురు మృతి-  తృటిలో తప్పించుకున్న ఎన్సీపీ ఎంపీ
పూణేలో కుప్పకూలిన హెలికాప్టర్‌- ముగ్గురు మృతి- తృటిలో తప్పించుకున్న ఎన్సీపీ ఎంపీ
Isha Foundation: ఇషా యోగా సెంటర్‌లో పోలీసుల తనిఖీలు- కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఖాకీలు
ఇషా యోగా సెంటర్‌లో పోలీసుల తనిఖీలు- కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఖాకీలు
Israel-Iran Tension: పశ్చిమాసియాలో మరోసారి టెన్షన్, ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం- అర్థరాత్రి విధ్వంసం
పశ్చిమాసియాలో మరోసారి టెన్షన్, ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం- అర్థరాత్రి విధ్వంసం
Amazon: అమెజాన్ తో బిజినెస్ చేసే రిటైలర్లకు బంపర్ ఆఫర్..
అమెజాన్‌తో బిజినెస్ చేసే రిటైలర్లకు బంపర్ ఆఫర్
Embed widget