Chandrababu: ఆ 60 మందివి ప్రభుత్వ హత్యలే, ఆ ఆర్తనాదాలు అసెంబ్లీలో జగన్‌కు ఆనందం.. చంద్రబాబు వ్యాఖ్యలు

భారీ వర్షాలు పడతాయని తెలిసినా ప్రజలతో ఆడుకున్నారని చంద్రబాబు అన్నారు. గ్రామాలు మునిగిపోతాయని తెలిసినా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు.

FOLLOW US: 

ఏపీలో వచ్చిన వరదల్లో చనిపోయిన 60 మందివి హత్యలేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వారి ఒక్కో కుటుంబానికి పాతిక లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షాల ధాటికి వరి, చెరకు, పత్తి, వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న, మామిడి పంటలకు పరిహారం పెంచాలని కోరారు. ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిందని విమర్శించారు. భారీ వర్షాలు పడతాయని తెలిసినా ప్రజలతో ఆడుకున్నారని అన్నారు. గ్రామాలు మునిగిపోతాయని తెలిసినా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

తిరుపతి లక్ష్మీపురం సర్కిల్‌లో వరద నీటిలో కొట్టుకుపోయిన సుబ్బారావు డెడ్ బాడీ ఇప్పటి వరకు దొరకలేదని అన్నారు. భర్త నీటిలో కొట్టుకుపోవడంతో ఆ ఆవేదన తట్టుకోలేక భార్య అనారోగ్యానికి గురైందని అన్నారు. ఇప్పటికీ కడప జిల్లాలో ఆరు గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయని గుర్తు చేశారు. రాయలచెరువు ప్రాంత ప్రజలకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ‘‘తిరుపతిలో పర్యటిస్తున్నానని హడావిడిగా కొన్ని ప్రాంతాల్లో వరద నీటిని శుభ్రం చేశారు. వరద బాధితుల ఆర్తనాదాలు అసెంబ్లీలో జగన్‌కు ఆనందం. మానవ తప్పిదంపై జ్యుడిషనల్ విచారణ జరిపించాలి. తుమ్మలగుంట చెరువు కబ్జాపై విచారణ జరిపించాలి. తప్పిదానికి కారణమైన వారిని శిక్షించాలి.

‘‘వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద బాధితులను చూసి ఆవేదన చెందా. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 40 వేల మందిని ఆదుకున్నాం. నిరాశ్రయులకు అవసరమైన భోజన సదుపాయాలను మేం కల్పించాం. పునరావాస కేంద్రాల్లో బాధితులను ఆదుకోవడంలో కూడా అధికార యంత్రాంగం, ప్రభుత్వం విఫలమయింది. కపిల తీర్థం నుంచి కొండపక్కనే కాలువ తీయాలి. కపిల తీర్థం నీరు స్వర్ణముఖి నదిలోకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలి. రంగులు వేయడానికి, తీయడానికి రూ.6 వేల కోట్లు అనవసర ఖర్చు చేశారు. అనవసర ఖర్చులు చేస్తూ అవసరమైన వాటికి ఖర్చు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను సక్రమంగా ఖర్చు పెట్టండి. వరదల్లో 62 మంది చనిపోయారు’’

‘‘మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. వరద బాధితులను ఆదుకోవడానికి వెళితే కేసులు పెడతారా.. రాయలచెరువుకు వెళ్ళొద్దని నోటీసులు పెడతారా? వరద బాధితులను ఆదుకోకుంటే పోరాటం చేస్తాం. త్వరలో వరద బీభత్సంపై ఏపీ సీఎస్‌కు లేఖ రాస్తా.. కడపలో వరద భీభత్సం సృష్టిస్తే అసెంబ్లీ పెట్టుకుంటారా..? వరద నీటిలో దిగి సీఎం ఎందుకు పరామర్శించలేదు?  వరద నీటిలో కొట్టుకుపోయిన సుబ్బారావు కుటుంబానికి ఏం సమాధానం చెబుతారు..? తిత్లి, హుదూద్ తుపాను సమయంలో బాధితులను అప్పటి టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంది.’’ అని చంద్రబాబు మాట్లాడారు.

Also Read: Sujana CEO : సుజనా ఫౌండేషన్ సీఈవో హత్య ? బెంగళూరు రైల్వే ట్రాక్‌పై మృతదేహం !

Also Read: Father Rape: మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం.. ఏడాదిగా అదే పని.. చివరికి..

Also Read : క్రిప్టోపై బిల్లుపై కేంద్రం ప్రకటన.. సూర్యాపేటలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 25 Nov 2021 11:46 AM (IST) Tags: YS Jagan Chandrababu kadapa rains Chandrababu in Tirupati Flood relief in Kadapa AP Floods loss

సంబంధిత కథనాలు

Srivari Arjitha Seva Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త - రెండేళ్ల తరువాత లక్కీ డిప్, ఆర్జిత సేవల టికెట్లు విడుదల ఎప్పుడంటే

Srivari Arjitha Seva Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త - రెండేళ్ల తరువాత లక్కీ డిప్, ఆర్జిత సేవల టికెట్లు విడుదల ఎప్పుడంటే

AP Govt GO: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - ప్రొబేషన్ డిక్లరేషన్‌పై జీవో విడుదల

AP Govt GO: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - ప్రొబేషన్ డిక్లరేషన్‌పై జీవో విడుదల

Puttaparthi Municipal Commissioner Dies: శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం, రైలు కింద పడి పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ మృతి

Puttaparthi Municipal Commissioner Dies: శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం, రైలు కింద పడి పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ మృతి

Heavy Rush In Tirumala: శ్రీవారి భక్తులతో నిండిన సప్తగిరులు, TTD అధికారులు అలర్ట్ - సర్వదర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే !

Heavy Rush In Tirumala: శ్రీవారి భక్తులతో నిండిన సప్తగిరులు, TTD అధికారులు అలర్ట్ - సర్వదర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే !

AP Inter Revaluation 2022: ఇంటర్‌లో మార్కులు తక్కువగా వచ్చాయనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి

AP Inter Revaluation 2022: ఇంటర్‌లో మార్కులు తక్కువగా వచ్చాయనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి

టాప్ స్టోరీస్

Expensive Pillow: ఈ దిండు ధర రూ.45 లక్షలు, కొన్నవాడికి ఇక నిద్ర పడుతుందా?

Expensive Pillow: ఈ దిండు ధర రూ.45 లక్షలు, కొన్నవాడికి ఇక నిద్ర పడుతుందా?

Puppalaguda Accident : పుప్పాలగూడలో ఘోర ప్రమాదం, సెల్లార్ పనుల్లో గోడ కూలి ముగ్గురు మృతి

Puppalaguda Accident : పుప్పాలగూడలో ఘోర ప్రమాదం, సెల్లార్ పనుల్లో గోడ కూలి ముగ్గురు మృతి

Govt Teachers Properties : పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం, టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశాలు

Govt Teachers Properties : పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం, టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశాలు

CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్‌ పెడతారట! 

CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్‌ పెడతారట!