కడప-రేణిగుంట హైవే విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్- రెండేళ్లలో పూర్తి చేసేలా ప్లాన్
ఎన్‌హెచ్ 716 పూర్తైతే కడప, అన్నమయ్య జిల్లాలను రేణిగుంట ఎయిర్‌పోర్టుతో కనెక్టవిటీ ఏర్పడుతుంది. అంతే కాకుండా నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు, చెన్నై పోర్టు షోలాపూర్‌కి కూడా కనెక్టివిటీ ఉంటుంది.
షోలాపూర్-చెన్నై ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా కడప-రేణిగుంట మధ్య ఉన్న ఎన్‌హెచ్ 716ను నాలుగు లేన్ల జాతీయ రహదారిగా విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రహదారి విస్తరణపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఓ ట్వీట్ చేశారు. పశ్చిమ–తూర్పు ప్రాంతాలను అనుసంధానిస్తూ షోలాపూర్–చెన్నై ఎకనామిక్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తారు. దీనికి రవాణా సౌకర్యం మరింత సులభతరం చేసేందుకు ఎన్‌హెచ్ 716ను విస్తరించనున్నారు.
ఎన్‌హెచ్ 716 పూర్తైతే కడప, అన్నమయ్య జిల్లాలను రేణిగుంట ఎయిర్‌పోర్టుతో కనెక్టవిటీ ఏర్పడుతుంది. అంతే కాకుండా నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు, చెన్నై పోర్టు షోలాపూర్‌కి కూడా కనెక్టివిటీ ఉంటుంది. దీని ఫలితంగా షోలాపూర్ తయారైన వస్తువులు సులువుగా రవాణా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. దీని వల్ల ఈ రోడ్డు విస్తరించిన ఉన్న ప్రాంతాల్లో అనుబంధ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది.
అభివృద్ధి అంటే ఇదే!
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) December 2, 2022
ఆంధ్రప్రదేశ్‌లో @BJP4India ప్రభుత్వంలో అభివృద్ధి నిరంతరం.
మా పార్టీ అధికారంలో ఉన్నామా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రజా పాలనే ముఖ్యం అని భావించి సీమలో మరో జాతీయ రహదారి.
రూ.1732.66 కోట్లతో NH-716 కడప నుంచి చిన్న ఓరంపాడు వరకు రహదారి నిర్మాణం. pic.twitter.com/Sv4XdKzyYe
🔸️ Four-laning of NH-716 from Kadapa to Chinna Orampadu PKG 1 for the districts of YSR Kadapa and Annamayya in Andhra pradesh has been approved with a budget of Rs 1,732.66 crore.
— AP Infra updates (@infraAP) December 1, 2022
🔸️It is a part of Chennai-Solapur economic corridor. #AndhraPradesh pic.twitter.com/UshgWyAHrR
గతి శక్తి ప్రాజెక్టులో భాగంగా ఎన్‌హెచ్ 716ను డెవలప్ చేయనున్నారు. 120 కిలోమీటర్ల ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను రూ. 1,500.11 కోట్లతో పూర్తి చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ రోడ్ విస్తరణకు 1,066 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను రాష్ట్రానికి అప్పగించింది కేంద్రం. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని టార్గెట్‌గా పని చేస్తోంది.
రాయలసీమలో మరో జాతీయ రహదారి ప్రాజెక్టును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం.
— Dr Parthasarathi / डॉ पार्थसारथी / డా పార్థసారథి (@drparthabjp) December 1, 2022
రూ.1732.66 కోట్లతో NH-716 కడప నుంచి చిన్న ఓరంపాడు వరకు 4 వరుసల జాతీయ రహదారి ( ప్యాకేజీ - 1 ) నిర్మాణానికి ఆమోదం .
ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున శ్రీ @narendramodi గారికి , కేంద్ర మంత్రివర్యులు (1/2) pic.twitter.com/fr0qBF2s4K
రెండు ప్యాకేజీలుగా దీన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్యాకేజీ1 కింద వచ్చే ప్రాంతాలుః- కడప నుంచి ప్రారంభమై... బకర్‌పేట, ఒంటిమిట్ట, పెదపల్లె, నందలూర్, రాజంపేట, ఓరంపాడు వరకు. ప్యాకేజీ2 కింద వచ్చే ప్రాంతాలుః- పుల్లంపేట, ఒవ్వురపల్లి, అయ్యపురెడ్డి పల్లి, కోడూరు, శెట్టిగుంట, బల్లుపల్లె, మమండూరు రేణిగుంట వరకు రెండో ప్యాకేజీ కింద డెవలప్ చేస్తారు.