అన్వేషించండి

Tirumala News: తిరుమల లడ్డూ వివాదంపై రంగంలోకి దిగిన సీబీఐ- ఎక్కడెక్కడ విచారణ చేస్తోంది అంటే?

Tirumala Laddu Issue: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో సీబీఐ దర్యాప్తు వేగవంతమైంది. నాలుగు బృందాలుగా నెల్లూరు, చెన్నైలో విచారణ చేస్తున్నారు.

Tirumala news: తిరుమల శ్రీవారి ప్రసాదంలో అతి ప్రీతికరమైన లడ్డూ ప్రసాదం వివాదం పెద్ద దుమారమే రేపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటనతో పెద్ద వివాదానికి దారి తీసింది. చరిత్రలో ఎన్నడు లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటనతో ఈ అంశం నేషనల్ మీడియాలో నిలిచింది. చాల సున్నితమైన అంశం... పైగా కోట్ల మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో పెద్ద ఎత్తున ఉద్యమానికి సైతం సిద్ధమయ్యారు. టీటీడీ ఈవో సైతం కొంత భిన్న మాటలు మాట్లాడడం ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ దానిని సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్ళింది. 

సీబీఐ ఆధ్వర్యంలో సిట్
లడ్డూ వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి సిట్ ఏర్పాటు చేసింది. మొత్తం 12 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం తిరుపతిలో 5 రోజులపాటు పరిశీలన చేసింది. తిరమల తిరుపతి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ పూడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సందర్శించింది. సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు సీబీఐ ఆధ్వర్యంలో మరో సిట్ ఏర్పాటు చేయడంతో 5రోజుల పాటు జరిగిన విచారణ అర్థాంతరంగా ముగిసింది. అయితే ఆ విచారణ నివేదిక ఏమి చేసారో.. దానిని కొత్త సిట్ పరిగణలోకి తీసుకుంటుందా లేదా విచారణ తొలి నుంచి ప్రారంభిస్తుందో వేచి చూడాలి.

Also Read: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి 62 ప్రత్యేక రైళ్లు

విస్తృతంగా విచారణ
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో 5 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటైంది. ఇందులో ఇద్దరు సీబీఐ నుంచి, ఇద్దరు రాష్ట్ర నుంచి కాగా ఒక్కరు ఫుడ్ సేఫ్టీలోని అధికారి ఉన్నారు. వీరు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో కార్యాలయంలో ఏర్పాటు చేసుకుని పని ప్రారంభించారు. వీరికి సహాయంగా మొత్తం 35 మంది సభ్యులను తీసుకున్నారు. 

ఒక బృందం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోడాములో పలు ఫైల్స్ తీసుకున్నారు. ఒక బృందం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో సమావేశం నిర్వహించారు. మరో రెండు బృందాలు తమిళనాడు దిండుగల్‌లోని ఏఆర్ డైరీ పూడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు, ఇంకొక టీం నెల్లూరుకు సమీపంలోని వైష్ణవి డైరీకి వెళ్లాయి. అక్కడ నెయ్యికి సంబంధించిన పలు అంశాలపై పరిశీలనతోపాటు రికార్డులు, సీసీ టీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. 

ఒక్క తమిళనాడులోని ఏఆర్ డైరీలోనే సుమారు 13 గంటల పాటు సోదాలు నిర్వహించారు సీబీఐ బృందంలోని సభ్యులు. నెయ్యి తయారీకి పాలు కొనుగోలు నుంచి నెయ్యి మార్పు చేసే విధానం వరకు పూర్తిగా అధ్యాయనం చేశారు. లడ్డూ కల్తీ కాలేదని ఏఆర్ డైరీ తెచ్చిన రిపోర్టులను సైతం జారీ చేసిన ల్యాబ్ వివరాలు.. వాటి నమూనాలు.. టీటీడీకి సరఫరా చేసిన రిపోర్టులు.. ల్యాబ్ శ్యాంపుల్స్ తీసుకున్నారు. విచారణ మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. తిరుమలలో విచారణ చేసిన అనంతరం ప్రాథమిక నివేదిక అందిస్తారా లేక పూర్తి విచారణ తరువాత నివేదిక సుప్రీం కోర్టుకు అందజేస్తారు అనేది వేచి చూడాల్సిందే.

Also Read: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్టాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్టాటజీ హిట్టా ఫట్టా!
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్టాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్టాటజీ హిట్టా ఫట్టా!
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
2024 Layoffs: డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
Kickboxing: తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Embed widget