By: ABP Desam | Updated at : 27 Feb 2023 03:03 PM (IST)
కవిత (ఫైల్ ఫోటో), తిరుమలలో వివేక్ వెంకట స్వామి
తిరుమలలో బిజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తరహాలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా త్వరలోనే జైలుకు వెళ్తారని ఆయన వ్యాఖ్యానించారు. అతి త్వరలోనే కవిత కూడా జైలుకు వెళ్తారని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం తరహాలోనే ఢిల్లీ, పంజాబ్ లో కూడా చేయాలనే కాకుండా దేశం అంతా అమలు చేయాలని అనుకున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కువ మందిని అరెస్టు చేసే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. సోమవారం (ఫిబ్రవరి 27) వివేక్ వెంకట స్వామి తిరుమల దర్శనానికి వచ్చారు. మధ్యాహ్నం వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం బయట ఉన్న మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మోదీ ఉద్యోగాలు, ఆయుష్మాన్ భారత్ అందరికీ చెందాలని ఈ బడ్జెట్ లో పెట్టారని చెప్పారు. మోదీ ఇళ్ళు కట్టడానికి బడ్జెట్ లో మంచి ప్రొవిజన్స్ పట్టారని, పది లక్షల కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వెచించారని తెలిపారు. హైవే, రైల్వే, ఇతర సంస్థల్లో కూడా ఎక్కువ నిధులు ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ పెట్టారని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ పై వ్యతిరేకత డైవర్షన్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో దోచుకున్న అవినీతి సొమ్మునంతా ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారని, దేశంలో అన్ని కన్నా రిఛ్ పార్టీ,ఎక్కువ నిధులు ఉన్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అయ్యే అని ఆయన విమర్శించారు.
ప్రజల సొమ్ముతో టిఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ అంటూ నాలుగు వందల కోట్లతో విమానం కొన్నారని, తెలంగాణ ఖజానాను దోచుకునేందుకు కేసీఆర్ జీవిస్తున్నట్లు ఆయన విమర్శించారు. రైతులకు,ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ మరిచారని,మెగా కృష్ణారెడ్డి వంటి కాంట్రాక్టర్ లను ప్రపంచంలోనే ధనికుడిని చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారో వారందరికి తెలంగాణలో స్ధానం లేదని, పంజాబ్, గుజరాత్ ఎన్నికలలో నగదు అవసరం అని,కేజ్రివాల్ తో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకున్న కవిత, 150 కోట్ల రూపాయలు ఆఫ్ గవర్నమెంట్ కు ఇచ్చిందన్నారు. త్వరలోనే సుసోడియా ఎలాగైతే జైల్ కి వెళ్ళాడో, అతిత్వరలోనే కవిత కీడా వెళ్తుందన్నారు. లిక్కిర్ స్కాంను ఢిల్లీ, పంజాబ్ లో కూడా చేయాలనే కాకుండా దేశం అంతా చేయాలని అనుకున్నారని, కేంద్రం ఈ లిక్కర్ స్కాంలో ఎక్కువ మందిని అరెస్టు చేసే పరిస్ధితులు ఉందన్నారు.
శ్రీవారి సేవలో మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర
తిరుమల శ్రీవారిని మహిళా క్రికెటర్ ప్రణవిచంద్ర దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కోచ్ చాముండేశ్వరినాథ్ తో కలిసి మహిళా క్రికెటర్ ప్రణవిచంద్ర స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!
Tirumala Darshan News: ఏడుకొండలపై కొనసాగుతున్న భక్తుల రద్దీ, దర్శన సమయం ఎంతంటే
Nara Lokesh: ఇక మిగిలింది వై నాట్ పులివెందుల! నా తల్లినే అవమానిస్తారా, మిమ్మల్ని వదిలిపెట్టను!: నారా లోకేశ్
Elephant Electrocuted Video : తమిళనాడు ధర్మపురిలో విషాదం, విద్యుత్ వైర్లు తగిలి కుప్పకూలిన ఏనుగు!
CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్
TS Paper Leak Politics : "పేపర్ లీక్" కేసు - రాజకీయ పుట్టలో వేలు పట్టిన సిట్ ! వ్యూహాత్మక తప్పిదమేనా ?
Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్
Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!