Tirumala: తిరుమలలో జింక మృతికి భక్తుల కంటతడి.. విషయం తెలిస్తే మీ కళ్లు కూడా చెమరుస్తాయి
తిరుమలలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా మందికి కంటతడి పెట్టించింది. ఇందులో చనిపోయింది జంతువే అయినా చాలా మంది ఆ ఘటన తలచుకొని చాలా బాధపడ్డారు.

తిరుమల ఘాట్ రోడ్‌లో జంతువులు, పక్షులు కనిపిస్తూ... వెళ్తున్న వాహనాలకు టాటా చెప్తున్నట్టు అనిపిస్తుంది. కొన్ని ప్రమాదవశాత్తు చనిపోతుంటాయి. నెల రోజుల్లో ఘాట్‌లోని ఏదో చోట ఇలాంటి ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు జంతువులు గాయాలతో బయటపడుతుంటాయి.
ఈ ప్రమాదాలు నివారణకు టీటీడీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు ఆగడం లేదు. జంతువుల రాక వల్ల వాటికి ప్రమాదం జరగడమే కాదు... భక్తులు కూడా భయపడుతున్నారు. కొన్నిసార్లు చిరుత పులులు కూడా సంచరించడం ఆందోళన కలిగిస్తున్న అంశం.
సోమవారం కూడా తిరుమల ఘాట్ రోడ్‌లో టీటీడీ పరకామణి బస్సు జింకను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక దారుణంగా మృతి చెందింది. స్పాట్‌లోనే చనిపోయింది. బస్సు ఢీ కొట్టడంతో ఆ జింక చాలా దూరం ఎగిరి పడింది.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రోడ్డు దాటుతున్న జింకను అతివేగంగా వస్తున్న టిటిడి పరకామణి బస్సు ఢీ కొంది. జింకను బస్సు ఢీ కొనడంతో పది అడుగుల దూరంలో ఎగిరి పడిన జింక మృతి చెందింది. ఆ జింక మృతి చెందుతూనే పిల్లకు జన్మనిచ్చింది. దీన్ని గమనించిన స్థానికులు ఆశ్చర్యపోయారు.
ఇది గమనించిన ప్రయాణికులు టిటిడి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. ఇంతలో జింక పిల్లకు సేవలందించారు. ఘటన స్ధలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు జింక పిల్లను జూపార్క్ అధికారులకు అప్పగించారు.
ఆ జింక పిల్లను వెటర్నరీ వైద్యులు సంరక్షణలో ఉంచారు ఫారెస్ట్ అధికారులు. ఈ హృదయ విధారకమైన సన్నివేశాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. దాన్ని చూసిన వారందర్ీ ఇది కలచి వేసింది.
In an accident deer died at spot in tirumala ghat road and she gives birth to cub pic.twitter.com/KYirv3ozzo
— Gajula Varaprasad (@GajulaVarapra10) January 24, 2022
ఈ దృశ్యాన్ని చరవాణిలో వీక్షించిన ఎంపీ గురుమూర్తి చలించి పోయారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృత్తం చూస్తామన్ననారు. దీనిపై కార్యాచరణ రెడీ చేయాలని అధికారుకు ఆదేశించబోతున్నట్టు పేర్కొన్నారు.
Also Read: తాడిపత్రిలో మళ్లీ జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. ఈ సారి జెండా పండగ పంచాయతీ !
Also Read: ఆర్టీసీ ఉద్యోగులూ సమ్మెలోకి ! ప్రభుత్వంలో విలీనం చేశాక వారికొచ్చిన కష్టాలేంటి ?





















