By: ABP Desam | Updated at : 24 Dec 2021 09:10 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమలలో శ్రీవారి దర్శనానికి కోవిడ్ రెండు డోసుల వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపింది. ఇప్పటికే టీటీడీ ఈ విషయాన్ని తెలియజేసిందని పేర్కొంది. కొంతమంది భక్తులు నెగెటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీ చేసి అటువంటి వారిని వెనక్కి పంపిస్తామన్నారు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్-19 మార్గదర్శకాలు జారీచేసింది. కచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికేట్‌ను అలిపిరి చెక్ పాయింట్ వద్ద చూపించిన వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ పేర్కొంది. భక్తులు ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందికి సహకరించాలని కోరారు. టీటీడీకి సంబంధించిన ఇతర ఆలయాల్లో ఈ కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని భక్తులను కోరారు. కోవిడ్ థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయని టీటీడీ పేర్కొంది. టీటీడీకి చెందిన ఇతర ఆలయాల్లో కూడా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
Also Read: స్వామీ.. కోర్టుకెళ్లి తేల్చుకుందామా ? టీటీడీపై మళ్లీ ట్వీటెత్తిన రమణదీక్షితులు !
టీటీడీ వెబ్ సైట్ కు 14 లక్షల హిట్లు
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది. జనవరి నెలకు సంబంధించి టీటీడీ శుక్రవారం 4 లక్షల 60 వేల దర్శనం టోకెన్లు విడుదల చేసింది. ఈ టికెట్లు హాట్‌కేకుల్లా బుక్ అయ్యాయి. ఒక్కసారిగా దర్శనం టిక్కెట్ల కోసం టీటీడీ వెబ్‌సైట్‌కు 14 లక్షల హిట్లు వచ్చాయి. ఏకంగా 55 నిమిషాల్లో 4 లక్షల అరవై వేల దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఈ స్థాయిలో టీటీడీ వెబ్ సైట్ కు హిట్లు ఒకేసారి రావడం ఇదే మొదటిసారని తెలుస్తోంది.
Also Read: కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?
సర్వ దర్శనం టికెట్లు
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు జనవరి నెలకు సంబంధించి 1, 2 తేదీలు, జనవరి 13 నుంచి 22 వరకు, మళ్లీ జనవరి 26వ తేదీల్లో 5,500 మంది భక్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వర్చువల్ సేవా టికెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు రోజుకు 20 వేల చొప్పున విడుదల చేసింది. జనవరి 2 నుంచి 12, 23 నుంచి 31 వరకు రోజుకు 12 వేల చొప్పున ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేసింది. జనవరికి సంబంధించి 5,500 వర్చువల్ సేవా దర్శన టికెట్లు గురువారం విడుదల చేయగా అవి కూడా నిమిషాల వ్యవధిలోనే బుక్ అయ్యాయి. శనివారం శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల చేయనుంది. రోజుకు 5 వేలు టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో, మరో 5 వేల టికెట్లు ఆఫ్ లైన్ లో తిరుపతిలోని కౌంటర్‌లో ఇవ్వనున్నారు. తిరుమలలో వసతి గదుల కోసం ఈ నెల 27న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతిని తిరుమలలోనే నేరుగా బుకింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
AP Govt GPF Issue : ఉద్యోగుల ఖాతాల్లో నగదు మాయంపై న్యాయపోరాటం చేస్తాం - సూర్యనారాయణ
Chittoor News : మేయర్ దంపతుల హత్య కేసులో మరో ట్విస్ట్, విచారణ నుంచి తప్పుకున్న ఏపీపీ
Minister Gudivada Amarnath : పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం, ఆగస్టులో రూ. 500 కోట్ల ఇన్సెంటివ్ లు- మంత్రి గుడివాడ అమర్నాథ్
APSRTC Bus Charges Hike : ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు, రేపట్నుంచి అమల్లోకి!
Sajjala Comments : టీడీపీది మాయా యుద్ధం - అన్నీ అబద్దాలే ప్రచారం చేస్తున్నారన్న సజ్జల
GPF Money Moved To Pensions : ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ములు సామాజిక పెన్షన్లకు మళ్లించారా ?
IND Vs ENG Squads: ఇంగ్లండ్ వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!
Eknath Shinde: 'ఉద్ధవ్ ఠాక్రేకు ఎన్నో సార్లు చెప్పాను- ఆయన సైనికుడ్ని భాజపా సీఎం చేస్తుంది'
AP Weekly Five Days : వారానికి ఐదు రోజులే పని - మరో ఏడాది పొడిగించిన ఏపీ ప్రభుత్వం !