అన్వేషించండి

Somu Veerraju : ఏపీలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు, బీజేపీ ఎవరికీ ఏజెట్ కాదు- సోము వీర్రాజు

Somu Veerraju : ఏపీలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయని సోము వీర్రాజు ఆరోపించారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Somu Veerraju : వివేకానంద హత్య కేసులో సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్రం ఎవరినీ కాపాడదని స్పష్టం చేశారు. వెయ్యి కోట్లు అంటూ ఏపీలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయని, వీటికి చరమగీతం పాడుతామన్నారు. ఏపీలో నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటున్నారని, ఎమ్మెల్యేల కుటుంబీకులు అరాచకాలు పాల్పడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు తిరుపతిలో దొంగ ఓట్లను నమోదు చేయించారని, బీజేపీ ఏపీలో ఎవరికీ ఏజెంట్ గా  పనిచేయదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తీరుతుందని, నాపై మా పార్టీ నేతలు ఎవరూ అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్ట్ వల్ల సీమకు ఎలాంటి నష్టం జరగదన్నారు సోము వీర్రాజు.  

వాలంటీర్ వ్యవస్థపై ఫిర్యాదు

 "నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. కొన్ని ఛానల్స్ కావాలనే రాస్తున్నారు. మా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా అప్పర్ భద్ర ద్వారా ఇవ్వాల్సిందే. ఇందులో ఏ మార్పులేదు. గత ప్రభుత్వాల వల్ల నికర జలాలు లేవు. కర్నూలులో హైకోర్టు పెడతామని చెప్పిన పార్టీ బీజేపీ మాత్రమే. రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలో బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఏపీలో వీళ్ల పప్పులు ఉడకువు. టీడీపీ, వైసీపీ ఏజెంట్లు బీజేపీ అని ప్రచారం చేస్తున్నాయి. పాకెట్లు ఎవరు తీసుకుంటారో మాకు తెలుసు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు లొంగి ప్రసక్తే లేదు. సైకిల్ తొక్కే వాళ్లు ఇవాళ ఛానళ్లు పెట్టారు. వాళ్లకు డబ్బు ఎలా వచ్చిందో ప్రశ్నించడంలేదే? నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారంట. తిరుపతిలో ఎంపీ ఎన్నికలకు దొంగఓట్లు వేశారు. బద్వేల్ కూడా అలాగే దొంగఓట్లు వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పదో తరగతి వాళ్లను గ్రాడ్యుయేట్స్ అని చెబుతున్నారు. దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. వాలంటరీ వ్యవస్థపై కూడా ఫిర్యాదు చేస్తాం." -సోము వీర్రాజు  

 సోమువీర్రాజుకి‌ నిరసన సెగ

తిరుపతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు నిరసన ఎదురైంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం బయటకు వచ్చిన సోము వీర్రాజుకి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల నుంచి నిరసన సెగ ఎదురైంది. దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టును నిరసిస్తూ సోము వీర్రాజు వాహనానికి అడ్డంగా రోడ్డుపై బైఠాయించిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు,  సిసోడియాని వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. సోమువీర్రాజు వాహనానికి అడ్డంగా కూర్చోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగ్గారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు తెచ్చిన ప్లకార్డులకు ఉన్న కట్టెలను తీసుకొని వారిని కొడుతూ అక్కడ నుంచి తరిమివేశారు. సిసోడియా అరెస్ట్ ని నిరసిస్తూ తాము శాంతియుతంగా నిరసన చేస్తుంటే మాపై బీజేపీ నాయకులు దాడికి పాల్పడారని, వెంటనే వారిని అరెస్టు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Embed widget