TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే శుక్రవారం(రేపు) విడుదల చేయనుంది. రోజుకు 12 వేల టికెట్ల చొప్పున రూ.300 టికెట్లు విడుదల చేయనున్నారు.
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రోజుకు 12 వేల టికెట్లు చొప్పున నవంబర్, డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300 టికెట్లు విడుదల చేయనుంది. ఈ నెల 23న నవంబర్ నెలకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు. సర్వదర్శనం 10వేల టికెట్లను.. ప్రత్యేక దర్శనం టికెట్లు 12 వేలు జారీ చేసినట్టు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. నవంబర్ నెలకు ప్రత్యేక దర్శనం టికెట్ల షెడ్యూల్ ఖరారు చేసింది. రేపు ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శనం టికెట్లు.. 23న ఉదయం 10వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది.
ప్రత్యేక దర్శనానికి టికెట్ ధర రూ. 300గా ఉంది. టీటీడీ ప్రకటనతో ప్రత్యేక దర్శన టికెట్లు దొరక్క పోయినా సర్వ దర్శనం టికెట్లు తీసుకోవాలని భక్తులు అనుకుంటున్నారు. శ్రీవారిని బుధవారం(నిన్న) 27,878 మంది భక్తులు దర్శించుకున్నారు. 13,741 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.2.57 కోట్ల ఆదాయం సమకూరింది. తిరుమలను దర్శించుకునే.. భక్తులు కరోనా రెండు డోసుల టీకా, 72 గంటల ముందు పరీక్షించుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టులు ఉండాలని గతంలోనే టీటీడీ తెలిపింది.
మరోవైపు వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు కల్పించే ప్రత్యేక దర్శనాల విషయంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి 20 నుంచి.. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేశామని తితిదే తెలిపింది. అయితే.. ఇప్పటికీ కొవిడ్ పూర్తిగా అదుపులోకి రాకనందువల్ల వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోందని స్పష్టం చేసింది.
టీటీడీ దిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలిగా ప్రశాంతిరెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలిగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని.. దిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలిగా టీటీడీ నియమించింది. ఈ బాధ్యతల ద్వారా.. ఉత్తర భారతదేశంలోని టీటీడీ ఆలయాల పర్యవేక్షణ బాధ్యతలను ఆమె నిర్వర్తించనున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచనల మేరకు బోర్డు సభ్యత్వానికి ప్రశాంతిరెడ్డి రాజీనామా సమర్పించారు.
Also Read: Priyanka Gandhi Detained: నేను రాష్ట్రంలో తిరగకూడదా? రెస్టారెంట్లో కూర్చోవాలా?: ప్రియాంక గాంధీ
Also Read: Lakhimpur Kheri Case: ఎందుకింత ఆలస్యం..? దీన్నొక అంతులేని కథగా మార్చకండి: సుప్రీం
Also Read: Aryan Khan Bail News: ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ షాక్.. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి