By: ABP Desam | Updated at : 04 Feb 2022 10:05 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తిరుమల తిరుపతి దేవస్థానం
టీటీడీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటుచేశామని ఈవో జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ సీనియర్ అధికారులతో ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిలు సమావేశం అయ్యారు. అనంతరం టీటీడీ ఈవో జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను నిపుణుల ద్వారా గుర్తించి వాటికి మరమ్మత్తులు చేపడుతున్నట్లు తెలిపారు. తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ పై కమిటీని నియమించామని, బయోడిగ్రేడబుల్ లడ్డూ కవర్లను ప్రవేశపెట్టామన్నారు. త్వరలోనే తిరుమలలో అన్ని దుకాణాలలో బయోడిగ్రేడబుల్ సంచులు వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు. హనుమాన్ జన్మస్థలం అభివృద్ది చేస్తామని, అక్కడ ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 9:30 గంటలకు భూమి పూజ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. తరిగొండ వెంగమాంబ బృందవనం పనులు ఫిబ్రవరి16న ప్రారంభిస్తామని ఈవో తెలిపారు. అన్ని అనుకూలిస్తే ఫిబ్రవరి 15న తర్వాత ఆఫ్ లైన్ సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. స్వామి వారి సేవలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. శ్రీవారి దర్శన టికెట్ల కోసం టీటీడీ వెబ్ సైట్ ను ఉపయోగించాలని, నకిలీ సైట్లను నమ్మి భక్తులు మోసపోవద్దని ఆయన భక్తులను కోరారు. మార్చి 1 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిచ్చే అవకాశం ఉందన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో అధికారులతో తితిదే ఈవో జవహర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
పలుమార్లు వాయిదా
కరోనా కారణంగా తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా టోకెన్లు జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ నుంచి నిలిపివేశారు. ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ, అవి గ్రామీణ ప్రాంతంలో ఉన్న సామాన్య భక్తులకు అందడం లేదన్న భావన ఉంది. కోవిడ్ కారణంగా ఉద్యోగులు, భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని టీటీడీ చెబుతోంది. సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని అనేకసార్లు భావించింది టీటీడీ. కానీ కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్న కారణంగా ప్రస్తుతం ఆన్ లైన్‌లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు చేశారు. ఆ తర్వాత సర్వదర్శనం ఆఫ్ లైన్ టోకెన్లు జారీ చేస్తామని చెబుతోంది.
Also Read: ఉద్యోగుల డిమాండ్లపై మెత్తబడుతున్న ఏపీ ప్రభుత్వం.. కొత్త ప్రతిపాదనలతో చర్చలు ప్రారంభం !
MLC Suspend YSRCP : ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్ - కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్సీపీ !
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
AP Telangana Breaking News Live: ఎమ్మెల్సీ అనంతబాబుకు వైఎస్సార్సీపీ షాక్, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
Sajjala On Amalapuram Attacks : పవన్ కల్యాణ్ చదివింది టీడీపీ స్క్రిప్ట్ - మాపై మేమెందుకు దాడి చేసుకుంటామన్న సజ్జల !
Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్కు రావొద్దని సూచన
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!