APBJP : చంద్రబాబుపై మారుతున్న ఏపీ బీజేపీ నేతల స్వరం - సోము, విష్ణువర్ధన్ రెడ్డి ఏం అంటున్నారంటే ?
పొత్తులపై బీజేపీ నేతల్లో గందరగోళం ఏర్పడుతోంది. ఢిల్లీ భేటీలపై తమకు సమాచారం లేదంటున్నారు.
APBJP : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల ఢిల్లీకి వెళ్లి అమిత్ షా , జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, బీజేపీ పొత్తులపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తులు ఉండవని బండి సంజయ్ చెబుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు వెళ్లి అమిత్ షాను కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా దాదాపుగా అదే చెబుతున్నారు. అయితే పొత్తులు ఉండవని నేరుగా ప్రకటించడం లేదు. గతంలోలా టీడీపీపై ఘాటు విమర్శలు చేయలేదు.
అమిత్ షాను చంద్రబాబు కలిస్తే తప్పేమీ లేదన్న సోము వీర్రాజు
చంద్రబాబు రాజకీయాల్లో సీనియర్ నాయకుడని.. ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిస్తే తప్పేమిటని సోము వీర్రాజు విజయవాడలో ప్రశ్నించారు. చాలా మంది నేతలు కలుస్తూనే ఉంటారని చెప్పారు. అయితే చంద్రబాబు, అమిత్ షా భేటీపై ఏపీ నేతలకు సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. అంటే చంద్రబాబుతో భేటీ మొత్తం పూర్తిగా ఢిల్లీ స్థాయి రాజకీయాల కోణంలోనే జరిగిందని చెబుతున్నారు. అయితే సోము వీర్రాజు గతంలో మాదిరిగా టీడీపీ, చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేయడం లేదు. చంద్రబాబుపై వీలైనంత గౌరవం చూపిస్తూండటం బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !
టీడీపీతో పొత్తులు ఉండవన్న విష్ణువర్ధన్ రెడ్డి
ఉదయం శ్రీవారిని దర్శించుకున్న విష్ణవర్ధన్ రెడ్డి ఆలయం వెలుపల టీడీపీతో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందని, కేవలం బీజేపీతో మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అమిత్ షాను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని, ఎలాంటి పొత్తు ఉండబోతుందని స్పష్టం చేశారు... ఈ నెల 9, 10 తేదీల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు తిరుపతి, శ్రీకాళహస్తిలో పర్యటించనున్నారని, ఈనెల 11వ తేదీ విశాఖలో జరిగే బీజేపీ బహిరంగ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారని చెప్పారు.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యంమని చెప్పిన ఆయన, రానున్న పది నెలల పాటు 20 లక్షల ఇళ్లకు కరపత్రాల ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలకు అధికార పార్టి వైఫల్యంను తెలియజేస్తామన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !
గందరగోళంలో తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు
పొత్తులపై చర్చలు జరుగుతున్నాయో లేదో ఎవరికీ తెలియదు. సొంత పార్టీ నేతలకూ తెలియదు. అయితే చంద్రబాబు వెళ్లి కలవడం మాత్రం .. వారిలో గందరగోళానికి కారమం అవుతోంది. పొత్తులు ఉంటాయని మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అటు టీడీపీ హైకమామండ్ నుంచి కానీ ఇటు బీజేపీ హైకమాండ్ నుంచి కానీ పొత్తలపై ఎలాంటి సంకేతాలు రావడం లేదు. కానీ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో వారంతా గందరగోళానికి గురవుతున్నరు.