News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bail For Magunta Raghava : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. అమ్మమ్మ అనారోగ్యం కారణంగా బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

FOLLOW US: 
Share:

Bail For Magunta Raghava :   వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి ఢిల్లీ లిక్కర్ స్కాంలో బెయిల్ లభించింది. తన భార్య ఆరోగ్యం బాగో లేదని ఆమెను చూసుకోవాలని పిటిషన్ దాఖలు చేయడంతో  రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.  రెండు వారాల పాటు బెయిల్ అమల్లో ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక నిందితుడు ్యిన శరత్ చంద్రారెడ్డి కూడా తన భార్యకు అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ తీసుకున్నారు. తర్వాత అప్రూవర్ గా మారారు. 

సౌత్ లాబీలో మాగుంట రాఘవ కీలకపాత్ర పోషించారన్న ఈడీ 

మాగుంట రాఘవ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించారని ఈడీ ఆరోపిస్తోంది. బాలాజీ గ్రూపు యజమానిగా ఉన్న మాగుంట రాఘవకు... ఇండో స్పిరిట్ కంపెనీలో భాగస్వామ్యం ఉందని ఈడీ చార్జిషీట్లలో కోర్టుకి తెలిపింది. రాఘవరెడ్డిని ఈ కేసులో కీలక వ్యక్తిగా ఈడీ చూపించింది. 180 కోట్ల నేరపూరిత ఆర్ధిక లావాదేవీల్లో రాఘవరెడ్డి పాత్ర ఉందని ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్ కంపెనీలో రాఘవరెడ్డిని భాగస్వామిగా చూపించింది. మరోవైపు మాగుంట ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రెండు రిటైల్ జోన్స్ కూడా ఉన్నాయని ఈడీ ప్రకటించింది.  

రూ. 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కీలక పాత్ర 

మద్యం విధానంతో లబ్ది పొందేందుకు ముడుపులు ఇచ్చారని... ముడుపులను హవాలా మార్గంలో చెల్లించారని తెలిపింది. ఇప్పటికే దాఖలు చేసిన చార్జ్ షీట్లలో వివరాలు పొందుపరచామని పేర్కొంది. సుమారు 30 మంది సాక్షుల వాంగ్మూలం కూడా నమోదు చేశామని వివరించింది.  ఇండో స్పిరిట్ కంపెనీ నుంచి రాఘవ మాగుంటకు వాటా వెళ్తోందని ఈడీ చార్జిషీట్లో పెర్కొంది. 

కేజ్రీవాల్ నూ ఓ సారి ప్రశ్నించిన సీబీఐ 

ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పేరిట చక్రం తిప్పడంలో పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించారని, వ్యాపార ప్రయోజనాలు పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జీషీట్లలో పలువురి పేర్లను ప్రధానంగా ప్రస్తావించింది.  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ను కూడా ఓ సారి ప్రశ్నించారు.  పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం గురించి ఈడీ పలుమార్లు విచారణ జరిపింది.  

లిక్కర్ స్కాంలో ఇప్పటికీ అనేక మంది జైల్లోనే                                        

మాగుంట రాఘవ ఇప్పటికే పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది.  లిక్కర్ స్కాంలో అరెస్టయిన వారు ఎవరికీ బెయిల్ రావడం లేదు. భార్య అనారోగ్యం పేరుతో శరత్ చంద్రారెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు రాఘవ కూడా బెయిల్ తెచ్చుకున్నారు. కానీ రెండు రోజుల కిందట మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా కూడా తన భార్య అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కానీ ఆయనకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. 

Published at : 07 Jun 2023 01:00 PM (IST) Tags: Delhi Liquor Scam Magunta Srinivasulareddy Magunta Raghav

ఇవి కూడా చూడండి

Minister RK Roja: పులకేశ్ ఆంధ్రాకు ఎప్పుడొస్తావ్? నారా లోకేశ్‌పై మంత్రి రోజా సెటైర్లు

Minister RK Roja: పులకేశ్ ఆంధ్రాకు ఎప్పుడొస్తావ్? నారా లోకేశ్‌పై మంత్రి రోజా సెటైర్లు

IT Employees Car Rally: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ ర్యాలీ ప్రారంభం - బోర్డర్ వద్ద టెన్షన్! వందల్లో పోలీసులు

IT Employees Car Rally: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ ర్యాలీ ప్రారంభం - బోర్డర్ వద్ద టెన్షన్! వందల్లో పోలీసులు

Top Headlines Today: నేడు బాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల ర్యాలీ; తెలంగాణలో ఎన్నికల హడావుడి ఎందుకు లేదు? - నేటి టాప్ న్యూస్

Top Headlines Today: నేడు బాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల ర్యాలీ; తెలంగాణలో ఎన్నికల హడావుడి ఎందుకు లేదు? - నేటి టాప్ న్యూస్

Weather Latest Update: త్వరలో బంగాళాఖాతంలో తుపానుకు అవకాశం! నేడు వర్షాలు పడే ప్రాంతాలు ఇవే: ఐఎండీ

Weather Latest Update: త్వరలో బంగాళాఖాతంలో తుపానుకు అవకాశం! నేడు వర్షాలు పడే ప్రాంతాలు ఇవే: ఐఎండీ

ABP Desam Top 10, 24 September 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 24 September 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

BRS Leaders For Chandrababu :  చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి