News
News
X

Rushikonda Highcourt : రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపిందా ? - రుషికొండ తవ్వకాల విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు !

రుషికొండ తవ్వకాల విషయంలో కేంద్రం తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంతో చేతులు కలిపినట్లుగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేసింది.

FOLLOW US: 
Share:

Rushikonda Highcourt :  విశాఖ రుషికొండ అక్రమ తవ్వకాల విషయంలో రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపినట్లుగా ఉందని ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో కమిటీ నియమించని హైకోర్టు ఆదేశిస్తే.. కేంద్రం రాష్ట్ర అధికారులతో కమిటీ నియమించింది. దీనిపై పిటిషనర్ తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.త ఈ అంశంపై  విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  పిటిషనర్ల అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అక్రమ తవ్వకాలపై నిగ్గు తేల్చేందుకు వేసిన కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించడం  కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ల తరపు లాయర్లు కేఎస్ మూర్తి, అశ్వినీకుమార్  అభ్యంతరం  వ్యక్తం చేశారు. 

కేంద్రం అఫిడవిట్‌పై హైకోర్టు ఆగ్రహం 

దీనిపై కేంద్రాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో  హైకోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ అధికారుల నియామకాన్ని సమర్థిస్తూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ పై ధర్మాసనం సీరియస్  అయింది. రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపినట్లు కనిపిస్తోందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ  అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది. గురువారం  ఉదయం విచారణ చేపడతామన్న పేర్కొన్న ధర్మాసనం .. తామే కమిటీని నియమించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

రుషికొండను అక్రమంగా తవ్వేశారని తీవ్ర ఆరోపణలు

విశాఖలో సముద్రం ఒడ్డున ఉండే రుషికొండలో గతంలో టూరిజం రిసార్ట్స్ ఉండేవి. వాటిని కూల్చి వేసి.. కొండను మొత్తం తవ్వేశారు. అక్కడ టూరిజంకు సంబంధించిన పెద్ద హోటల్ కడుతున్నామని చెప్పుకొచ్చారు. అయితే పర్యావరణ నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘించి రుషికొండలో తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.  అయితే ప్రభుత్వం మాత్రం అనుమతి ఉన్న వరకే తవ్వుతున్నామని వాదించింది. కానీ 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు మ్యాపులు సమర్పించారు. విచారణలో అనుమతి ఇచ్చిన దాని కన్నా మూడు ఎకరాలు అదనంగా తవ్వామని అంగీకరించింది. కానీ అంతకు మించి తవ్వారని పిటిషనర్లు వాదించడంతో సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సజావుగా సర్వే నిర్వహిస్తే ప్రభుత్వ బండారం బయట పడుతుందని విపక్షాలు అంటున్నాయి. 

తామే కమిటీని నియమించాల్సి  వస్తుందన్న హైకోర్టు 

 నిబంధనలకు ఉల్లంఘించినట్లుగా తేలితే.. అధికారులను జైలుకు పంపిస్తామని హైకోర్టు గతంలోనే హెచ్చరించింది. ఇప్పటికి ప్రభుత్వమే మూడు ఎకరాలు తవ్వేసినట్లుగా చెప్పడంతో నిబంధనలు ఉల్లంఘించినట్లయింది. అయితే అదనంగాఇరవై  ఎకరాలు తవ్వినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం పర్యావరణ, అటవీ అధికారులతో కమిటీ నియమించి సర్వే చేసి రిపోర్టులు ఇవ్వకుండా.. రాష్ట్ర అధికారులతో కమిటీలు నియమించడం వివాదాస్పదం అవుతోంది. హైకోర్టు ఈ అంశంపై గురువారం కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. 

టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంట విషాదం - మృత్యువుతో పోరాడుతూ కుమారుడు మృతి

Published at : 21 Dec 2022 02:38 PM (IST) Tags: Rushikonda AP High Court Rushikonda mining Rushikonda illegal mining

సంబంధిత కథనాలు

Attack On Satya Kumar :  పోలీసులు  కారు ఆపారు - వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు : సత్యకుమార్

Attack On Satya Kumar : పోలీసులు కారు ఆపారు - వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు : సత్యకుమార్

Attack On Satya Kumar : బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

Attack On Satya Kumar :  బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?

Kotamreddy Sridhar: ఆయన ఒక్కమాట చెబితే అమరావతి ఎక్కడికీ పోదు - ఎమ్మెల్యే కోటంరెడ్డి

Kotamreddy Sridhar: ఆయన ఒక్కమాట చెబితే అమరావతి ఎక్కడికీ పోదు - ఎమ్మెల్యే కోటంరెడ్డి

టాప్ స్టోరీస్

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా-  ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత