AP PRC Report : ఏపీ ఉద్యోగులకు 27శాతం ఫిట్‌మెంట్‌కు పీఆర్సీ సిఫార్సు.. 72 గంటల్లో సీఎం జగన్ నిర్ణయం !
ఏపీ ఉద్యోగులకు 27శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కార్యదర్శుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ మరేకు నివేదికను సీఎస్..సీఎం జగన్‌కు ఇచ్చారు. జగన్ 24 గంటల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
![AP PRC Report : ఏపీ ఉద్యోగులకు 27శాతం ఫిట్‌మెంట్‌కు పీఆర్సీ సిఫార్సు.. 72 గంటల్లో సీఎం జగన్ నిర్ణయం ! The Committee of Secretaries recommended that 27 per cent fitment be given to AP employees AP PRC Report : ఏపీ ఉద్యోగులకు 27శాతం ఫిట్‌మెంట్‌కు పీఆర్సీ సిఫార్సు.. 72 గంటల్లో సీఎం జగన్ నిర్ణయం !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/13/c2472135203044b2683fde4e6db4b75c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు సిఫార్సుల నివేదికను సీఎం జగన్‌కు అందించారు. 27శాతం పీఆర్సీ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ. ఎనిమిది నుంచి 10వేల కోట్ల భారం పడుతుందని సీఎస్ సమీర్ శర్మ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తమ సిఫార్సులపై సీఎం జగన్ 72 గంటల్లోగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పే రివిజన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఫైనాన్స్ వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేస్తామని...తర్వాత ఉద్యోగ సంఘాలకు కూడాఇస్తామని సమీర్ శర్మ తెలిపారు. మొత్తం పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ఎలా అమలు చేయాలన్నదానిపై 11 ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. 2018 నుంచి పీఆర్సీ అమలు ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం ఉద్యోగులకు 27శాతం మధ్యంతర భృతి ఇచ్చారు. ఒక వేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికను యథాతథంగా ఆమోదిస్తే ఉద్యోగులకు ఎలాంటి జీతభత్యాలు పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఇది ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణమయ్యే ప్రమాదం ఉన్నందున 30శాతం ఫిట్‌మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదనంగా మూడు శాతం ఇవ్వడం వల్ల ఎంత భారం పడుతుంది..? ఎప్పటి నుండి అమలు చేయాలి ? ఎలా అమలు చేయాలి? ఆర్థిక వనరుల సమీకరణ వంటి అంశాలన్నింటిపైనా నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
Also Read: Cm Jagan: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ... నోటీసులు జారీ చేసిన హైకోర్టు
వాస్తవానికి 34శాతం ఫిట్‌మెంట్ ఇవ్వబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ అంత ఇస్తే అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఆర్థికశాఖ అధికారులు అభిప్రాయపడటంతో తగ్గినట్లుగా తెలుస్తోంది. 2014లో తెలంగాణ సర్కార్ 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం కూడా అంతే ఇచ్చింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. ఆ ప్రకారమే అమలు చేస్తే ఇబ్బంది ఉండదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: Nagari Roja : నగరిలో రోజాకు "పంచ పాండవుల" కటీఫ్ .. మూడో సారి తప్పు చేయబోమని ప్రతిజ్ఞ !
సోమవారం ఫిట్‌మెంట్ ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ.. కార్యదర్శుల కమిటీ నివేదిక సీఎంకు ఇవ్వడంతోనే గడిచిపోయింది. సీఎం 72 గంటల్లో నిర్ణయం తీసుకుంటారని సీఎస్ సమీర్ శర్మ చెప్పడంతో మరో మూడు రోజుల తర్వాతే ప్రభుత్వం నుంచి అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read: Jagananna Vidya Deevena: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్... విద్యాదీవెన రివ్యూ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)