అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

TTD News : టీటీడీ విజిలెన్స్ అదుపులో ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ - ప్రోటోకాల్ దర్శన టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నట్లు ఆరోపణలు !

టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీని తిరుమల విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిఫార్సు లేఖలపై ఇచ్చే వీఐపీ దర్శన టిక్కెట్లు అమ్ముకుంటున్నట్లుగా గుర్తించారు.


TTD News :    ఏలూరుకు చెందిన టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీని తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  దర్శనాల పేరుతో భక్తుల నుండి అధిక మొత్తంలో నగదును వసూలు చేసినట్లుగా గుర్తించి ఏలూరు టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జి  టిటిడి విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫోర్జరీ ఆధార్ కార్డులతో ఇతర రాష్ట్రాలకు చేందిన భక్తులను ప్రోటోకాల్ దర్శనానికి తీసుకు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు.  

వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను రూ. 10వేలకు విక్రయిస్తున్న దళారులు

తిరుమలలో వీఐపీల బ్రేక్ దర్శనానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది.  శ్రీనివాసుడిని అతి దగ్గరగా చూడాలన్న ఆశతో ప్రజాప్రతినిధులు, అధికారుల నుండి సిపార్సు లేఖలపై కొందరు విఐపి బ్రేక్ దర్శనాలు పొందుతుంటారు.    సాధారణంగా విఐపి బ్రేక్ దర్శన టిక్కెట్ ధర రూ. 500  మాత్రమే. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కోటా ప్రకారం కేటాయిస్తూ ఉంటారు.  విఐపి బ్రేక్ దర్శనం టిక్కెట్లను దళారులు పది వేల రూపాయలకు బ్లాక్‌లో విక్రయిస్తూ ఉంటారు.  ద్వారా పొందాలంటే ఒక్కో బ్రేక్ దర్శనం టిక్కెట్ విలువ  పది  దళారులు తాము నిర్దేశించిన ధరలకు భక్తులకు దర్శన టోకెన్లను విక్రయిస్తుంటారు. 

తరచుగా సిఫార్సు లేఖలు పంపుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ - విజిలెన్స్ అధికారుల అనుమానం

గతంలో విఐపి బ్రేక్ దర్శనాల ఎల్1,ఎల్2,ఎల్3 దర్శనాలు ఉండేదవి. ప్రభుత్వం మారిన తర్వాత పాత విధానంను రద్దు చేస్తూ కేవలం విఐపి బ్రేక్ దర్శనంను మాత్రమే అమలు చేస్తూ వస్తున్నారు.  ప్రోటోకాల్ కలిగిన వ్యక్తుల వెంట పది మంది నుండి 12 మందికి వెళ్ళే వెసులుబాటు కల్పిస్తుంది టిటిడి.   దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు ప్రజాప్రతినిధులు తమ అత్యాశకు పోయి దర్శనాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా తమ దందాను ఎంచక్కా సాగిస్తున్నారు..  కొందరు స్వయంగా తామే వచ్చి తమతో వచ్చిన వారికి అన్ని మర్యాదలు సరిగ్గా అందేలా చూస్తున్నారు.. ఇలాంటి వారి కోవకు చేందిన వారే ఏలూరు టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ.. గత కొంత కాలంగా సిపార్సు లేఖలు అధికంగా ఇస్తున్నట్లు గుర్తించారు టీటీడీ ఈవో కార్యాలయ సిబ్బంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. ఎమ్మెల్సీ షేక్ షాభ్జీ లేఖలపై నిఘా ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

స్వయంగా టిక్కెట్లు కొన్న భక్తులను వీఐపీ దర్శనానికి తీసుకెళ్తున్న ఎమ్మెల్సీ షాబ్జీ 

వరుసగా తిరుమలకు  రావడం, ప్రోటోకాల్ దర్శనం కావాలని టీటీడీ అధికారులపై ఒత్తిడి తీసుకుని రావడంతో ఎమ్మెల్సీపై అనుమానం మొదలైంది.. గురువారం నాడు తిరుమలకు వచ్చిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ తనతో వచ్చిన 14 మందికి విఐపి ప్రోటోకల్ బ్రేక్ ఇవ్వాలని ఈవో కార్యాలయానికి అభ్యర్థన పంపారు.. అయితే ఇందులో ఎమ్మెల్సీతో పాటుగా మరో పది మందికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఇవ్వగా మిగిలిన వారికి సాదారణ బ్రేక్ దర్శనం ఇచ్చారు. ఎమ్మెల్సీ వ్యవహార శైలిపై నిఘా ఉంచిన టీటీడీ విజిలెన్స్ ఎమ్మెల్సీతో వచ్చిన వారి ఐడి ప్రూఫ్ వెరిఫికేషన్ చేశారు. దింతో టీచర్స్ ఎమ్మెల్సీ టిక్కెట్ల దందా బట్టబయలు అయింది. వచ్చిన 10 మందిలో ఆరుగురు వ్యక్తులు   ఫోర్జరీ ఆధార్ కార్డులతో దర్శనానికి తీసుకువెళ్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారుల తనిఖీల్లో తేలింది.  నకిలీ ఆధార్ లో  చిరునామా హైదరాబాద్ ఉంటే, వారి‌ ఒరిజినల్ ఆధార్ లో మాత్రం  కర్ణాటక రాష్ట్రం వివరాలు ఉండడంను గుర్తించారు.. 

ఎమ్మెల్సీ డ్రైవర్ ఖాతాకు లక్షల్లో నగదు బదిలీ 

6 మంది దర్శనం కోసం లక్షా 5 వేల రూపాయలను ఎమ్మేల్సి డ్రైవర్ ఖాతాకు భక్తులు నగదు బదిలీ చేసినట్లు గుర్తించామని విజిలెన్స్ అధికారులు ప్రకటించారు.  నెల రోజులు వ్యవధిలో ఎమ్మెల్సీ షేక్ షాబ్జి 19 సిఫార్సు లేఖలు జారి చేశారని వెల్లడించారు.ప్రతి సిఫార్సు లేఖను ఎమ్మెల్సీ ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులుకే ఇచ్చినట్లు టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వారి తిరుమల వన్ టౌన్ పోలీసులకు కేసు అప్పగించడం జరిగిందని గిరిధర్ తెలిపారు.. శ్రీవారి దర్శనాల పేరుతో భక్తులను మోసం చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.. దళారులను నమ్మి మోస పోవద్దని ఆయన కోరారు.. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోనే దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులను ఆయన విజ్ఞప్తి చేశారు..

షేక్ షాబ్జీ లాగే మరి‌కొందరు ప్రజాప్రతినిధులపై కూడా ఇలానే...!

దళారులుకు సిఫార్సు లేఖలు జారి చేస్తున్న 16 మంది ప్రజాప్రతినిధుల సమాచారం ఇప్పటికే టిటిడి సేకరించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ షేక్ షాబ్జి ఘటన తరహలోనే అక్రమాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు పై చర్యలకు టీటీడీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Game Changer: ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
Embed widget