AP Stampade Politics : తొక్కిసలాట మరణాల వెనుక కుట్ర కోణం - సీబీఐ దర్యాప్తునకు టీడీపీ డిమాండ్
చంద్రబాబు సభల్లో జరుగుతున్న తొక్కిసలాట ఘటనల వెనుక కుట్ర కోణం ఉందని టీడీపీ అనుమానిస్తోంది. సీబీఐ దర్యాప్తును ఆ పార్టీ కోరుతోంది.
AP Stampade Politics : గుంటూరులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్న ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటపై రాజకీయ దుమారం రేగుతోంది. ఓ వైపు ఈ ఘటనకు చంద్రబాబు కారణం అంటూ వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తోంది. మరో వైపు తెలుగుదేశం పార్టీ మాత్రం వరుసగా జరుగుతున్న తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వం తీరుపైనే విమర్శలు చేస్తున్నారు.
దుర్ఘటన జరిగిన 5 నిమిషాల్లో మంత్రులు అంతా కట్టగట్టుకొని మాట్లాడడం, సిద్ధంగా కూర్చొని ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ ట్రెండ్ చేయడం చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఈ దుర్మార్గుల పనే అని అర్థమవుతుంది#ConspiracyInStampede pic.twitter.com/NYJOBfbJtF
— Telugu Desam Party (@JaiTDP) January 2, 2023
దుర్ఘటన జరిగిన 5 నిమిషాల్లో మంత్రులు అంతా కట్టగట్టుకొని మాట్లాడడం, సిద్ధంగా కూర్చొని ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ ట్రెండ్ చేయడం చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఈ దుర్మార్గుల పనే అని అర్థమవుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు వశ్లేషిస్తున్నారు.
రాజకీయ లబ్ధి కోసం హింసకు పాల్పడటం... ఆ నేరాలను అవతలి వారి మీదకు తోసేయడం జగన్ రెడ్డికి కొత్తేమీ కాదు. తుని రైలు దహనం, బాబాయ్ వివేకా హత్య, కోడి కత్తి డ్రామా... ఇప్పుడు గుంటూరు తొక్కిసలాట... జగన్ నైజానికి నిదర్శనాలు#ConspiracyInStampede pic.twitter.com/TQwjK0KLF1
— Telugu Desam Party (@JaiTDP) January 2, 2023
గుంటూరు తొక్కిసలాటలో "చనిపోలేదు,చంపేశారు" అని జనం అనుకుంటున్నారని.. అయితే ఇది ఎవరి పని? స్వార్థం కోసం, పగ-ప్రతీకారం కోసం హత్యలకు వెనుకాడని రక్తపిశాచి ఏలుబడిలో ఇంకెవరు చేస్తారు ఈ పని? అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తోంది.
చనిపోలేదు చంపేశారు. కొత్త సంవత్సరం రోజున కానుకల పంపిణీ సందర్భంగా గుంటూరులో జరిగిన మరణాలు ప్రభుత్వ హత్యలు - తెలుగుదేశం నేత బోండా ఉమ.#ConspiracyInStampede pic.twitter.com/LvuGKQHNBF
— Telugu Desam Party (@JaiTDP) January 2, 2023
చంద్రన్న కానుక కార్యక్రమాన్ని ఒక ఎన్నారై చేపట్టారని, పోలీసుల అనుమతితోనే కార్యక్రమాన్ని నిర్వహించారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రకటించారు. పోలీసులు ముందుగానే వచ్చి స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. పోలీసులు పరిశీలించిన తర్వాత కూడా ఈ దుర్ఘటన ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఆ ముగ్గురు మహిళలు చనిపోయారా? లేక చంపేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్, ఆయన పార్టీ నేతలు కలిసి చంపేశారని ఆరోపించారు. చంద్రబాబు సభలకు జనాలు పోటెత్తుతుండటాన్ని ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు. ఈ పనులను వైసీపీ స్లీపర్ సెల్స్ చేస్తున్నాయని ఆరోపించారు.