Atchennaidu: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మాతృ వియోగం - చంద్రబాబు, లోకేశ్ సంతాపం
Andhrapradesh News: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాతృమూర్తి కళావతమ్మ ఆదివారం కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లాలోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు.

Athennaidu Mother Passed Away: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchennaidu) ఇంట ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి (Kotaboammali) మండలం నిమ్మాడలోని స్వగృహంలో ఆయన మాతృమూర్తి కళావతమ్మ (90) కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె వయోభారంతో అనారోగ్యం బారిన పడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న అచ్చెన్నాయుడికి ఈ విషయం తెలియగానే హుటాహుటిన స్వగ్రామానికి బయల్దేరారు. కళావతమ్మకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా.. భర్త దాలినాయుడు 15 ఏళ్ల క్రితం కన్నుమూశారు. పెద్ద కుమారుడు ఎర్రన్నాయుడు 12 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రెండో కుమారుడు హరివరప్రసాద్ కోటబొమ్మాళి పీఏసీఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. మూడో కుమారుడు ప్రభాకర్ డీఎస్పీగా పని చేస్తున్నారు. అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కళావతమ్మ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సంతాపం తెలియజేశారు. అటు, టీడీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు కళావతమ్మ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Before You Go
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















