అన్వేషించండి

TDP News : వైసీపీ పాలనలో నాలుగేళ్ల నరకం - పోస్టర్లతో టీడీపీ ప్రచారం !

నాలగేళ్ల నరకం అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. ప్రధాన పట్టణాల్లో పోస్టర్లను అంటిస్తున్నారు.

 

TDP News :  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ తెలుగుదేశం పార్టీ  చేపట్టిన 'నాలుగేళ్ల నరకం'ప్రచార కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొనసాగుతోంది.  రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొంటూ గణాంకాలతో సహా పోస్టర్లపై ముద్రించారు. ప్రధానంగా  గుంటూరు, విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఒంగోలు రైల్వేస్టేషన్ వంటి కీలక  ప్రాంతాలలో పోస్టర్లు అంటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాల రేట్లు, వెనుకబడిన వర్గాలు, మహిళలపై దాడులు, ఎయిడెడ్ పాఠశాలల మూసివేత, పీజీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల తొలగింపు, రైతు ఆత్మహత్యలు, ఆగిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, MNC కంపెనీల తరలింపు, నిరుద్యోగం వంటి కొన్ని ప్రధాన అంశాలు పోస్టర్‌లపై హైలైట్ చేశారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు పెరిగిపోయాయి. మహిళలపై దాడుల సంఖ్య 2020లో 7,039 ఉండగా 2021లో 10,373 నుండి 2022 నాటికి 11,895కి పెరిగింది. మహిళలకు మరింత రక్షణ కల్పించాల్సిన 'దిశా' చట్టం , ఇప్పటికీ అమలు కాలేదు. 2023 ఎస్సెస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం 77 శాతంగా నమోదైంది. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అంతకుముందు టీడీపీ హయాంలో ఉత్తీర్ణత శాతం ఎప్పుడూ 90శాతం కిందకు పడిపోయిన దాఖలాలు లేవు. పీజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్‌లను రద్దు చేసింది.దీంతో పీజీ విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో చదువుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు కూడా పెంచకపోవడంతో మరింత ఇబ్బందులకు విద్యార్థులు గురవుతున్నారు.

రైతు ఆత్మహత్యలు: రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉంది. గడిచిన నాలుగేళ్లలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పక్క రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ ఖరీదు 15,000 రూపాయలు కాగా, రాష్ట్రంలో అది 36,000 రూపాయలుగా ఉంది. ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై తక్కువ పెట్టుబడి,పెరిగిన నిరుద్యోగం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో పదకొండు వైద్య కళాశాలలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈ కాలేజీలకు సూపరింటెండెంట్లు కూడా లేరు. ప్రభుత్వ వేధింపుల వల్ల 53 పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయి. కనీసం 0.5% విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి రాలేదు. చిత్తూరు డెయిరీ ఆస్తులను 99 ఏళ్లకుగాను అమూల్‌ సంస్థకు అప్పగించారు. గడిచిన నాలుగేళ్లలో ఉద్యోగాల క్యాలెండర్ ఎక్కడ వేసిన గొంగిలి అక్కడే అన్నట్లుగా ఉంది. ఒక్క డీఎస్సీ పరీక్ష కూడా జరగలేదు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత యువతలో నిరుద్యోగిత రేటు 35.1 శాతంగా ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని చెబుతూ పోస్టర్ల ద్వారా సామజిక మాధ్యమాల్లో చర్చను తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో నాలుగేళ్ల నరకం అనే ఈ క్యాంపెయిన్‌ను మరింత విస్తృతం చేయనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రజలు ఈ ర్యాలీల్లో పాల్గొనడంతో పాటు సోషల్ మీడియా క్యాంపెయిన్‌లో కూడా భాగస్వాములు కావాలని టీడీపీ పిలుపునిచ్చింది. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను #NalugellaNarakam అనే హ్యాష్‌ట్యాగ్‌లో విస్తృతంగా షేర్ చేయాలని కోరుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget