అన్వేషించండి

TDP MLA Thomas: మేము బానిసలుగా ఉండాలా? - సొంత పార్టీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే థామస్ నిప్పులు

TDP MLA Thomas: గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గెలిపించే ఎస్సీలు కావాలి.. కానీ అధికారంలో వాటా ఇవ్వమంటే మాత్రం తొక్కేయాలా? ఇదేం న్యాయం? అని ప్రశ్నించారు

TDP MLA Thomas allegations against own party leaders:   గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ ఎమ్మెల్యేలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని, కొందరిలో దళితులంటే చులకన భావం ఉందని ఆయన బహిరంగంగానే నిలదీశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో మాట్లాడారు. ఎన్నికలప్పుడు ఖర్చు పెట్టే ఎస్సీలు కావాలి, గెలిపించే ఎస్సీలు కావాలి.. కానీ అధికారంలో వాటా ఇవ్వమంటే మాత్రం తొక్కేయాలా  ఇదెక్కడి న్యాయం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎస్సీలు ఎప్పటికీ బానిసలుగానే ఉండాలనే భావన కరెక్ట్ కాదని ఆయన హెచ్చరించారు.

 నియోజకవర్గంలో ఆధిపత్య పోరు 

ఎమ్మెల్యే థామస్ ఇంత ఘాటుగా స్పందించడానికి గంగాధర నెల్లూరులో నెలకొన్న రాజకీయ పరిస్థితులే ప్రధాన కారణమని తెలుస్తోంది. నియోజకవర్గంలో టీడీపీలోని ఒక వర్గం ఎమ్మెల్యేకు సహకరించకుండా, సమాంతరంగా పాలన సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ముఖ్యంగా పనుల కేటాయింపు, అధికారుల బదిలీలు మరియు స్థానిక నిర్ణయాల్లో తనను కాదని ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు పెత్తనం చేస్తున్నారని ఆయన భావిస్తున్నారు.  

 టార్గెట్ చేస్తున్నది ఎవరు? 

మరే ఇతర కులాల్లో ఎమ్మెల్యేలు తప్పులు చేయడం లేదా? కేవలం ఎస్సీ ఎమ్మెల్యేలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అని థామస్ ప్రశ్నించారు. గంగాధర నెల్లూరులో గత కొంతకాలంగా ద్వితీయ శ్రేణి నాయకత్వానికి, ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్ పెరిగిందని సమాచారం. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, కొందరు ఆధిపత్య సామాజిక వర్గాల నేతలు తన అధికారాలకు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మేము కేవలం ఓట్లు వేయడానికేనా? అధికారంలో ఉండకూడదా? అన్న ప్రశ్నను ఆయన సంధించారు.  

  కూటమికి తలనొప్పిగా మారిన   వ్యాఖ్యలు                              

ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కోనేటి ఆదిమూలం కుమారుడు ఇలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరో అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలా వివక్షపై గళమెత్తడం టీడీపీ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే  ఈ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై  సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.   థామస్ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతర్గత పోరును చక్కదిద్దకపోతే, అది ఇతర ఎస్సీ నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.                            

 

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Embed widget