అన్వేషించండి

Yuvagalam Padayatra: వైఎస్సార్, చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులే, కానీ ఆ లక్ష్మణ రేఖను దాటలేదు: నారా లోకేశ్

Yuvagalam Padayatra: యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ వైఎస్సార్, చంద్రబాబులపై ఆసక్తికర కామెంట్లు చేశారు. వారిద్దరూ ఎప్పుడూ వ్యక్తిగతంగా దూషించుకోలేదని చెప్పారు.

Yuvagalam Padayatra: రాజకీయాల్లో ఓ లక్ష్మణ రేఖ ఉంటుందని.. దానిని ఎవరూ దాటకూడదని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. 68వ రోజు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండల కేంద్రంలో లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభించారు లోకేశ్. యువగళం పాదయాత్ర తూట్రాలపల్లికి చేరుకోగానే నారా లోకేష్ భోజన విరామం తీసుకున్నారు. ఈ విరామ సమయంలోనే ఆయన రెడ్డి సామాజిక వర్గీయులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్.. మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ ప్రత్యర్థులు అయినప్పటికీ, ఎప్పుడూ వ్యక్తిగతంగా దూషించుకోలేదని లోకేశ్ తెలిపారు. ఇద్దరూ పరస్పరం గౌరవంగా మెలిగారని గుర్తు చేశారు. నేటి కాలంలో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. టీడీపీలో కులం, మతం, ప్రాంతం అంటూ తేడాలేమీ ఉండవని.. కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయడమే తమ పార్టీకి తెలిసిన విషయమని లోకేశ్ స్పష్టం చేశారు. 

'జగన్ రాష్ట్ర పరువు తీస్తున్నారు'

తాడిపత్రిలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసుని లోకేశ్ అన్నారు. ఎప్పుడైనా జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యంగా ఇతరుల ఇళ్లకు వెళ్లారా అని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యంగా ఇతరుల ఇళ్లకు వెళ్లి కుర్చీలో కూర్చున్నారా అని నిలదీశారు. ప్రస్తుత తాడిపత్రి శాసన సభ్యుడు ఏం చేస్తున్నారో, ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుని లోకేశ్ అన్నారు. అందరం కలిసే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని లోకేశ్ హితవు పలికారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడూ రాష్ట్ర పరువు తీసిని దాఖలాలు లేవని, చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులను వైఎస్సార్ కొనసాగించారు కానీ చెడగొట్టలేదని అన్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరువు పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏదైనా అభివృద్ధి జరిగిందా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని సూచించారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన అధికారులపై న్యాయ పోరాటానికి సిద్ధమని నారా లోకేశ్ తేల్చి చెప్పారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని, ఎప్పుడో ఒకప్పుడు దిగిపోవాల్సి వస్తుందని, వ్యవస్థ మాత్రమే శాశ్వతం అన్న విషయాన్ని అధికారులు గుర్తించుకోవాలని లోకేశ్ సూచించారు.

'జాబ్ క్యాలెండర్ హామీ ఏమైంది'

యువగళం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజవర్గంలోని పి.కొట్టాలపల్లిలో... నిరుద్యోగులు, రైతులు నారా లోకేశ్ ను కలిశారు. రైతులు, నిరుద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై లోకేశ్ కు వినతి పత్రాలు అందజేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని, సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అకాల వర్షాలకు పంటలు దెబ్బతినగా.. నేటిక నష్టపరిహారం అంచనాలు సిద్ధం చేయలేదని రైతులు నారా లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని హామీ ఇచ్చి సీఎం జగన్ ఆ హామీని నెరవేర్చలేదని నిరుద్యోగులు వాపోయారు. రాష్ట్రంలో ఉపాధి దొరక్క యువత ఇతర రాష్ట్రాలకు వలస పోతోందని వారు లోకేశ్ కు తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Borugadda Anil Protest Outside YS Jagan Residence: తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన - సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు!
తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన - సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు!
Chandrababu Naidu Narendra Modi Relation Strategy: మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Embed widget