By: ABP Desam | Updated at : 27 Apr 2023 06:54 PM (IST)
మార్గదర్శి కేసుపై జీవీ రెడ్డి వర్సెస్ ఉండవల్లి అరుణ్ కుమార్
Margadarsi Case: మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు విషయంలో టీడీపీ, ఉండవల్లి అరుణ్ కుమార్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. రెండు రోజుల కిందట మీడియాతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్.. మార్గదర్శి అంశంపై టీడీపీ నేతలతో చర్చకు సిద్ధమన్నారు. ఈ అంశంపై టీడీపీ అధికార ప్రతినిధి, చార్టెడ్ అకౌంటెంట్ అయిన జీవీ రెడ్డి స్పందించారు. మార్గదర్శిలో ఏదో జరిగిందని ఉండవల్లి హడావిడి చేస్తున్నారని.. చందాదారులకు ఏదో నష్టం జరగబోతోందని ఉండవల్లి చెబుతున్నారని మండిపడ్డారు. మే 14న హైదరాబాద్ లో ఉండవల్లితో చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. చర్చకు సిద్ధంగా ఉన్నామని ఉండవల్లికి స్పష్టం చేశామని.. టీడీపీ కార్యాలయానికి ఉండవల్లి వస్తానన్నారని జీవీరెడ్డి తెలిపారు.
ఉండవల్లి టీడీపీ ఆఫీసుకు రాకపోతే తాము వైసీపీ కార్యాలయానికి రావడానికైనా సిద్ధమని ప్రకటించారు. సీఎం జగన్ లేదా సజ్జల సమక్షంలో చర్చకైనా మేం సిద్ధమని జీవీ రెడ్డి ప్రకటించారు. వేదిక ఎక్కడనేది కాదు.. చర్చ ముఖ్యమని స్పష్టం చేశారు. బలబలాలకు సంబంధం లేదన్నారు. చర్చే ముఖ్యం వాస్తవాలేంటనేది ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. బాధితులు లేరు.. ఫిర్యాదుదారులు లేరు – ప్రతి అంశంపై చర్చించేందుకు సిదమని స్పష్టం చేశారు. చట్టం ఏం చెబుతుంది.. కోర్టులు ఏమంటున్నాయన్న దానిపై చర్చించాలన్నారు. ఏం మాట్లాడినా దానికి ఆధారాలు ఉండాలి – ఆధారాలు లేకుండా మాట్లాడితే సరిపోదన్నారు.
తాము అన్ని ఆధారాలతో చర్చకు వసమని ఎవరు మాట్లాడినా సబ్జెక్ట్ పైనే చర్చించాలి అడ్డగోలు వాదనలతో కాలయాపన మంచిది కాదన్నారు. పరిశ్రమలు రావాలనే టీడీపీ ఎప్పుడూ కోరుకుంటోంది – పరిశ్రమలు వస్తే ఉద్యోగావకాశాలు వస్తాయని భావిస్తామన్నారు. కొన్నాళ్లుగా మార్గదర్శిపై పలు రకాల ఆరోపణల్ని ఉండవల్లి అరుణ్ ుమార్చేస్తున్నారు. మార్గదర్శిపై పోరాటం బేతాళ విక్రమార్క కథను తలపించేలా సాగుతోందన్నారు హెచ్‌యూఎఫ్ ద్వారా డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ సరైన యంత్రాంగం లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ విచారణకు వచ్చిందన్నారు. డిపాజిట్ల వివరాలు వెల్లడించకుండా 17 ఏళ్ల పాటు మార్గదర్శి నిరాకరించిందని ఆరోపిస్తున్నారు.
రామోజీరావు అన్నింటికీ అతీతుడనే అంశాన్ని అరికట్టకపోతే, ప్రజల్లోకి తప్పుడు భావన వెళ్తుంది. తప్పు చేశామని ఒప్పుకుని, జరిమానా కడితే సరిపోతుందని చెప్తున్నా.. ఎంత దుష్ప్రచారం చేసినా జరగాల్సింది జరిగితీరుతుందన్నారు. ప్రముఖ స్థానంలో వున్న రామోజీరావు లాంటి వాళ్లు చేసిన పొరపాట్లను ఒప్పుకుంటే ఆదర్శవంతంగా ఉంటుందని సలహా ఇచ్చారు. తానేను ఆరోపణలు చేసిన తర్వాత కూడా, మార్గదర్శికి డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయని వాళ్లే ప్రచారం చేసుకున్నారని ఉండవల్లి అంటున్నారు. చిట్ ఫండ్ వ్యాపారం చేస్తూ తాను కంపెనీ యాక్ట్ ప్రకారం తమ కంపెనీ పనిచేస్తుందని చెప్పడం విడ్డూరమని.. స్పష్టం చేశారు. ఈ కేసు విషంయలో తనకెటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవని ఎవరితోనైనాచర్చకు సిద్ధమని చెప్పారు. ఆయనతో చర్చకు జీవీరెడ్డి సిద్ధమయ్యారు.
రూమ్ తీసుకున్నాడు, భార్యను పిలిచి చంపేశాడు - అనకాపల్లి జిల్లా లాడ్జ్ కేసు ఛేదించిన పోలీసులు
ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల
TTD News: శ్రీనివాసుడి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?
Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి
AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
Delhi Murder Case: మాట్లాడటం లేదనే ఢిల్లీలో బాలిక హత్య- నేరాన్ని అంగీకరించిన సాహిల్
Prabhas Vs Bollywood Heroes : ప్రభాస్ కంటే శ్రీ రాముని పాత్రకు ఆ హిందీ హీరోలు బెటరా?
కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !