Ayyanna Patrudu : జిల్లాకో ఎయిర్‌పోర్టు ప్రకటనపై అయ్యన్న కామెంట్స్.. రావు రమేష్ డైలాగ్‌తో జగన్‌పై సెటైర్లు
జీతాలు, పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వలేని ముఖ్యమంత్రి ప్రతి జిల్లాకు ఎయిర్‌పోర్టు ఎలా నిర్మిస్తారని టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ జిల్లాకి ఒక ఎయిర్‌పోర్ట్ కట్టాలని.. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలివ్వడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. ఇప్పటికే తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, సర్వనాశనం చేసేశారన్నారు. రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజిలు 7,880 కోట్లతో కడతాడని అనౌన్స్ చేసి, క్రిందటి సంవత్సరం మే 30 వ తేదీన 14 మెడికల్ కాలేజీలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఆ కాలేజిలు ఏమయ్యాయని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
Also Read: బీజేపీ అంటే ఫ్లవర్ కాదు ఫైర్... నిప్పుతో చెలగాటమాడవద్దని జగన్‌కు నేతల హెచ్చరిక !
ఎంప్లాయ్స్ కి , పెన్షన్ దారులకు టైంకి జీతాలు చెల్లించలేకపోతున్నారని..అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకు ఆరు నెలల నుండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోయారన్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చెయ్యడానికి డబ్బులు లేవు, ఉత్తరాంద్ర సుజల స్రవంతి ప్రాజక్టు కట్టడానికి డబ్బుల్లేవని కారణాలు చెబుతున్నారని గుర్తు చేశారు. విజయనగరంలో ట్రైబుల్ యూనివర్సి కట్టలేకపోయావు.. కరోనా సెకండ్ వేవ్ టైం లో క్వారంటైన్ సెంటర్లలో బోజనాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లుకి కోట్ల రూపాయలు పేమెంట్లు చెల్లించ లేకపోయారు.. కానీ, జిల్లాకో ఎయిర్‌పోర్టు కడతారా అని ఎద్దేవా చేశారు.
Also Read: ఇవిగో గుడివాడ కేసీనో ఆధారాలు... రిలీజ్ చేసిన టీడీపీ !
గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకు మధ్యాహ్న బోజనాలు పెడతున్న కాంట్రాక్టర్లుకి డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ఆర్ అండ్ బీ పనులు చేసిన కాంట్రాక్టర్లు, నీరు - చెట్టు పనులు, ఉపాధి హామీ పనులు చేసిన కాంట్రాక్టర్లకూ డబ్బులు చెల్లించడం లేదని..కోట్ల రూపాయలు హౌసింగ్ బిల్లులు పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం జిల్లాకో ఎయిర్‌పోర్టు ఎలా కడుతుందని ప్రశ్నించారు. రైతులు దగ్గర కొన్న దాన్యానికి ప్రబుత్వం ఇవ్వాల్సిన డబ్బులే ఇవ్వలేదు, రైతులకు ఇవ్వవలసిన చెరుకు బకాయిలు చెల్లించలేదన్నారు. ఆఖరికి, కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు కుడా పరిహారం కూడా చెల్లించలేకపోయారు.. విమానాశ్రయాలు ఎలా కడతారన్నారు.
సంపద సృష్టించడం చేతకాక, ఓటీఎస్ పేరుతో పేద ప్రజల దగ్గర బలవంతపు వసూళ్ళు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని.. . ఆఖరికి చెత్త మీద, డ్రైనేజి మీద పన్నులు వసూలుచేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్‌పోర్టులు కడతామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈ తుగ్లక్ నిర్ణయాలన్నీ చూస్తుంటే మీకు ఎలా ఉందో తెలియదు గాని, మాకైతే మీ ఆయనకీ ఎదో అయిందని అనుమానంగా ఉందని ఒకసారి హైదరాబాదులో గాని విశాఖపట్నంలో గాని హాస్పిటల్లో చూపించండి అమ్మా అని జగన్ సతీమణి భారతికి అయ్యన్నపాత్రుడు సలహా ఇచ్చారు.