అన్వేషించండి

Chandrababu: 'ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటు' - హనుమవిహారికి అండగా ఉంటామన్న చంద్రబాబు

AP News: క్రికెటర్ హనుమ విహారిని వేధించారని.. అతనికి తాము అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Chandrababu Responds on Hanumavihari Issue: రాష్ట్రంలో వైసీపీ రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. క్రికెటర్ హనుమవిహారి (Hanuma Vihari) విషయంపై మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతిభావంతుడైన క్రికెటర్ హనుమ విహారి.. ఏపీ తరఫున ఎప్పటికీ ఆడబోనని ప్రకటించేలా వేధించారని ఆరోపించారు. హనుమవిహారికి తాము అండగా ఉండి అతనికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. 'హనుమ విహారి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆట పట్ల అతనికున్న చిత్తశుద్ధిని వైసీపీ కుట్రా రాజకీయాలు నీరు గార్చలేవు. అన్యాయమైన చర్యలను ఏపీ ప్రజలు ప్రోత్సహించరు.' అని అన్నారు.

నారా లోకేశ్ ట్వీట్

అటు, అధికార పార్టీ రాజకీయ జోక్యంతో ఆంధ్రా క్రికెట్ నుంచి హనుమ విహారి నిష్క్రమించడం ఆశ్చర్యం కలిగిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. '2 నెలల్లో ఏపీ తరఫున తిరిగి ఆడడానికి హనుమ విహారి రావాలి. విహారి, అతని జట్టుకు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతాం. ఆంధ్రా క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీ గెలిచేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం.' అని లోకేశ్ ట్వీట్ చేశారు.

'ఎంతటి అవమానం.?'

క్రికెటర్ హనుమవిహారి అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ కార్పొరేటర్ కోరుకున్న కారణంగానే విహారి కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని మండిపడ్డారు. 'హనుమ విహారి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆటలో మంచి ప్రతిభ కనబరిచారు. భారత్, ఆంధ్ర కోసం తన సర్వస్వం ఇచ్చారు. మన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు ఇండియన్ క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ రంజీ టీం కెప్టెన్ కంటే క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ లేని స్థానిక వైసీపీ రాజకీయ నాయకుడే చాలా విలువైన వాడు. ఎంతటి అవమానం. సీఎం జగన్ గారూ.. మన ఆంధ్రా క్రికెట్ టీం కెప్టెన్ ను అవమానించినప్పుడు 'ఆడుదాం ఆంధ్రా' వంటి ఈవెంట్లలో కోట్లాది డబ్బు ఖర్చు చేయడం ఏంటి.?. ఆటగాళ్లను గౌరవించడం తెలిసిన స్టేట్ బోర్డుతో వచ్చే ఏడాది హనుమ విహారి మళ్లీ ఆడతారని ఆశిస్తున్నా.' అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

షర్మిల తీవ్ర ఆగ్రహం

హనుమ విహారి అంశంలో వైసీపీపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా? అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్లు, ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను, అధికారమదాన్ని చూపుతున్నారు. రాష్ట్ర ప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్లు ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేము. ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు నెలలు సినిమా స్టంట్స్ చేయించిన వైసీపీ నేతలు, అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా? ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా? ఇది ఆంధ్ర క్రికెట్ అస్సోసియేషనా లేకా అధ్వానపు క్రికెట్ అస్సోసియేషనా? ఈ విషయంపై వెనువెంటనే నిస్పాక్షికమైన విచారణ జరగాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.' అని ట్వీట్ చేశారు.

Also Read: AP MLAs Disqualified: 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన ఏపీ స్పీకర్

టాప్ హెడ్ లైన్స్

Rs 500 Notes Ban: మళ్లీ పెద్ద నోట్లు రద్దు! ప్రధాని మోదీని మరోసారి కోరతాం: ఏపీ సీఎం చంద్రబాబు
మళ్లీ పెద్ద నోట్లు రద్దు! ప్రధాని మోదీని మరోసారి కోరతాం: ఏపీ సీఎం చంద్రబాబు సంచలనం
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
AP Fire Accidents: ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు
ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Comedy Drama OTT : ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget