X

TDP Reaction On Result : అసెంబ్లీ రద్దు చేసి మళ్లీ గెలిస్తే టీడీపీ రద్దు ..వైఎస్ఆర్సీపీకి టీడీపీ సవాల్ !

ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని అక్రమాలు చేసినా టీడీపీకి ప్రజలు మద్దతిచ్చారని అచ్చెన్నాయుడు ప్రకటించారు. ప్రజామద్దతు ఉందనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు.

FOLLOW US: 

ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా ఎన్నికల్లో బయటపడిందని తెలుగుదేశం పార్టీ అభిప్రాయపడింది. గత స్థానిక  సంస్థల ఎన్నికల సమయంలో 30 శాతంగా ఉన్న తమ ఓటు బ్యాంక్ 45 శాతానికి పెరిగిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ప్రజాభిమానం ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని నమ్మితే తక్షణం ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ గెలిస్తే తెలుగుదేశం పార్టీని మూసేస్తామని ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల ఫలితాలపై మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. 

Also Read : వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ అదుపులో శివశంకర్ రెడ్డి

ప్రభుత్వం అన్ని రకాల వ్యవస్థలను ఉపయోగించుకుని ఎన్ని నిర్బంధాలు అమలు చేసినా.. వందల కోట్లు  ఖర్చు పెట్టినా పలు చోట్ల తాము గెలిచామని అచ్చెన్నాయుడు తెలిపారు. దర్శిలో విజయం సాధించామని పల్నాడులో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయకుండా వేధించినా... అక్కడా మంచి పనితీరు కనబరిచామన్నారు. ఇది ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు స్పష్టమైన సూచన అని స్పష్టం చేశారు. బుగ్గన స్వగ్రామం బేతంచర్లలో టీడీపీ ఆరు వార్డుల్ని గెల్చుకుందని..  బుగ్గన నివాసం ఉంటున్న వార్డులోనూ టీడీపీ గెలిచిందన్నారు. 

Also Read : ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ? ఏపీ బీజేపీ నేతలకు చివరి చాన్స్ !?

కుప్పంలో జరిగిన ఎన్నికలు అసలు ఎన్నికలే కాదని స్పష్టం చేశారు. వందల మంది దొంగ ఓటర్లు, వ్యవస్థల్ని ఉపయోగించుకుని.. టీడీపీ నేతల్ని అరెస్ట్ చేసి పోలింగ్ నిర్వహించుకున్నారని ఇలా ఎన్నికలు నిర్వహించి తామే గెలిచామని చెప్పుకోవడం సిగ్గు అని ఎర్రన్నాయుడు మండిపడ్డారు. ప్రజలు అధికార పార్టీ అరాచకాలను చూసి నవ్వుతున్నారని విమర్శించారు. ఇలాంటి గెలుపులే నిజమైతే ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు.

Also Read : నెల్లూరులో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్..కనీస పోటీ ఇవ్వలేకపోయిన టీడీపీ !

తమ వైపు తప్పులుంటే విశ్లేషణ చేసుకుని సరిదిద్దుకుంటామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలను చూసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం విషయం చేస్తున్న ప్రచారాన్ని చూసి అధైర్యపడవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నందున ఇక ముందు ముందు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. 

Also Read : కుప్పం ఓటమిని అంగీకరించి రాజకీయాల నుంచి వైదొలగాలి .. చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సూచన!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: ANDHRA PRADESH YSRCP tdp AP Local Polls Achennai AP local election results

సంబంధిత కథనాలు

Dollar Seshadri Is No More: తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూత

Dollar Seshadri Is No More: తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూత

Weather Updates: మరో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Updates: మరో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు

Petrol-Diesel Price, 29 November: వాహనదారులకు శుభవార్త, స్వల్పంగా తగ్గిన ఇంధన ధరలు.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలివీ..

Petrol-Diesel Price, 29 November: వాహనదారులకు శుభవార్త, స్వల్పంగా తగ్గిన ఇంధన ధరలు.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలివీ..

Gold-Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. వెండి కూడా అదే దారిలో.. నేటి ధరలివే..

Gold-Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. వెండి కూడా అదే దారిలో.. నేటి ధరలివే..

Road Accident: చిత్తూరు జిల్లాలో పెళ్లి బస్సు బోల్తా... 27 మందికి తీవ్రగాయాలు

Road Accident: చిత్తూరు జిల్లాలో పెళ్లి బస్సు బోల్తా... 27 మందికి తీవ్రగాయాలు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Vitamin D in Winter: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?

Vitamin D in Winter: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?

Shiva Shankar Master: నడవలేడనుకున్న మనిషి.. కొరియోగ్రాఫర్ గా మారి..

Shiva Shankar Master: నడవలేడనుకున్న మనిషి.. కొరియోగ్రాఫర్ గా మారి..

AP Governor: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కు మరోసారి అస్వస్థత... హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు

AP Governor:  ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కు మరోసారి అస్వస్థత... హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు

Redmi Note 11T 5G: రూ.17 వేలలోనే రెడ్‌మీ సూపర్ 5జీ ఫోన్.. రెండు రోజుల్లో మార్కెట్లోకి!

Redmi Note 11T 5G: రూ.17 వేలలోనే రెడ్‌మీ సూపర్ 5జీ ఫోన్.. రెండు రోజుల్లో మార్కెట్లోకి!