Andhra Pradesh: ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
TDP Big Fact News | ఏపీలో టీడీపీ, వైసీపీ గురువారం నాడు ఓ భారీ బాంబు పేల్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఏ పార్టీ ఏం ప్రకటన చేస్తుందోనని ఏపీ ప్రజలతో పాటు తెలంగాణ వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
TDP and YSRCP announced that they will reveal a big thing at 12 noon on 24 October అమరావతి: ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అటు తెలుగుదేశం పార్టీ నేతలు, ఇటు వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో గురువారం ఏం జరుగబోతోందా అని రాష్ట్ర ప్రజలతో పాటు తెలంగాణ వారిలో సైతం ఉత్కంఠ పెరిగింది. అందుకు కారణంగా తెలుగుదేశం, వైసీపీ పార్టీలు ఇచ్చిన ఓ అప్ డేట్. Big Expose Stay Tunes అని తెలుగుదేశం పార్టీ బుధవారం ఉదయం ఓ ట్వీట్ చేసింది. దాంతో వైసీపీ పాలనకు సంబంధించి ఓ పెద్ద రహస్యం గురువారం నాడు టీడీపీ బయట పెట్టనుందని ప్రచారం జరిగింది.
తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు రేపటి కోసం..
ఢిల్లీ వెళ్లి లోకేష్ పేరు కలవరిస్తున్నావ్.. పప్పు పప్పు అంటేనే, పప్పు గుత్తి దించితే, సొంత కొంపలో కూడా ఉండలేక భయపడుతూ బెంగుళూరులో బతుకుతున్నావ్ అని టీడీపీ సోషల్ హ్యాండిల్స్ లో పోస్ట్ చేసింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో కనీసం లోకేష్ ను పేరు కూడా పెట్టి పిలవలేదని, ఇప్పుడు చాలా మార్పొచ్చింది అంటున్నారు టీడీపీ నేతలు. అయితే కంగారు పడకు, లోకేష్ అనే పేరునే రేపటి నుంచి నువ్వు కలవరిస్తూనే ఉంటావ్ అని మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. కన్న తల్లి, చెల్లినే చూసి ఓర్వలేదు కానీ, ఈయన గుడ్ బుక్ అని రాసి కార్యకర్తలకు మేలు చేస్తాడంట అని టీడీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నారు.
Big Expose! Coming on 24th Oct at 12 PM!!
— Telugu Desam Party (@JaiTDP) October 23, 2024
Stay Tuned!! pic.twitter.com/PlvS65Kdz2
ట్రూత్ బాంబు పేల్చుతామన్న వైసీపీ
టీడీపీ ఎక్స్ ఖాతాలో బిగ్ ఎక్స్ పోజ్ అని ప్రకటన వచ్చిన గంటల్లోనే వైసీపీ స్పందించింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ బాంబు వదులబోతున్నామని ఊరించింది. ప్రిపేర్ ఫర్ ద బిగ్ రివీల్ అంటూ వైసీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే టీడీపీ వదలనున్న బాంబుకు ఇది విరుగుడు బాంబు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇది ట్రూత్ బాంబ్ అని, సంచలన వాస్తవాలు వెలుగులోకి తెస్తామని వైసీపీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ వైసీపీ, టీడీపీ పార్టీలు ఏం చెబుతాయి, ఎలాంటి సంచలన విషయాలు వెల్లడిస్తాయి, ఏ సంచలన ప్రకటన చేస్తుందోనని రేపటి కోసం ఏపీతో పాటు తెలంగాణ ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Get ready for the truth bomb 💣 Dropping on 24th Oct at 12 PM!
— YSR Congress Party (@YSRCParty) October 23, 2024
Stay tuned ❗#BigExpose pic.twitter.com/IxkzYt2N4x
ఏపీలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ సీఎం జగన్ ఢిల్లీ వేదికగా సైతం ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుడా పోయిందని, ప్రతిపక్షమైన తామే బాధితుల కోసం ఎంతో చేస్తుంటే, అధికారంలో ఉండి కూటమి పార్టీలు ఏం చేస్తున్నాయని జగన్ మండిపడుతున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక బాలికలు, యువతులు, మహిళలపై ప్రతిరోజూ అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోవడం లేదని, ప్రజలే బుద్ధి చెబుతారని వైసీపీ అంటోంది.