AP CM Chandrababu: చంద్రబాబు తొడ కొట్టారా... పవర్ స్టార్ మేనరిజమ్ చేశారా? రిస్క్‌లో పెట్టిన బాలకృష్ణ డబుల్ టాస్క్
Unstoppable With NBK Season 4: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేత సినిమా స్టైల్ విన్యాసాలు బాలకృష్ణ చేయించినట్లు తెలుస్తోంది. రెండు టాస్కులు ఇవ్వగా... అందులో సీఎం ఏం చేశారు? అనేది ఆసక్తికరం.

బావమరిది బాలకృష్ణ (Balakrishna)కు ఓటు వేశారా? లేదంటే రాజకీయ పరంగా తనతో పాటు ముందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వైపు మొగ్గు చూపించారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఏం చేశారు? సినిమా స్టైల్ లో ఆయన ఏది చేయడానికి ఆసక్తి చూపించారు? అనేది తెలియాలంటే శుక్రవారం రాత్రి వరకు వెయిట్ చేయాలి. అసలు వివరాల్లోకి వెళితే....
చంద్రబాబుకు రెండు టాస్కులు ఇచ్చిన బాలయ్య
నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' (Unstoppable With NBK Season 4) టాక్ షో నాలుగో సీజన్ మొదలు కావడానికి మరీ ఎన్నో రోజులు సమయం లేదు. ఈ శుక్రవారం... అక్టోబర్ 25వ తేదీ రాత్రి 8:30 గంటలకు మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయడానికి ఆహా ఓటీటీ రెడీ అయింది. ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా వచ్చిన ఎపిసోడ్ తో షో మొదలు పెడుతోంది. ఆల్రెడీ విడుదలైన ప్రోమోలో చూపించిన వివరాల కంటే షోలో చంద్రబాబు చేత బాలయ్య ఫన్నీ థింగ్స్ చాలా చేయించారట.
'అన్ స్టాపబుల్ షో'లో తన తరహాలో తొడ కొట్టాలని చంద్రబాబును బాలకృష్ణ అడిగారట. లేదంటే జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజం చేసి చూపించమని చెప్పారని తెలిసింది. రెండు టాస్కుల్లో ఏదో ఒకటి చేయమని చంద్రబాబును బాలకృష్ణ అడిగారు. మరి ఆ రెండిట్లో ఏది చేశారు? లేదంటే రెండు చేసి చూపించారా? పవన్ కళ్యాణ్ బాలకృష్ణలలో ఒక్కరికి ఓటు వేయడం కంటే ఇద్దరికీ ఓటు వేశారా? అనేది తెలియాలంటే శుక్రవారం రాత్రి 8:30 గంటలకు స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్ చూడాలి.
Also Read: 'అన్ స్టాపబుల్'లో చంద్రబాబును బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు ఇవే - కాంట్రవర్సీలకు ఏపీ సీఎం ఏం చెప్పారో?
చంద్రబాబుకు బాలకృష్ణ స్వయానా బావమరిది. తన కుమార్తె బ్రాహ్మణిని చంద్రబాబు ఇంటికి కోడలిగా పంపించారు. మేనకోడల్ని తన కుమారుడు (నారా లోకేష్)కి ఇచ్చి వివాహం చేయడం ద్వారా తన బావమరిది బాలకృష్ణను వియ్యంకుడు చేసుకున్నారు చంద్రబాబు. సినిమాల్లో బాలయ్యకు సపరేట్ స్టైల్ ఉంది. ఆయన తొడ కొడితే ఆ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. ఇక, పవన్ కళ్యాణ్ మేనరిజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రాజకీయాలు, కుటుంబ సంగతులు... ఏదీ వదల్లేదు!
చంద్రబాబును 'అన్ స్టాపబుల్' షో కి రావడం ఇది మొదటిసారి కాదు. తనయుడు నారా లోకేష్, ఆయన కలిసి రెండో సీజన్లో సందడి చేశారు. అప్పట్లో ప్రతిపక్షాలు చేసే కొన్ని విమర్శల మీద చంద్రబాబు సహా లోకేష్ కూడా స్పందించారు. ఆ తరువాత ఏపీలో రాజకీయ పరంగా చాలా పరిణామాలు జరిగాయి. చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజులు జైల్లో ఉంచడంతో పాటు వైసీపీ పార్టీ పలు విమర్శలు చేసింది. తాము 175కు 175 సీట్లు గెలుస్తామని, చంద్రబాబు మరోసారి అధికారానికి దూరం కాక తప్పదని ప్రగల్బాలు పలికింది. అయితే అనూహ్య రీతిలో వైసిపి చతికల పొడిగా... తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ కూటమి విజయం సాధించింది. ఈ రాజకీయాలతో పాటు చంద్రబాబు చేత కుటుంబ విషయాలను కూడా బాలకృష్ణ మాట్లాడించినట్లు తెలిసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

