అన్వేషించండి

Talliki Vandanam Date 2026: 'తల్లికి వందనం' నిధుల జమకు ముహూర్తం ఖరారు.. ఈ తేదీనే ఖాతాల్లోకి డబ్బులు!

Talliki Vandanam Date 2026: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధుల జమపై తేదీని ఖరారు చేసింది. జులై 10న తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తల్లికి వందనం నిధులు జులై 10న విడుదల, అందరు పిల్లలకు వర్తింపు.
  • తల్లి ఖాతాలో రూ.13,000, పాఠశాల అభివృద్ధికి రూ.2,000 జమ.
  • విద్యార్థులకు 75% హాజరు, తల్లుల e-KYC తప్పనిసరి నిబంధనలు.
  • జులై 10లోపు తల్లులు బ్యాంక్ e-KYC పూర్తిచేయాలని సూచన.

Talliki Vandanam Date 2026: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ ఏడాది నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జులై 10, 2026న తల్లికి వందనం డబ్బులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

కీలక మార్పులు 

గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ ఈసారి ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో ఒకే బిడ్డకు పరిమితమైన ఈ పథకాన్ని, ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా వారందరికీ వర్తింపజేయనున్నారు. ఇది చదువుకునే పిల్లలున్న ప్రతి కుటుంబానికి పెద్ద ఊరటనిచ్చే విషయమనే ప్రభుత్వం భావిస్తోంది. 

ఎంత నగదు జమ చేస్తారు? 

తల్లికి వందన పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.13,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. రూ.2 వేలు పాఠశాలల అభివృద్ధికి అందిస్తుంది.  

Also Read: మహిళలకు కూటమి ద్రోహం - రూ. 6,000 కోట్లు నొక్కేశారు.. గణాంకాలతో వైఎస్ జగన్ సంచలన ట్వీట్!

ఈ నిబంధనలు తప్పనిసరి

ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు కొన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. 

  • పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు కలిగి ఉండాలి.
  • లబ్ధిదారులైన తల్లుల బ్యాంక్ అకౌంట్లకు ఇ-కేవైసీ ప్రక్రియ పూర్తి అయ్యి ఉండాలి.
  • NPCI లింక్ కూడా ఉండాలి. 

Also Read: హైదరాబాద్ మెట్రో టేకోవర్ మిస్టరీ - ఎల్‌అండ్‌టీ నిష్క్రమణ వేళ ఎస్‌బీఐ క్యాప్స్ ఎంట్రీ.. సమస్య తీరినట్లా? మొదటికి వచ్చినట్లా?

వెంటనే e-KYC పూర్తి చేసుకోండి 

అర్హత ఉండి, ఇంకా బ్యాంక్ అకౌంట్ ఇ-కేవైసీ పూర్తి కాని వారు వెంటనే తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. జులై 10 లోపు ఇ-కేవైసీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి మాత్రమే నిధులు సకాలంలో జమ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు.  

Also Read : కడప స్టీల్ ప్లాంట్‌కు ఇంకెన్ని సార్లు శంకుస్థాపనలు? బ్రాహ్మణి నుండి JSW వరకు.. చంద్రబాబు తాజా ప్లాన్ ఏంటి?

Frequently Asked Questions

తల్లికి వందనం పథకం నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు?

తల్లికి వందనం పథకం నిధులను జులై 10, 2026న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాదికి సంబంధించిన నిధుల విడుదల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.

తల్లికి వందనం పథకంలో ఏ కీలక మార్పు చేశారు?

గతంలో ఒక బిడ్డకు మాత్రమే వర్తించిన ఈ పథకం ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా వారందరికీ వర్తింపజేస్తారు. ఇది చదువుకునే పిల్లలున్న కుటుంబాలకు పెద్ద ఊరట.

తల్లికి వందనం పథకం కింద ఎంత ఆర్థిక సహాయం అందుతుంది?

ఈ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో రూ.13,000 ఆర్థిక సహాయం జమ చేస్తారు. అదనంగా, రూ.2,000 పాఠశాలల అభివృద్ధికి అందిస్తారు.

తల్లికి వందనం పథకానికి అర్హత నిబంధనలు ఏమిటి?

విద్యార్థులకు కనీసం 75% హాజరు ఉండాలి. లబ్ధిదారులైన తల్లుల బ్యాంక్ ఖాతాలకు e-KYC మరియు NPCI లింక్ పూర్తి అయి ఉండాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget