By: ABP Desam | Updated at : 24 Apr 2023 07:08 PM (IST)
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేసిన సుప్రీంకోర్టు
Avinash Reddy in Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై నర్రెడ్డి సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. సునీత పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ గడువు జూన్ 30 వరకు పొడిగించింది ధర్మాసనం. అయితే తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
తెలంగాణ హైకోర్టు ఈనెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా.. దీనిపై సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినాష్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంపై సునీత సుప్రీంలో పిటిషన్ వేశారు. సునీత పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా పక్కనపెట్టిన సుప్రీంకోర్టు.. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ సస్పెండ్ చేసింది. హైకోర్టు అలాంటి ఆదేశాలు జారీ చేయరాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టులు ఇలాంటి ఉత్తర్వులు ఇస్తే కేసులో సీబీఐ దర్యాప్తుపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది. మరోవైపు సీబీఐ దర్యాప్తు గడువును సుప్రీంకోర్టు జూన్ నెలాఖరు వరకు పొడిగించింది.
ఏప్రిల్ 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఎంపీ తరపు లాయర్లు సీజేఐ ధర్మాసనానికి రిక్వెస్ట్ చేశారు. మంగళవారం హైకోర్టులో విచారణ ఉన్నందున, రేపటివరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వులు ఇవ్వాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, మీ రిక్వెస్ట్ మన్నిస్తే ఉత్తర్వులు పరస్పరం విరుద్ధంగా ఉంటాయని సీజేఐ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి కేసులను ప్రభావితం చేసేలా అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఉత్వర్వులు ఇవ్వకూడదని ధర్మాసనం పేర్కొంది.
4 Years Of YSRCP: రేపటితో వైఎస్ జగన్ పాలకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
AP Land Registrations: ఏపీలో నిలిచిన ల్యాండ్ రిజిస్ట్రేషన్లు! సర్వర్ డౌన్ అంటున్న స్టాఫ్ - జనాల పడిగాపులు!
AP News: సంచలనం - ఆస్తులను వెల్లడించిన ఏపీ సమాచార చీఫ్ కమిషనర్ మహబూబ్ బాషా
AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా
Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ
Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!
Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి
‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్