అన్వేషించండి

Seediri Appalaraju Arrest: మెడకు చుట్టుకున్న కుమారుడి హిట్ అండ్ రన్ కేసు - మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

Srikakulam YSRCP Leader Arrest: కుమారుడు చేసిన రోడ్డు ప్రమాద కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టు అయ్యారు. ఆయనను అరెస్టు చేసి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Seediri Appalaraju Son Hit and Run Case:  వైయస్సార్‌సీపీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు.  కాశీబుగ్గలోని జీఎమ్‌ఈ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో పోలీసు బలగాలు బుధవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నాయి. మాజీ మంత్రి అరెస్టు వార్త దావానలంలా వ్యాపించడంతో పెద్దఎత్తున వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకోవడంతో కాశీబుగ్గలో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కుమారుడు చేసిన ప్రమాదంలో సాక్ష్యాల్ని తారుమారు చేసిన అప్పలరాజు

ఇటీవల పలాస ప్రాంతంలో జరిగిన  హిట్ అండ్ రన్  కేసులో దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు.   సీదిరి అప్పలరాజు పెద్ద కుమారుడు ఆరవ్ వర్మ నడుపుతున్న ద్విచక్ర వాహనం ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే తన కుమారుడిని చట్టపరమైన చర్యల నుంచి తప్పించేందుకు, ఆరవ్ వర్మకు బదులుగా మరొక యువకుడు సిద్ధార్థ త్యాడిని నిందితుడిగా చిత్రీకరించి పోలీసుల ఎదుట లొంగిపోయేలా మాజీ మంత్రి వ్యూహం పన్నారు.     

సీసీ ఫుటేజీ బయటపడటంతో పోలీసుల ఎదుట సరెండర్ అయిన అప్పలరాజు కుమారుడు

పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు బట్టబయలు కావడంతో కథ అడ్డం తిరిగింది. కేసును పక్కదారి పట్టించేందుకు యత్నించిన అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మతో పాటు సిద్ధార్థ త్యాడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు. అదే సమయంలో నిందితుడిని తప్పించేందుకు, సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే బలమైన ఆధారాలు లభించడంతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూడా కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

పోలీసులపైనా చర్యలు       

ఈ కేసులో నిర్లక్ష్యం వహించి, నిందితులకు సహకరించారనే ఆరోపణలతో కాశీబుగ్గ పోలీసు యంత్రాంగంపైనా శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.  సీదిరి ఒత్తిళ్లకు తలొగ్గి ప్రాథమిక విచారణ సరిగా చేయకుండా కేసు ముగించేందుకు చూసిన కాశీబుగ్గ సీఐ వై. రామకృష్ణ, ఎస్‌ఐ ఎం. సునీల్‌లను ఉన్నతాధికారులు వేకెన్సీ రిజర్వ్  కు పంపుతూ వేటు వేశారు. పోలీసు శాఖలోనే ఉన్నతాధికారుల సీరియస్ యాక్షన్ తర్వాత మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్ధమైంది.    

అరెస్టు ఉపశమనం కోసం ప్రయత్నాలు విఫలం                       

అప్పలరాజు అరెస్ట్ సందర్భంగా కాశీబుగ్గలోని ఆయన నివాసం వద్ద పోలీసులకు, వైయస్సార్‌సీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు చర్య అని, కావాలనే తమ నాయకుడిని ఇరికించారని వైయస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  చట్టం ముందు అంతా సమానులేనని, నిరుపేద ప్రాణం పోవడానికి కారణమైన ప్రమాదాన్ని కప్పిపుచ్చేందుకు యత్నించినందుకే చట్టపరమైన చర్యలు తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు. అరెస్టు నుంచి ఉపశమనం కోసం సీదిరి అప్పలరాజు కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. 

 
  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Seediri Appalaraju Arrest: మెడకు చుట్టుకున్న కుమారుడి హిట్ అండ్ రన్ కేసు - మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
మెడకు చుట్టుకున్న కుమారుడి హిట్ అండ్ రన్ కేసు - మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం!
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం!
Tirumala Anjaneya Swamy Idol Stolen: తిరుమలలో కలకలం - మొదటి ఘాట్ రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం మాయం!
తిరుమలలో కలకలం - మొదటి ఘాట్ రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం మాయం!
Advertisement

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
Embed widget