Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో కరోనా కలకలం.... రాజాంలో ఇద్దరు ఉపాధ్యాయులు, 9 మంది విద్యార్థులకు పాజిటివ్
శ్రీకాకుళం జిల్లాలో కరోనా కలకలం రేపింది. రాజాంలో ఓ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 9 మంది విద్యార్థులకు కరోనా సోకింది. విద్యార్థులను ఐసోలేషన్ కు తరలించారు.
ఏపీలోని పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. ఇటీవల మచిలీపట్నంలోని ఓ పాఠశాలలో విద్యార్థులు తీవ్ర జ్వరాలతో బాధపడ్డారు. వారికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా నెటిగివ్ వచ్చింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. రాజాం డీఏవీ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. గురువారం ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో మరో 9 మంది విద్యార్థులకు కరోనా నిర్థారణ అయింది. విద్యార్థులకు కరోనా సోకడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకిన విద్యార్థులను వైద్యులు ఐసోలేషన్ కు తరలించారు.
Also Read: దేవుడా..! ఒమిక్రాన్‌ను జయించిన వైద్యుడికి మళ్లీ కరోనా పాజిటివ్
దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా
ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ద్వారా ఈ స్కూల్ టీచర్ కు కరోనా సోకినట్లు తెలుస్తోంది. జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయగా ఉపాధ్యాయుడికి పాజిటివ్ అని తేలింది. ఆ ఉపాధ్యాయుడి ద్వారా మరో ఇద్దరికి కరోనా సోకినట్టు వైద్యులు తెలిపారు. వారి నుంచి 9 మంది విద్యార్థులకు కరోనా సోకింది. 9 మంది విద్యార్థులకు కరోనా సోకడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల యజమాన్యం జాగ్రత్తలు తీసుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కరోనా సోకిన విద్యార్థులందరినీ అధికారులు ఐసోలేషన్ కు తరలించారు.
Also Read: వీకెండ్ ఆహా.. ఆ ఊహ ఎంత బాగుందో! ఇక వారంలో 2.5 రోజులు సెలవు!
ఒమిక్రాన్ కలకలం
ఇటీవల జిల్లాలో ఒమిక్రాన్ కలవరం రేగింది. సంత బొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అయితే బాధితుడు ఇటీవలే బ్రెజిల్ నుంచి ఏపీకి వచ్చాడు. దీంతో జిల్లా అధికారులు అలర్ట్ అయి తదుపరి టెస్టులకు ఇతని నమూనాలు పంపారు. అతడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఒమిక్రాన్ అనుమానంతో జీనోమ్ సీక్వెన్ కోసం శాంపిల్స్ హైదరాబాద్ కు పంపారు. ఆ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. జీనోమ్ సీక్వెన్సింగ్ అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఒమిక్రాన్ సోకినట్లు వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని అధికారులు తెలిపారు.
Also Read:తగ్గిన కరోనా విజృంభణ.. 554 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి