News
News
X

GSLV F10 Failed: ఇస్రో జీఎల్ఎల్‌వీ-ఎఫ్10 ప్రయోగం విఫలం, గతి తప్పిన రాకెట్.. ఛైర్మన్ శివన్ ప్రకటన

ఇస్రో శుక్రవారం తెల్లవారుజామున చేపట్టిన రాకెట్ ప్రయోగం విఫలం అయింది. మూడో దశలో రాకెట్ గతి తప్పినట్లుగా ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.

FOLLOW US: 
Share:

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం తెల్లవారు జామున చేపట్టిన జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-ఎఫ్10 (జీఎస్ఎల్‌వీ-ఎఫ్10) ప్రయోగం విఫలమైంది. క్రయోజనిక్ దశలో జీఎస్ఎల్‌వీ-ఎఫ్10 రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రాకెట్ గతి తప్పింది. నిర్దేశించిన మార్గం కాకుండా మరో మార్గంలోకి జీఎస్‌ఎల్వీ రాకెట్ దూసుకుపోయినట్లుగా ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు. 

నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ లాంచ్ ప్యాడ్ నుంచి గురువారం ఉదయం 5.43 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10ని శాస్త్రవేత్తలు ప్రయోగించారు. బుధవారం ఉదయం 3.43 గంటలకు ఈ రాకెట్ కౌంట్‌డౌన్‌ ప్రారంభం కాగా.. 26 గంటల పాటు కౌంట్‌డౌన్‌ సాగి గురువారం ఉదయం 5.43 గంటలకు పొగలు కక్కుతూ నింగిలోకి వెళ్లింది. 

నిజానికి ఈ రాకెట్‌ ప్రయోగం గతేడాది మార్చిలోనే నిర్వహించాల్సి ఉంది. కానీ, కరోనా మహమ్మారి వల్ల ప్రయోగం వాయిదా పడుతూ వచ్చింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్‌ ద్వారా జీఐశాట్‌-1 ఉప గ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో (జియో సింక్రనస్ ఆర్బిట్) ప్రవేశపెట్టాల్సి ఉంది. దేశ రక్షణ అవసరాలు, ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టగల శక్తి ఈ ఉపగ్రహానికి ఉంది. వాటికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగం విజయవంతం అయి ఉంటే జీఐశాట్-1 ఉపగ్రహం రోజూ కొన్ని చిత్రాలను తీసి ఇస్రోకు పంపి ఉండేది. దీనివల్ల భవిష్యత్తులో జరిగే ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టవచ్చు. భూపరిశీలనకు సంబంధించిన శాటిలైట్లలో దీన్ని కీలకంగా భావించారు. 

రాకెట్ గమనం సాగింది ఇలా..
దీనికి సంబంధించి ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆ వీడియోను ట్విటర్‌లో ఉంచారు. మొదటి, రెండో దశలు సాధారణంగా అనుకున్న ప్రకారమే సాగగా.. మూడో దశలో సమస్య తలెత్తింది. నింగిలోకి దూసుకెళ్లిన మూడు నిమిషాలకు కూడా రాకెట్ పనీతీరు సవ్యంగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. రాకెట్ ముందు భాగంలో ఉండే మొనదేలిన భాగాలు వేరుకావడం కూడా బాగానే జరిగింది. క్రయోజెనిక్ దశలో రాకెట్ గమనం మారింది. దీంతో చర్చల అనంతరం ప్రయోగం విఫలమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.

తొలిసారిగా 4 మీటర్ల వ్యాసంతో..

తాజా జీఎస్ఎల్‌వీ రాకెట్‌లో 4 మీటర్ల వ్యాసం కలిగిన మొనదేలిన ముందు భాగాన్ని మొదటిసారిగా అమర్చారు. ఇప్పటిదాకా ప్రయోగించిన జీఎస్ఎల్‌వీ రాకెట్లలో ఇది పద్నాలుగో రాకెట్ అని ఇస్రో తెలిపింది. ఈ జీఎస్ఎల్‌వీ రాకెట్ ఎత్తు 52 మీటర్లు.

14 జీఎస్‌ఎల్వీ రాకెట్ ప్రయోగాల్లో 8 సక్సెస్

జీఎస్‌ఎల్వీ మార్క్ 1 ప్రయోగాల్లో 29శాతం సక్సెస్ రేటు ఉండగా.. జీఎస్‌ఎల్వీ మార్క్ 2కు 86 శాతం సక్సెస్ రేటు ఉంది. ఇప్పటిదాకా ఇస్రో 14 జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేపట్టింది. వాటిలో 8 సక్రమంగా నిర్దేశించిన కక్షలోకి ఉపగ్రహాలను చేర్చి విజయవంతం అయ్యాయి. మిగతా నాలుగు ప్రయోగాల్లో రెండు పాక్షికమైన విఫలం చెందగా.. మరో రెండు పూర్తిగా ఫెయిలయ్యాయి.

Published at : 12 Aug 2021 06:23 AM (IST) Tags: ISRO Sriharikota GSLV F10 satish dhawan space centre gslv f10 launch fail isro launch

సంబంధిత కథనాలు

Lokesh Padayatra :  లోకేష్ పాదయాత్ర చేసినా సీఎం అయ్యేది చంద్రబాబే - మరి ఇచ్చే హామీలకు  విలువ ఎంత?

Lokesh Padayatra : లోకేష్ పాదయాత్ర చేసినా సీఎం అయ్యేది చంద్రబాబే - మరి ఇచ్చే హామీలకు విలువ ఎంత?

APPSC Mains Exam Schedule: 'గ్రూప్-1' మెయిన్స్ షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

APPSC Mains Exam Schedule: 'గ్రూప్-1' మెయిన్స్ షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

AP Localbody Elections: ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు, నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ

AP Localbody Elections: ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు, నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ

Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్

Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్

టాప్ స్టోరీస్

IND vs NZ 1st T20: సుందర్ ఒంటరి పోరాటం సరిపోలేదు - మొదటి వన్డేలో టీమిండియా భారీ ఓటమి!

IND vs NZ 1st T20: సుందర్ ఒంటరి పోరాటం సరిపోలేదు - మొదటి వన్డేలో టీమిండియా భారీ ఓటమి!

Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !

Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?

IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!

IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!