అన్వేషించండి

AP Police Holiday: ఏపీ పోలీసులకు శుభవార్త.. ఈ 2 రోజులు వారికి స్పెషల్ హాలిడే మంజూరు చేసిన ప్రభుత్వం

AP Police Leaves | ఏపీలో అన్ని ర్యాంకుల పోలీసులకు వారి పుట్టినరోజు, మ్యారేజ్ డే సెలవు మంజూరు చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ సిబ్బందికి మానసిక ఉల్లాసం కల్పించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వారి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిచ్చేలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి ఏటా పోలీసు సిబ్బంది తమ పుట్టినరోజు (Birthday), వివాహ వార్షికోత్సవం (Wedding Anniversary) రోజున ప్రత్యేక సెలవును పొందే అవకాశం కల్పించారు. నిరంతరం విధుల్లో ఉంటూ కుటుంబానికి దూరంగా గడిపే పోలీసులకు ఇది మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ఉత్తర్వులు కేవలం కానిస్టేబుల్ స్థాయి వారికే కాకుండా, శాఖలోని అన్ని ర్యాంకుల పోలీసులకు వర్తిస్తాయని రాష్ట్ర డీజీపీ (DGP) స్పష్టం చేశారు. ఆయా జిల్లాల, యూనిట్ అధికారులు ఈ సెలవులను తప్పనిసరిగా మంజూరు చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఒత్తిడితో కూడిన విధులను నిర్వహించే సిబ్బంది, తమ జీవితంలోని ముఖ్యమైన రోజులను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుకోవాలనే ఉద్దేశంతో ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.


AP Police Holiday: ఏపీ పోలీసులకు శుభవార్త.. ఈ 2 రోజులు వారికి స్పెషల్ హాలిడే మంజూరు చేసిన ప్రభుత్వం

పోలీసుల సంక్షేమంపై కూటమి సర్కార్ ఫోకస్
సాధారణంగా పోలీసు విధుల్లో సెలవులు దొరకడం చాలా కష్టమైన పని. పండుగలు, బందోబస్తులు, అత్యవసర సమయాల్లో వారు 24 గంటలు అందుబాటులో ఉండాల్సి వస్తుంది. గతంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఇటువంటి విధానాన్ని ప్రవేశపెట్టగా, ఇప్పుడు ఏపీలో కూడా అమలు చేయడం వల్ల పోలీసు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల వారిపై ఉండే పని ఒత్తిడి కొంతమేర తగ్గి, విధుల్లో మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
AP DWCRA: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget