అన్వేషించండి

Bagmati Express Accident: భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంతో పలు రైళ్లు రద్దు చేసిన ద.మ రైల్వే

Mysuru – Darbhanga Bagmati Express| తమిళనాడులోని చెన్నై శివారులో గూడ్స్ రైలును భాగమతి ఎక్స్ ప్రెస్ శుక్రవారం రాత్రి ఢీకొట్టింది. లైన్ క్లియర్ కాని కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లు రద్దు చేసింది.

Bagmati Express Collided With Freight Train In Chennai:  చెన్నై: గూడ్స్ రైలును భాగమతి ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12578) (Bagmati Express) రైలు ఢీకొట్టిన ఘటన వల్ల పలు రైళ్లు దారి మళ్లించగా, పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) రద్దు చేసినట్లు ప్రకటించింది.  డా ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు,, తిరుపతి- పుదుచ్చేరి మెము, డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- తిరుపతి మెము, అరక్కోణం- పుదుచ్చేరి మెము, విజయవాడ-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ పినాకిని ఎక్స్‌ప్రెస్‌, సూళ్లూరుపేట-నెల్లూరు మెము ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి-అరక్కోణం మెము, తిరుపతి- డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ మెము, అరక్కోణం- తిరుపతి మెము ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు చేసిట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రమాదంతో చెన్నై సెంట్రల్ నుంచి ఢిల్లీకి వెళ్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌, నెల్లూరు - చెన్నై మధ్య రైళ్ల రాకపోకలు సైతం నిలిచిపోయాయి.

సికింద్రాబాద్ - దనపూర్ ఎక్స్ ప్రెస్ రైలు ఉదయం 10.55 గంటలకు బయలుదేరనుంది. షెడ్యూల్ ప్రకారం 9.25 గంటలకు బయలుదేరాల్సి ఉన్న ట్రెయిన్ నెం 12791 ఆలస్యంగా బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

విజయవాడ డివిజన్ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు
గూడురు: 08624 250795
ఒంగోలు: 08592 280306
విజయవాడ: 0866 2571244
నెల్లూరు: 0861 2345863
ఏలూరు: 7569305268
తాడేపల్లిగూడెం: 8818226162

అసలేం జరిగింది..

తమిళనాడులోని చెన్నై శివారులో శుక్రవారం రాత్రి రెండు రైళ్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు సమీపంలోని కావరిపెట్టై వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును మైసూర్ - దర్భంగా మధ్య నడిచే (Bagumathi Express) భాగమతి ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12578) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొన్ని బోగీలు ధ్వంసం కాగా, ఎక్స్ ప్రెస్ రైలులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి.

మైసూర్ - దర్బంగా భాగమతి ఎక్స్ ప్రెస్ రైలుకు శుక్రవారం రాత్రి 8:27 గంటల సమయంలో పొన్నేరి స్టేషన్ దాటిన తర్వాత కావరైపెట్టై స్టేషన్‌లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భాగమతి రైలు రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశిస్తుండగా భారీ కుదుపు ఏర్పడినట్లు రైలు సిబ్బంది గుర్తించారు. మెయిన్ లైన్‌లో వెళ్లాల్సిన భాగమతి రైలు, లూప్ లైన్‌లోకి వెళ్లడంతో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 భోగీల్లో మంటలు వచ్చాయి. కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. రైల్వే అధికారులు వెంటనే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చెన్నై రైల్వే డివిజన్ అధికారులు 04425354151, 04424354995 నెంబర్లలో సంప్రదించాలని ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Embed widget