Trains Cancelled: మిగ్ జాం ఎఫెక్ట్ - ఈ రైళ్లు రద్దు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Trains Cancelled: మిగ్ జాం తుపాను దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసినట్లు ద.మ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటిన దారి మళ్లించినట్లు తెలిపింది.
Trains Cancelled Due to Michaung Cyclone: మిగ్ జాం తుపాను ప్రభావంతో ఏపీ, తెలంగాణ సహా చెన్నైలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాల్లో వాతావరణ శాఖ అధికారులు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే శాఖ పలు రైళ్లు రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించినట్లు ద.మ రైల్వే సీపీఆర్వో రాకేష్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లను రద్దు చేయగా, ఇతర రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయడం సహా మరికొన్నింటిని దారి మళ్లించినట్లు చెప్పారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
రద్దైన రైళ్లు ఇవే
- ఈ నెల 6న గుంటూరు - రేపల్లె (07784), రేపల్లె – గుంటూరు (07785), గుంటూరు - రేపల్లె (07786), రేపల్లె – తెనాలి (07873), తెనాలి - రేపల్లె (07874), రేపల్లె - తెనాలి (07875), తెనాలి - రేపల్లె (07876), రేపల్లె - గుంటూరు (07787) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది.
- అలాగే మంగళవారం నడవాల్సిన తెనాలి – రేపల్లె (07888), గుంటూరు - తెనాలి (07887) రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. అలాగే, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – ముంబయి ఎల్‌టీటీ (12164) రైలును చెన్నై సెంట్రల్ – తిరుత్తని మధ్య రద్దు చేసినట్లు చెప్పింది.
- కాచిగూడ - రేపల్లె (17625) రైలును గుంటూరు - రేపల్లె మధ్య రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. బుధవారం నడవాల్సిన రేపల్లె – మార్కాపురం (07889) రైలును రేపల్లె - గుంటూరు మధ్య, సికింద్రాబాద్ – రేపల్లె (17645) రైలును గుంటూరు – రేపల్లె, రేపల్లె సికింద్రాబాద్ (17626) రైలు రేపల్లె -గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు చెప్పారు. ఇక చెంగల్‌పట్టు – కాచిగూడ (17651) రైలును దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. కంచీపురం - మేల్పాక్కం క్యాబిన్ మీదుగా మళ్లించినట్లు తెలిపింది. తాంబరం, చెన్నై ఎగ్మోర్, అరక్కొణం స్టేషన్లలో ఆగదని వివరించారు.
- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - న్యూ జల్పైగురి (22611) రైలును రద్దు చేశారు. తిరుపతి - పూర్ణ (07610), తిరుపతి - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (16058) రైలును రద్దు చేశారు.
- తుపాను దృష్ట్యా ఇంతకు ముందు రద్దు చేసిన సికింద్రాబాద్ - గూడూరు (12710), తిరుపతి - లింగంపల్లి (12733), సికింద్రాబాద్ - తిరుపతి (12764), కాకినాడ టౌన్ - SMVT బెంగళూరు (17210) రైళ్లను పునరుద్ధరించినట్లు ద.మ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
Restoration of Trains#CycloneMichuang #TrainsUpdate #BulletinNo.24 & 25 pic.twitter.com/1HRVL2voEZ
— South Central Railway (@SCRailwayIndia) December 5, 2023
Cancellation / Short Termination of Trains#CycloneMichuang #TrainsUpdate #BulletinNo.22 pic.twitter.com/itMnYM0Hgy
— South Central Railway (@SCRailwayIndia) December 5, 2023
Cancellation / Partial Cancellation / Diversion of Trains#CycloneMichuang #TrainsUpdate #BulletinNo.20 & 21 pic.twitter.com/wLctTXiSS8
— South Central Railway (@SCRailwayIndia) December 5, 2023
Diversion/Partial Cancellation of Trains#CycloneMichuang #TrainsUpdate #BulletinNo.18 & 19 pic.twitter.com/KC61VzvE9B
— South Central Railway (@SCRailwayIndia) December 5, 2023
Cancellation/Short Termination of Trains#CycloneMichaung #TrainsUpdate #BulletinNo.17 pic.twitter.com/rs4zknRWQs
— South Central Railway (@SCRailwayIndia) December 5, 2023
Also Read: Michaung Cyclone: తీరం దాటిన మిగ్ జాం - 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు