Somu Veerraju : కోనసీమలో చిచ్చు పెట్టింది ప్రభుత్వమే - బుద్దిలేని నాయకత్వం పరిపాలిస్తోందన్న సోము వీర్రాజు
కోనసీమలో చిచ్చు పెట్టింది ప్రభుత్వమేనని సోము వీర్రాజు ఆరోపించారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పేరు మార్పు ఉద్యమంలో బీజేపీ పాల్గొనదని స్పష్టం చేశారు.
Somu Veerraju : అమలాపురం ( Amalapuram ) ఉద్రిక్తతలకు కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని ఏపీ బీజేపీ ( AP BJP ) అధ్యక్షుడు సోము వీర్రాజు ( Somu Verraju ) ఆరోపించారు. కోనసీమలో ( Konaseema ) చిచ్చుని రాష్ట్ర ప్రభుత్వమే తెరలేపిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇల్లు దహనం చేయడాన్ని ఖండించారు. యువత ఆగ్రహావేశాలకు లోను కావద్దన్నారు. ఇటువంటి ఉద్యమాల్లో బీజేపీ ( BJP ) ఎటువంటి పాత్ర పోషించడం లేదని స్పష్టం చేశారు.ఆ ఉద్యమాలతో బీజేపీకి సంబంధం లేదన్నారు. అంబేడ్కర్ ( Ambedkar ) పేరును వివాదంలోకి లాగింది వైసీపీ ప్రభుత్వమేనని, కోనసీమలో లేని వివాదాన్ని సృష్టించి ఉద్రిక్త పరిస్థితులకు కారణమైందని ఆరోపించారు.
అమలాపురం విధ్వంసం కేసులో కీలక పురోగతి- కారకులైన 46 మంది అరెస్టు- 72 మంది కోసం గాలింపు
దేశంలో అంబేద్కర్ పంచ తీర్ధాన్ని ( Ambedkar Panchateerdh ) మోదీ ఏర్పాటు చేశారన్నారు. ఆయన దేశానికి ఎనలేని సేవలు చేశారని సోము వీర్రాజు పేర్కొన్నారు. అంబేద్కర్ దేశ రక్షకుడన్నారు. 125 అడుగుల విగ్రహాన్ని ( Ambedkar Statue ) పెడతామని గత ప్రభుత్వం చెప్పిందని.. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వ డబ్బులతో చర్చ్‌లు కడుతున్నారన్నారు. టిప్పు సుల్తాన్ ( Tippu Sultan ) విగ్రహాలను పెడితే.. ప్రజల్లోకి ఎటువంటి సందేశాలు వెళ్తాయని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలభిస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు.
ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్
కోనసీమ జిల్లా ( Konaseema District ) పేరు మార్చాలన్న ఉద్యమంలో బీజేపీ శ్రేణులు పాల్గొనవని సోము వీర్రాజు తెలిపారు. అమలాపురంలో ప్రశాంత వాతావరణం నెలకొనడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు వల్లే ఇలాంటి ఉద్రిక్తలు ఏర్పడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం చేసినా మమ్మల్ని భయపెట్టలేరు, ప్రభుత్వం వెనక్కి తగ్గదు: మంత్రి విశ్వరూప్ రియాక్షన్
కోనసీమ పేరును ప్రభుత్వం మార్చిందని.. మళ్లీ పాత పేరే ఉండాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. వాటిలో పాల్గొనేది లేదని సోము వీర్రాజు చెబుతున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న పేరుకే ఆయన ఆమోదం తెలిపారు. ఇతర బీజేపీ నేతలు కూడా ఈ అంశంపై ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. గతంలో న్ని రాజకీయ పార్టీల అంగీకారంతోనే పేరు మార్చామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం ఎవరితోనూ సంప్రదింపులు చేయలేదని ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.