Amaravati Pipes Fire: అమరావతిలో మోదీ సభకు దూరంగా పైపులకు నిప్పు - కుట్ర కోణంలో పోలీసుల విచారణ
Pipes Fire: ప్రధాని మోదీ సభకు మూడు కిలోమీటర్ల దూరంలో తుళ్లూరు వద్ద పైపులకు కొంత మంది నిప్పు పెట్టారు. ఎవరు ఈ పని చేశారన్నదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Amaravati Fire Accident: అమరావతిలో ప్రధాని మోదీ సభకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే సభకు దూరంగా .. మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో అగ్నిప్రమాదం జరిగింది. అమరావతి నిర్మాణం కోసం తీసుకు వచ్చిన పైపులకు దండగులు నిప్పు పెట్టారు.
ప్రధాని మోదీ ఓ వైపు అమరావతి ఓ శక్తి అని ప్రసంగిస్తున్న సమయంలో దూరంగా పెద్ద ఎత్తున గాల్లోకి పొగ వెళ్తూ కనిపించింది. పొగను చూసి ఫైర్ అధికారులు హుటాహుటిన వెళ్లి వాటిని ఆర్పేశారు.
తుళ్ళూరులో అగ్నిప్రమాదం.. అధికారులు అలర్ట్
— NageshT (@NageshT93116498) May 2, 2025
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదం అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టారు ఎల్అండ్ కంపెనీకి చెందిన పైపులు కాలి బూడిదయ్యాయి. ప్రధాని మోదీ సభకు 5కి.మీ దూరంలో అగ్ని ప్రమాదం తో అధికారులు అప్రమత్తం అయ్యారు pic.twitter.com/6lhg7HSMql
ఎండలకు కాలిపోయేందుకు అవేమీ మండే గుణం ఉన్న పైపులు కాదని అధికారులు చెబుతున్నారు. గడ్డి పరకలు అయితే ఎండకు కాలిపోతాయేమో కానీ పైపులు ఎలా కాలుతాయన్న ప్రశ్న వస్తుంది. అదీ కూడా సభ జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున పొగలు వచ్చేలా కాల్చారని..ఇందులో ఖచ్చితంగా కుట్ర కోణం ఉందని అనుమానిస్తున్నారు. పైపులపై పెట్రోల్ పోసి కాల్చేశారని సులువుగానే అర్థమైపోతుందని అధికార వర్గాలు అంటున్నాయి.
అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) May 2, 2025
జరుగుతున్న వేదికకు సమీపంలోభారీ అగ్ని ప్రమాదం
తాళ్లాయ పాలెం సమీపంలో ప్లాస్టిక్ పైపులు తగలబడి భారీగా ఎగసిపడుతున్న మంటలు
పరిసరాల్లో దట్టమైన పొగ
ఎవరైనా తగలబెట్టారా, వేసవికాలం ఎండల
నేపథ్యంలో తగలబడ్డాయా అన్న కోణంలో పోలీసులు విచారణ... pic.twitter.com/041f9reWhz
నిఘా లేని చోట.. అమరావతి పైపులు ఉన్న చోట చూసి నిప్పు పెట్టిపోయారు. గతంలో అరటితోటలకు నిప్పు పెట్టేవారు. ఇప్పుడు నిప్పు పెట్టడానికి అరటి తోటలు లేవని.. అమరావతి నిర్మాణం కోసం తీసుకు వచ్చిన పైపులకు నిప్పు పెట్టారని అమరావతి రైతులు మండి పడుతున్నారు.





















