అన్వేషించండి

Narayana Swamy no arrest: మాజీ మంత్రి నారాయణ స్వామికి తప్పిన అరెస్ట్ ముప్పు - 6 గంటల పాటు ప్రశ్నించిన సిట్

AP liquor scam: ఏపీ లిక్కర్ స్కాంలో నారాయణ స్వామికి సిట్ అధికారులు ఆరు గంటలు ప్రశ్నించారు. అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ సిట్ అధికారులు స్టేట్‌మెంట్ తీసుకుని వెళ్లిపోయారు.

SIT officials questioned Narayana Swamy for six hours:  మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామికి రిలీఫ్ లభించింది. సిట్ అధికారులు ఆయనను విచారణ తరవాత అరెస్టు చేస్తారని జరిగిన ప్రచారారానికి తెరపడింది. నారాయణ స్వామి నివాసంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, ఇతర అంశాలు, లిక్కర్ స్కాంకు సంబంధించి పలు అంశాలపై విచారణ నిర్వహించారు. కొన్ని డాక్యుమెంట్లను అడిగి తీసుకుని  నారాయణ స్వామి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విచారణ అనంతరం  సిట్ అధికారులు విజయవాడకు వెళ్లిపోయారు.        

అనారోగ్యం పేరుతో విచారణకు రాకపోవడంతో ఇంటికే వెళ్లిన సిట్ 

గతంలో పలుమార్లు విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన హాజరు కాలేదు. తనకు ఆరోగ్యం బాగోలేదని చెబుతూ వస్తున్నారు. నారాయణ స్వామి విచారణకు హాజరు కాకపోవడంతో నేరుగా ఆయన నివాసంలోనే విచారణ చేపట్టిన సిట్.. కీలక విషయాలను రాబట్టింది. విచారణకు సహకరించలేదు కాబట్టి అరెస్టు చేస్తారని అనుకున్నారు. కానీ సిట్ అధికారులు అడిగిన అన్ని వివరాలను ఆయన ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సిట్ విచారణకు పూర్తిగా సహకారం అందించానని..సిట్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని విచారణ తర్వాత మీడియాకు తెలిపారు. భవిష్యత్ లోనూ పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.        

గత ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రి - కానీ నిమిత్తమాత్రంగానే అధికారాలు 

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడు అయిన నారాయణ స్వామికి గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాను జగన్ ఇచ్చారు. అలాగే ఎక్సైజ్ శాఖను ఇచ్చారు. అయితే పేరుకు ఆయన ఎక్సైజ్ శాఖా మంత్రే కానీ నిర్ణయాల్లో ఎప్పుడూ పెద్దగా ఆయన ప్రమేయం ఉండేది కాదని అధికారవర్గాలు చెబుతున్నాయి. లిక్కర్ పాలసీపై ఇతరులు చర్చించారు కానీ ఆ చర్చల్లో ఎక్సైజ్ మంత్రిని ఎప్పుడూ  భాగస్వామ్యం చేయలేదని తెలుస్తోంది. అయితే ఎక్సైజ్ మంత్రిగా కొన్నినిర్ణయాలకు ఆయన సంతకాలు తప్పని సరి. ఈ క్రమంలో ఆయన తసుకున్న నిర్ణయాలు.. లిక్కర్ అంశంపై.. ప్రభుత్వంలో  ఉన్నప్పుడు జరిగిన అంశాలపై పూర్తి స్థాయిలో  సిట్ అధికారులు వివరాలు అడిగినట్లుగా తెలుస్తోంది.  

తన దృష్టిలో ఉన్నవన్నీ చెప్పినట్లుగా ప్రచారం                            

లిక్కర్ స్కామ్ ఇప్పటి వరకూ నారాయణ స్వామిని నిందితుడిగా చేర్చలేదు. ఏ విధంగానూ ఆయనకు డబ్బులు అందాయన్న ఆధారాలు లభించకపోవడంతో ఆయనను సిట్ అధికారులు సాక్షిగానే పరిగణిస్తున్నారు. అరెస్టు చేస్తారన్న భయం కారణంగా ఆయన విచారణకు హాజరవడం మానేశారు.అందుకే సిట్ అధికారులు నేరుగా ఇంటికి వచ్చారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ పాలసీ విషయంలో.. మద్యం ఆర్డర్స్ విషయంలో తనకు తెలిసిన విషయాన్నీ పూసగుచ్చినట్లుగా చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. నారాయణ స్వామి స్టేట్ మెంట్ విశ్లేషించి సిట్ తదుపరి చర్యలు తీసుకోనున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Gym Trainer Case: విజయవాడలో దారుణం - మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం- జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ ఘాతుకం!
విజయవాడలో దారుణం - మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం- జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ ఘాతుకం!
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం 
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం 
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
MCGS MSME Scheme: మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్.. పూచీకత్తు లేకుండా రూ.100 కోట్ల వరకు లోన్.. అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలంటే?
మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్.. పూచీకత్తు లేకుండా రూ.100 కోట్ల వరకు లోన్.

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget