అన్వేషించండి

YS Sharmila: బీజేపీపై దండయాత్ర చేయాల్సింది పోయి వంగి వంగి దండాలు - జగన్ పై షర్మిల ఘాటు విమర్శలు

YS Sharmila: వైఎస్ జగన్ పై షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు.

Sharmila challenge to Jagan :  వైఎస్సార్ చనిపోయాక జగన్ ఆక్రమాస్తుల కేసు FIRలో వైఎస్సార్ పేరు చేర్చడం కాంగ్రెస్ పార్టీ కావాలని చేసిన తప్పు కాదని షర్మిల స్పష్టం చేశారు.   అది తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసిన పొరపాటు కాదన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం ములగపుడి గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు.  వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్‌లో పెట్టిన విషయం తమకు తెలియదని సోనియా గాంధీ ఈ విషయం తనతో స్వయంగా చెప్పిందన్నారు. వైఎస్సార్ కుటుంభం అంటే గాంధీ కుటుంభానికి ఇప్పటికీ మమకారం ఉందని..వైఎస్సార్ అంటే సోనియాకి గౌరవం అని పేర్కొన్నారు. నా మనసు నమ్మింది కాబట్టే..కాంగ్రెస్ లో చేరానని స్పష్టం చేశారు. రాష్ట్రానికి, వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ఏ మాత్రం మోసం చేయలేదని  స్పష్టం చేశారు. 

వైఎస్ ఆశయ సాధనకు ప్రాజెక్టులు పూర్తి చేయాలిగా జగనన్నా !?

వైఎస్సార్ ఆశయాలు సాధన అంటే జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేయాలి కదా ?, ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి కదా ?, ఎందుకు జలయజ్ఞం ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేశారు? అని ప్రశ్నించారు. జగన్ అన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగా అనిపించేలా చేశాడన్నారు. గిట్టుబాటు ధర లేదు, పంట నష్ట పరిహారం లేదు, సబ్సిడీ పథకాలు పూర్తిగా ఎత్తివేశారని వ్యాఖ్యానించారు. రైతులకు ప్రయోజనం పక్కన పెట్టి వాళ్ళ భూములే కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత కూలి పనులకు పోతున్నారన్నారు.

బీజేపీపై దండయాత్ర చేయల్సింది పోయి వంగి వంగి దండాలు పెడుతున్నారు..! 

రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవని.. ఇక్కడ 25 మంది ఎంపీలు ఉన్నారు..గాడిదలు కాస్తున్నారా? అని విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే.. ఒక్క రోజు కూడా ఆందోళన చేసింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ లు రాజీనామా చేసి ఉంటే..హోదా వచ్చి ఉండేది కదా అని నిలదీశారు. బీజేపీ మీద దండయాత్ర చేయాల్సింది పోయి.. వంగి వంగి దండాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

ఉద్యోగాల భర్తీపై ఎన్నికలకు ముందు నిద్ర లేచని కుంభకర్ణుడు జగన్ 

జగన్ మోహన్ రెడ్డి ఒక కుంభ కర్ణుడని ఎద్దేవ చేశారు. ఎన్నికల ముందు ఉద్యోగాలు అని నిద్ర లేచాడని.. 25 వేల DSC ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 6 వేల పోస్టులు వేశారని మండిపడ్డారు. మద్యపాన నిషేదం చేయకపోతే ఓటు అడగను అన్నాడని..నిషేదం పక్కన పెడితే ..సర్కారే మద్యం అమ్ముతుందన్నారు. జగన్ వాగ్ధానాలు అన్ని మద్యం షాపుల్లో బ్రాండ్ పేర్లతో ఉన్నాయని పేర్కొన్నారు. కల్తీ మద్యం అమ్ముతూ జనాలను చంపుతున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఒక్కటి అమలు కాలేదని..రాష్ట్ర విభజన హామీలు, రాజధాని నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని  స్పష్టం చేశారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
World Test Championship points table: అడిలైడ్ ఓటమి, భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం- చాలా సమీకరణాలు కలిస్తేనే తుదిపోరుకు ఛాన్స్
అడిలైడ్ ఓటమి, భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం- చాలా సమీకరణాలు కలిస్తేనే తుదిపోరుకు ఛాన్స్
Farmers Resume Delhi Chalo March: రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - తరలివస్తున్న అన్నదాతలు
Farmers Resume Delhi Chalo March: రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - తరలివస్తున్న అన్నదాతలు
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
World Test Championship points table: అడిలైడ్ ఓటమి, భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం- చాలా సమీకరణాలు కలిస్తేనే తుదిపోరుకు ఛాన్స్
అడిలైడ్ ఓటమి, భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం- చాలా సమీకరణాలు కలిస్తేనే తుదిపోరుకు ఛాన్స్
Farmers Resume Delhi Chalo March: రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - తరలివస్తున్న అన్నదాతలు
Farmers Resume Delhi Chalo March: రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - తరలివస్తున్న అన్నదాతలు
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Gajwel Hit and Run Case: గజ్వేల్ లో విషాదం - హిట్ అండ్ రన్ ఘటనలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు మృతి
గజ్వేల్ లో విషాదం - హిట్ అండ్ రన్ ఘటనలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు మృతి
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Embed widget