MLA Koneti Aidmulam Case : సత్యవేడు ఎమ్మెల్యేతో రాజీపడిన ఆరోపణలు చేసిన మహిళ - కేసు క్లోజ్ - ఇలా అయిందేంటి ?
Andhra Pradesh : సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసు క్లోజ్ అయిపోయింది. బాధితురాలు అయిన మహిళ రాజీకీ వచ్చినట్లుగా హైకోర్టుకు తెలిపారు.
Satyavedu MLA Koneti Adimulam Sexual harassment case closed : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు తేలిపోయింది. తన కేసు కొట్టి వేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ విచారణలో బాధితురాలు అయిన వరలక్ష్మి కూడా ఇంప్లీడ్ అయి తాము రాజీకీ వచ్చామని కేసు అవసరం లేదని చెప్పారు. దీంతో హైకోర్టు ఈ కేసును కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది.
లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళ ఆరోపణతో సంచలనం
రెండు వారాల కిందట సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధిస్తున్నారని అదే నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా టీడీపీ నేత హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు. అ సమయంలో కోనేటి ఆదిమూలంతో తాను ఉన్న ప్రైవేటు వీడియోలను కూడా మీడియాకు రిలీజ్ చేశారు. కోనేటి ఆదిమూలంపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీని.. ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే టీడీపీ ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బాధితురాలు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి నిరాకరించినప్పటికీ పోలీసులు మీడియా కథనాల ఆధారంగా కేసులు పెట్టారు. అయితే వాంగ్మూలం ఇవ్వడానికి.. వైద్య పరీక్షలకు వచ్చేందుకు బాధితురాలు నిరాకరించారు. రేపు మాపు అని వాయిదా వేసి చివరికి వైద్య పరీక్షలు చేయించుకోలేదు.
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
తనపై హనీ ట్రాప్‌కు పాల్పడ్డారని హైకోర్టులో పిటిషన్ వేసిన ఆదిమూలం
ఈ లోపు కోనేటి ఆదిమూలం.. తనపై పోలీసులు నిబంధనలకు వ్యతిరేకంగా కేసులు పెట్టారని బాధితురాలు ఫిర్యాదు చేయకపోయినా కేసు పెట్టారని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా ఆరోపణల్లో నిజానిజాలు చూడకుండా పోలీసులు కేసు నమోదు చేశారని వాదించారు. ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా బయట పెట్టడం వెనుక కుట్ర ఉందన్నారు. ఈ ఘటన హనీట్రాప్‌గా ఆదిమూలం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కన్ఫామ్, వారిపై కఠిన చర్యలు - చంద్రబాబు
పిటిషనర్లు రాజీ పడ్డారని చెప్పిన లాయర్లు - పిటిషన్ డిస్పోజ్
ఆ మహిళ ఫిర్యాదు చేయకపోవడం.. తమ క్లయింట్లు ఇద్దరూ కోర్టు బయట రాజీ పడ్డారని హైకోర్టుకు లాయర్లు చెప్పడంతో కోర్టు బయట వీరిద్దరూ సమస్య పరిష్కరించునేందుకు వీలుగా పిటిషన్ ను డిస్పోజ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల కేసు నుంచి బయటపడినట్లయింది. ఇప్పటికే టీడీపీ సస్పెన్షన్ వేటు వేసినందున.. త్వరలో అది ఎత్తివేసే అవకాశం ఉంది.