Sankranti Special Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్- సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు, తేదీలివే
Makar Sankranti 2024: సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా మరో 5 రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
Sankranti Special Train Services: హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంతూరికి వెళ్తున్నవారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా మరో 5 రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాచిగూడ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్, H.S నాందేడ్ - కాకినాడ టౌన్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు సేవలు అందించనున్నాయి.
రైల్వేశాఖ తాజాగా ప్రకటించిన ప్రత్యేక రైళ్ల వివరాలివే..
1. 07041 కాచిగూడ - తిరుపతి 20.25 (శుక్రవారం) బయలుదేరి శనివారం ఉదయం 09.00కు తిరుపతి చేరుతుంది . రైలు బయలుదేరే తేదీ జనవరి 12, 2024
2. 07042 తిరుపతి - కాచిగూడ శనివారం రాత్రి 7.50 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 08.50 కు కాచిగూడ చేరనుంది. రైలు బయలుదేరే తేదీ జనవరి 13
3. 07060 తిరుపతి - సికింద్రాబాద్ శుక్రవారం రాత్రి 8.25 గంటలకు బయలేదరి శనివారం ఉదయం 09.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రైలు బయలుదేరే తేదీ జనవరి 12
4. 07487 H.S నాందేడ్ - కాకినాడ టౌన్ సోమవారం మధ్యాహ్నం 2.25 గంటలకు నాందెడ్ లో బయలుదేరి మంగళవారం ఉదయం 08.10 గంటలకు కాకినాడ చేరనుంది. రైలు బయలుదేరే తేదీ జనవరి 15
5. 07488 కాకినాడ టౌన్ – H.S నాందేడ్ రైలు మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 3.10 గంటలకు నాందేడ్ చేరాల్సి ఉంది. రైలు బయలుదేరే తేదీ జనవరి 16