అన్వేషించండి

Satyavedu MLA: 100 కోట్లిస్తే మా నాన్న రాజీనామా చేస్తారు - సత్యవేడు ఎమ్మెల్యే కుమారుడి ప్రకటన- ఈ ఆఫర్ ఎవరికంటే?

Satyavedu MLA : వంద కోట్లు ఇస్తే సత్యవేడు ఎమ్మెల్యే రాజీనామా చేస్తారని ఆయన కుమారుడు చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. టీడీపీ సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Satyavedu MLA Rs 100 crores:  సత్యవేడు రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.  తన తండ్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వెనుక పెద్ద  రాజకీయ కుట్ర ఉందని, తమను రాజకీయంగా సమాధి చేసేందుకు కొందరు కావాలనే లైంగిక ఆరోపణల డ్రామా ఆడించారని ఆయన  ఆరోపించారు.  ముఖ్యంగా నియోజకవర్గంలో పార్టీ కోసం తాము ఇప్పటివరకు రూ. 100 కోట్లు  ఖర్చు చేశామని, ఆ డబ్బును తమకు తిరిగి ఇచ్చేస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటామని ఆయన సంచలన డిమాండ్ చేశారు. తమ సామాజిక వర్గానికి చెందిన నాయకులను తొక్కేస్తున్నారని ఆరోపిస్తూనే,  గౌరవం లేని చోట మేము ఉండలేం, మా డబ్బే మాకు ముఖ్యం  అనే రీతిలో బాబు, లోకేష్‌లను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

కార్యకర్తపై లైంగిక వేధింపులకు పాల్పడిన కోనేటి ఆదిమూలం

 సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై 2024 సెప్టెంబర్‌లో ఒక మహిళా టీడీపీ కార్యకర్త లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ కొన్ని వీడియోలను బయటపెట్టడం పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన టీడీపీ అధిష్టానం, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిందన్న కారణంతో తక్షణమే ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే, ఆ తర్వాత బాధితురాలు కోర్టులో తన ఆరోపణలు వెనక్కి తీసుకున్నప్పటికీ, అధిష్టానం మాత్రం ఆదిమూలంపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయలేదు. ఇది ఆ కుటుంబంలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.

 సుమన్ ఆవేదన వెనుక అసలు కారణం 

సస్పెన్షన్ ఎత్తివేయకపోవడమే కాకుండా, సత్యవేడు నియోజకవర్గంలో ఆదిమూలాన్ని కాదని గంగా ప్రసాద్ వంటి ఇతర నేతలను ఇన్ఛార్జిగా నియమించే ప్రయత్నాలు జరుగుతుండటం సుమన్‌ను ఆగ్రహానికి గురిచేసింది. ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత, ఒక ఆరోపణ రాగానే తమను ఇలా పక్కన పెట్టడం వెనుక కుట్ర ఉందని ఆయన భావిస్తున్నారు. అందుకే,  మేము పెట్టిన రూ. 100 కోట్లు ఇచ్చేస్తే రాజీనామా చేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.   

 సత్యవేడు టీడీపీలో వర్గపోరు 

సత్యవేడు టీడీపీలో ఆదిమూలంకు, ఇతర స్థానిక నేతలకు మొదటి నుంచీ పొసగడం లేదు. ప్రోటోకాల్ విషయంలోనూ, నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయంలోనూ ఆదిమూలం వర్గాన్ని ఇతర నేతలు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆదిమూలంపై వచ్చిన లైంగిక ఆరోపణలు కూడా ఒక పథకం ప్రకారం జరిగిన కుట్రలో భాగమేనని, తన తండ్రి   రాజకీయ జీవితాన్ని ముగించేందుకే ఈ డ్రామా ఆడారని సుమన్ ఆరోపిస్తున్నారు.

 సస్పెన్షన్ ఎందుకు కొనసాగుతోంది? 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు క్రమశిక్షణ విషయంలో రాజీ పడకూడదన్న ఉద్దేశంతోనే ఆదిమూలంపై సస్పెన్షన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీడియోలు బయటకు రావడం వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని, మళ్ళీ ఆయనను చేర్చుకుంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్టానం భావిస్తోంది. అదే సమయంలో, సత్యవేడులో బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేయడంపై లోకేష్ దృష్టి సారించడంతో ఆదిమూలం కుటుంబం ఇప్పుడు గొంతు పెంచింది. ప్రస్తుతం సత్యవేడు టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు ఆదిమూలం తన పదవిని కాపాడుకుంటూనే మళ్ళీ పార్టీలోకి రావాలని ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఆయన కుమారుడు బహిరంగంగా విమర్శలు చేయడం ద్వారా పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు.    

టాప్ హెడ్ లైన్స్

BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget